Petrol-GST: పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గే ఛాన్స్.. జీఎస్‌టీ పరిధిలోకి తెచ్చేందుకు చర్చలు.. మండలి సమావేశం తర్వాత కీలక నిర్ణయం

పెట్రోల్ ధర భారీగా తగ్గబోతోందా..? రెండంకెల్లోకి మారబోతోందా..? పెట్రోలు, డీజిల్‌ ధరల విషయంలో దేశ ప్రజలు త్వరలో శుభవార్త వింటారా..? రానున్న కొద్ది రోజుల్లో వాటి ధరల భారం నుంచి ఉపశమనం లభించే అవకాశం ఉందా..? 

Petrol-GST: పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గే ఛాన్స్.. జీఎస్‌టీ పరిధిలోకి తెచ్చేందుకు చర్చలు.. మండలి సమావేశం తర్వాత కీలక నిర్ణయం
Petrol Gst
Follow us
Sanjay Kasula

|

Updated on: Sep 15, 2021 | 8:45 AM

పెట్రోల్ ధర భారీగా తగ్గబోతోందా..? రెండంకెల్లోకి మారబోతోందా..? పెట్రోలు, డీజిల్‌ ధరల విషయంలో దేశ ప్రజలు త్వరలో శుభవార్త వింటారా..? రానున్న కొద్ది రోజుల్లో వాటి ధరల భారం నుంచి ఉపశమనం లభించే అవకాశం ఉందా..?  అనువననే అనిపిస్తోంది. రాబోయే రోజుల్లో మంచి వార్త వింటారని ఇప్పటికే కేంద్ర మంత్రి చెప్పిన సంగతి తెలిసిందే.. అయితే.. పెట్రోల్‌, డీజిల్‌, ఇతర పెట్రోలియం ఉత్పత్తులను వస్తు, సేవల పన్ను (GST) పరిధిలోకి తీసుకొచ్చే అంశంపై శుక్రవారం జరగనున్న జీఎస్‌టీ మండలి సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రో ఉత్పత్తులపై భారీగా వసూలు చేస్తున్న పన్ను ఆదాయంలో కొంత కోల్పోవడానికి సుముఖత చూపితేనే ఈ అంశంపై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.

పెట్రో ఉత్పత్తులను GST పరిధిలోకి తెస్తే వినియోగదార్లకు భారీగా ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. దాదాపు 20 నెలల తర్వాత GST మండలి శుక్రవారం లఖ్‌నవూలో సమావేశం జరగబోతోంది. 2019 డిసెంబరు 18 తర్వాత ఈ సమావేశాలు వర్చువల్ మీటింగ్ జరుగుతూ వచ్చాయి. అయితే కోవిడ్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో పెట్రోల్‌, డీజిల్‌లను GST పరిధిలోకి తీసుకొచ్చే అంశంపై జీఎస్‌టీ మండలి ప్రత్యేకంగా చర్చించనున్నారు. చర్చలు సానుకూలంగా సాగితే పెట్రోల్ ధరలు తగ్గించే అంశంపై నిర్ణయం తీసుకుంటారు. ఇప్పటికే గత జూన్‌లో కేరళ హైకోర్టు సూచించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై చర్చించాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. కరోనా ఔషధాలు, ఆక్సిజన్‌, ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు వంటి వాటిపై పన్ను మినహాయింపులను కొనసాగించే అంశంపైనా చర్చిస్తారని సమాచారం.

 సెంట్రల్ టాక్స్‌తో సహా వ్యాట్‌ రూపంలో పెట్రోల్‌, డీజిల్‌పై ప్రస్తుతం రిటైల్‌ విక్రయ ధరలో 50 శాతం పన్నులే ఉంటున్నాయి. ఒకవేళ వీటిని GST పరిధిలోకి తీసుకొస్తే గరిష్ఠ పన్ను 28 శాతంతో సహా ఫిక్స్‌డ్‌ సర్‌ఛార్జి ఉండే అవకాశముంది. దీంతో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు కొంత తగ్గేందుకు ఛాన్స్ ఉంది.

కేంద్రం ప్రస్తుతం లీటర్‌ పెట్రోల్‌పై రూ.32.80, డీజిల్‌పై రూ.31.80 సుంకం విధిస్తోంది. ఈ పన్ను మొత్తం కేంద్ర ఖాతాలోకే వెళుతోంది. GST పరిధిలోకి వస్తే రాష్ట్రాలు, కేంద్రం మధ్య 50-50 నిష్పత్తిలో ఆదాయాలు పంచుకోవాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి: Mudanammakalu: కడుపునొప్పికి భూత వైద్యురాలి ట్రీట్మెంట్.. నొప్పి ఎంతకూ తగ్గకపోవడంతో వైద్యుడి వద్దకు.. కట్ చేస్తే..

100 Years: మొదటి ఆఫీసర్స్ కాన్ఫరెన్స్‌కు వందేండ్లు.. ఇవాళ అఖిల భారత శాసన సభాపతుల సదస్సు..