ITR Filing: ఈజీగా ఈ-ఫైలింగ్ చేసే విధానం ఇదే.. తొలిసారి పన్ను చెల్లింపుదారులు అస్సలు మిస్ అవ్వొద్దు..

తొలిసారి పన్నులు చెల్లించేటప్పుడు కచ్చితంగా ఆదాయ పన్ను శాఖ వెబ్ సైట్ లో గానీ లేదా పన్నుల నిపుణుడిని గానీ సంప్రదించాలి. వారి సలహాలు తీసుకొని కచ్చితమైన డేటాతో ఐటీఆర్ ను దాఖలు చేయాల్సి ఉంటుంది. అయితే అంతకన్నా ముందు ఇన్ కమ్ ట్యాక్స్ పోర్టల్ లో రిజిస్టర్ కావాల్సి ఉంటుంది. అదెలాగో చూద్దాం..

ITR Filing: ఈజీగా ఈ-ఫైలింగ్ చేసే విధానం ఇదే.. తొలిసారి పన్ను చెల్లింపుదారులు అస్సలు మిస్ అవ్వొద్దు..
Income Tax
Follow us

|

Updated on: May 11, 2023 | 4:15 PM

ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్(ఐటీఆర్)ఫైలింగ్ అనేది పన్ను పరిధిలోకి వచ్చే ప్రతి వ్యక్తికి చాలా ముఖ్యమైనది. మనకు వచ్చే ఆదాయం, కట్టే పన్నుకు సంబంధించిన సమాచారాన్ని ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌కు సమర్పించే ఫామ్‌నే ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్ అంటారు. ఒక ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ఆదాయం మీద ఆ తరువాత ఆర్థికసంవత్సరంలో రిటర్నులు దాఖలు చేయాలి. ఇది వ్యక్తుల సంపాదనను బట్టి ఎంత మొత్తంలో పన్నులు కట్టాలనేది ఆధారపడి ఉంటుంది. వ్యక్తుల ఆదాయాన్ని బట్టి పన్ను కట్టే విధానాల్లో కూడా మార్పులు ఉంటాయి.

అందుకే తొలిసారి పన్నులు చెల్లించేటప్పుడు కచ్చితంగా ఆదాయ పన్ను శాఖ వెబ్ సైట్ లో గానీ లేదా పన్నుల నిపుణుడిని గానీ సంప్రదించాలి. వారి సలహాలు తీసుకొని కచ్చితమైన డేటాతో ఐటీఆర్ ను దాఖలు చేయాల్సి ఉంటుంది. అయితే అంతకన్నా ముందు ఇన్ కమ్ ట్యాక్స్ పోర్టల్ లో రిజిస్టర్ కావాల్సి ఉంటుంది. అందుకోసం ఏం చేయాలి? రిజిస్టర్ కావడానికి అవసరమైన డాక్యూమెంట్స్ ఏమిటి? ఎలా రిజస్టర్ కావాలి వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఈ పత్రాలు పక్కాగా ఉండాలి..

వ్యక్తిగత ట్యాక్స్ కట్టాలనుకునే వారు పాన్ కార్డు, వర్కింగ్ లో ఉన్న ఫోన్ నంబర్, ఈమెయిల్ అడ్రస్, ప్రస్తుతం ఉంటున్న ఇంటి చిరునామాలను తప్పనిసరిగా కలిగి ఉండాలి.

ఇవి కూడా చదవండి

రిజిస్ట్రేషన్ విధానం ఇది..

  • మొదటిగా ఇన్ కమ్ ట్యాక్స్ అధికారిక ‘ఈ ఫైలింగ్’ పోర్టల్ లోకి వెళ్లాలి.
  • హోమ్ పేజిలో కుడిచేతి వైపు ఉన్న ‘రిజిస్టర్ యువర్ సెల్ఫ్’ అనే బటన్ ని క్లిక్ చేయాలి.
  • దానిలో యూజర్ టైప్ ‘ఇండివిడ్యువల్’ ని ఎంపిక చేసుకొని, కంటిన్యూ పై క్లిక్ చయాలి.
  • ఆ తర్వాత ఓపెన్ అయిన ఫారంలో పాన్ నంబర్, మీ పూర్తి పేరు ఇంటి పేరుతో సహా, ఇంటి అడ్రస్ వివరాలు ఎంటర్ చేసి, కంటిన్యూపై క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత కచ్చితంగా సమర్పించాల్సిన వివరాలను ఫారంలో నింపాలి. దానిలో పాస్ వర్డ్ వివరాలు, కాంటాక్ట్ వివరాలు, ప్రస్తుతం ఉంటున్న ఇంటి అడ్రస్ వంటివి నింపి సబ్మిట్ పై క్లిక్ చేయాలి.
  • ఇది పూర్తయిన తర్వాత దేశ పౌరులైతే ఆరు అంకెలతో కూడిన ఓటీపీ1, ఓటీపీ2 మీరు ఇచ్చిన ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడీకి వస్తుంది. అదే నాన్ రెసిడెంట్స్ అయితే మీరు ఇచ్చిన ప్రైమరీ ఈమెయిల్ ఐడీకి ఓటీపీ వస్తుంది.
  • ఆ ఓటీపీను ఎంటర్ చేస్తే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తవుతుంది. ఆ తర్వాత ఐటీఆర్ డ్యాష్ బోర్డులో ఫారం నింపాల్సి ఉంటుంది.

ఐటీఆర్ దాఖలు చేయడం ఇలా..

  • రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత మీ యూజర్, ఐడీ పాస్ వర్డ్ లను తీసుకొని అధికారిక ఆదాయ పన్ను శాఖ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • అక్కడ హోమ్ పేజిపై లాగిన్ అనే బటన్ క్లిక్ చేయాలి. మీ యూజర్ ఐడీ(పాన్ నంబర్), పాస్ వర్డ్ తో లాగిన్ అవ్వాలి.
  • అప్పుడు ఈ ఫైలింగ్ డ్యాష్ బోర్డులోకి మిమ్మల్ని వెబ్ సైట్ తీసుకెళ్తుంది.
  • దానిలో ఈ ఫైల్ అనే ట్యాబ్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి.
  • డ్రాప్ డౌన్ మెనూలో ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయాలి.
  • దానిలో మీరు చెల్లించాలనుకుంటున్న ఇన్ కమ్ ట్యాక్స్ అసెస్మెంట్ ఇయర్ ని ఎంపిక చేసుకోవాలి.
  • ఆ తర్వాత మీ ఆదాయానికి తగిన ఐటీఆర్ ఫారం ను ఎంపిక చేసుకొని పన్ను చెల్లించాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..