Apple iPhone 13: మార్కెట్లో విడుదలైన ఐఫోన్‌ 13.. అద్భుతమైన ఫీచర్స్‌, ధరల వివరాలు..!

Subhash Goud

Subhash Goud |

Updated on: Sep 15, 2021 | 7:43 AM

Apple iPhone 13: మార్కెట్లో రకరకాల స్మార్ట్‌ఫోన్లు విడుదలవుతున్నాయి. కస్టమర్లను మరింతగా ఆకట్టుకునేందుకు అత్యాధునిక ఫీచర్స్‌ను జోడిస్తూ విడుదల చేస్తున్నాయి ఆయా..

Apple iPhone 13: మార్కెట్లో విడుదలైన ఐఫోన్‌ 13.. అద్భుతమైన ఫీచర్స్‌, ధరల వివరాలు..!

Apple iPhone 13: మార్కెట్లో రకరకాల స్మార్ట్‌ఫోన్లు విడుదలవుతున్నాయి. కస్టమర్లను మరింతగా ఆకట్టుకునేందుకు అత్యాధునిక ఫీచర్స్‌ను జోడిస్తూ విడుదల చేస్తున్నాయి ఆయా మొబైల్‌ కంపెనీలు. ఇక టెక్‌ దిగ్గజం యాపిల్‌ ఫోన్‌ గురించి పెద్దగా చెప్పనక్కరలేదు. దీని నుంచి మరో ఫోన్‌ విడుదలైంది. ఇక యాపిల్‌ మంగళవారం కొత్త ఐఫోన్‌ 13 మోడల్స్‌ను ఆవిష్కరించింది. ప్రతీ ఏడాదిలానే ఈ సెప్టెంబర్‌ 14న కాలిఫోర్నియాలో జరిగిన ‘యాపిల్‌ ఈవెంట్‌’లో ఐఫోన్‌ 13 శ్రేణిని విడుదల చేశారు. గత ఏడాది వచ్చిన ఐఫోన్‌ 12 మోడల్‌తో పోల్చితే 13లో కొద్దిపాటి మార్పులు చేశారు. కెమెరా సెన్సార్‌, మెరుగైన అల్ట్రావైడ్‌ కెమెరాల్ని అమర్చారు. ఐఫోన్‌ 13 మోడల్‌ 6.1 అంగుళాలు, ఐఫోన్‌ 13 మిని 5.4 అంగుళాలలో 128 జీబీ, 64 జీబీ స్టోరేజ్‌ ఆప్షన్లు ఉన్నాయి. ఐఫోన్‌ 13 ప్రొ మోడల్‌ 6.1 అంగుళాలు, ఐఫోన్‌ ప్రొ మ్యాక్స్‌ 6.7 అంగుళాలు 128 జీబీ, 256 జీబీ, 512 జీబీ స్టోరేజ్‌ వెర్షన్లతో మార్కెట్లోకి విడుదలయ్యాయి. ఈ నెల 17 నుంచి ముందస్తు బుకింగ్‌లు చేసుకోవచ్చు. 24 నుంచి అందుబాటులోకి వస్తాయి

ఫీచర్లు:

కొత్త రంగులు పింక్‌, బ్రాంజ్‌, గ్రాఫైట్‌ గ్రేల్లో సైతం లభిస్తాయి. శక్తివంతమైన సీపీయూతో 50 శాతం ఫాస్ట్‌గా పనిచేస్తుంది. అడ్వాన్స్‌డ్‌ డ్యూయల్‌ కెమెరా సిస్టమ్‌ ఏర్పాటు చేశారు. గత మోడల్స్‌తో పోలిస్తే బ్యాటరీలు పెద్దవి. ఇంటర్నల్‌ స్పేస్‌ సేవింగ్‌ డిజైన్‌ కారణంగా బరువు కూడా ఎక్కువే. ఇక ఐఫోన్‌ 12తో పోలిస్తే బ్యాటరీ లైఫ్‌ 2.5 గంటలు ఎక్కువ. వేగవంతమైన 6ఈ స్టాండర్డ్‌ వైఫైని, 5జీ సర్వీసుల్ని సపోర్ట్‌ చేస్తుంది. ఈవెంట్‌లో నూతన శ్రేణి థర్డ్‌ జనరేషన్‌ ఐపాడ్స్‌ను, కొత్త యాపిల్‌ వాచ్‌ 7 సిరీస్‌ను (5జీ ఎనేబుల్డ్‌) కూడా ఆవిష్కరించారు. ఐఫోన్ 13 సిరీస్‌లో కొత్త ఫేస్ అన్‌లాక్ టెక్ ఉంటుంది. అది ముసుగులు లేదా పొగమంచు గ్లాసెస్ ధరించినప్పుడు కూడా పనిచేస్తుంది.

రెండు మోడళ్లలో 12 మెగాపిక్సెల్స్ డ్యూయల్ రియర్ కెమెరా ఉంది. దీనిలో, మొదటిది వైడ్, రెండవ అల్ట్రా వైడ్ యాంగిల్‌కు మద్దతు ఇస్తుంది. వైడ్ లెన్స్‌లో ఎపర్చరు /1.6, అల్ట్రా వైడ్ లెన్స్‌లో అపెర్చర్ /2.4 ఉన్నాయి. ఇది 120 డిగ్రీల ప్రాంతాన్ని కవర్ చేసేలా ఏర్పాటు చేశారు. ఇది 2ఎక్స్, ఆప్టికల్, 5ఎక్స్ డిజిటల్ జూమ్‌లకు మద్దతు ఇస్తుంది. సెల్ఫీ కోసం 12 మెగాపిక్సెల్ లెన్స్ కూడా ఉంది. దీనికి షిఫ్ట్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఇచ్చారు. ఇది 63 మెగాపిక్సెల్‌లకు సమానమైన పనోరమా షాట్‌లను తీసుకోవచ్చు. ఇది నైట్ మోడ్, డీప్ ఫ్యూజన్, స్మార్ట్ HDR 4, లైవ్ ఫోటోలు వంటి మోడ్‌లను కలిగి ఉంది.

ఇందులో వీడియోగ్రఫీ కోసం సినిమాటిక్ మోడ్ ఉంది. దీనితో, మీరు పూర్తి హోచ్ డీ (HD 1080p) లో సెకనుకు 30 ఫ్రేమ్‌ల వద్ద రికార్డ్ చేయగల సామర్థ్యం ఉంది.  ఇక  హెచ్ డీఆర్ (HDR) వీడియో రికార్డింగ్, 4K డాల్బీ విజన్ రికార్డింగ్ కూడా చేయగలరు. యూజర్ పూర్తి HD రిజల్యూషన్‌తో స్లో మోషన్ వీడియోలను కూడా షూట్ చేయగలరు. దీనితో పాటు, టైమ్ లాప్స్, నైట్ మోడ్, వీడియో రికార్డింగ్ సమయంలో 8MP ఫోటో, ప్లేబ్యాక్ జూమ్ వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

ఐఫోన్ 13, ఐఫోన్ 13 మినీ బ్లాక్, బ్లూ, పింక్, పర్పుల్, ప్రొడక్ట్ (రెడ్), వైట్ కలర్స్‌లో లభించనున్నాయి. అయితే ఇతర కలర్ వేరియంట్‌లు గత సంవత్సరం ఐఫోన్ 12 మోడళ్లకు సమానంగా ఉండనున్నాయి. ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మాక్స్ ఇతర వైపున, బ్లాక్, సిల్వర్, గోల్డ్, కాంస్యం రంగులలో ఉండనున్నట్లు తెలుస్తుంది. ఇవి ఐఫోన్ 12 ప్రో, ఐఫోన్ 12 ప్రో మాక్స్‌లో లభించే గ్రాఫైట్, సిల్వర్, గోల్డ్, పసిఫిక్ బ్లూ షేడ్స్‌కి భిన్నంగా ఉంటాయని పేర్కొంది. ఇలా రకరకాల ఫోన్‌లు మార్కెట్లోకి విడుదల చేస్తుండటంతో స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేసేవారి సంఖ్య పెరిగిపోతోంది. టెక్నాలజీని ఉపయోగించుకుని అత్యాధునిక ఫీచర్స్‌ను జోడిస్తున్నాయి కంపెనీలు.

ఐఫోన్‌ 13 ప్రో ధరలు.. రూ.1,19,900, రూ.1,29,900, రూ.1,49,900, ఇక 128జీబీ, 256జీబీ, 512 జీబీ ధరలు రూ.1,69,900, 1టీబీ ఐఫోన్‌ 13 మ్యాక్స్‌ 128జీబీ,256జీబీ, 512జీబీ, 1టీబీ వేరియంట్ల ధరలు రూ.1,29,900, రూ.1,39,900, రూ.1,59,900, రూ.1,79,900 ఉండనున్నాయి.

Sim Fraud: రూ.11 రీచార్జ్‌ చేసినందుకు బ్యాంకు అకౌంట్‌ నుంచి రూ.6 లక్షలు మయం.. మోసగాడి వలలో సీనియర్‌ సిటిజన్‌

Train Coach Washing Plant: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. కోచ్‌లను శుభ్రం చేసే ఆటోమేటిక్‌ వాషింగ్‌ ప్లాంట్‌

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu