Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Buy a Home: కొత్త ఇంటిని కొనుగోలు చేయాలా? ఈ జాగ్రత్తలు పాటించకపోతే ఇక అంతే సంగతులు…

ఇంటిని కొనుగోలు చేయడం అనేది ఒక వ్యక్తి జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలలో ఒకటని మార్కెట్ రంగ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మొదటిసారిగా ఇంటిని కొనుగోలు చేయడం అంటే జీవితానికి సంబంధించి ఓ మంచి నిర్ణయం తీసుకున్నట్లేనని వారి వాదన.

Buy a Home: కొత్త ఇంటిని కొనుగోలు చేయాలా? ఈ జాగ్రత్తలు పాటించకపోతే ఇక అంతే సంగతులు…
Home
Follow us
Srinu

|

Updated on: May 11, 2023 | 4:15 PM

సొంతిల్లు అనేది ప్రతి మధ్యతరగతి కుటుంబం కల. ఆ కలను సాకారం చేసుకోవడానికి ముందు నుంచే పొదుపు మంత్రం జపిస్తూ కొంత సొమ్ము సమకూరిన తర్వాత ఈఎంఐలపై ఇల్లును కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇంటిని కొనుగోలు చేయడం అనేది ఒక వ్యక్తి జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలలో ఒకటని మార్కెట్ రంగ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మొదటిసారిగా ఇంటిని కొనుగోలు చేయడం అంటే జీవితానికి సంబంధించి ఓ మంచి నిర్ణయం తీసుకున్నట్లేనని వారి వాదన. ఇప్పుడు ప్రాపర్టీల ధరలు పెరుగుతున్నప్పటికీ, నివాస, వాణిజ్య సహా విభాగాల్లో రియల్ ఎస్టేట్ డిమాండ్ కూడా పెరుగుతోంది. ప్రాపర్టీని కొనుగోలు చేసేటప్పుడు మొదటిసారిగా గృహాలను కొనుగోలు చేసేవారు గుర్తుంచుకోవాల్సిన విషయాలను నిపుణులు వివరిస్తున్నారు. ఎందుకంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఇంటిని కొనుగోలు చేస్తే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఇంటిని కొనుగోలు చేసే సమయంలో తీసుకోెవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఓ సారి తెలుసుకుందాం. 

ప్రాధాన్యతను నిర్ణయించుకోవడం

మనం కొనుగోలు చేసే ప్రతి వస్తువు చివరికి కొనుగోలుదారుడి అంతిమ అవసరానికి తీరుస్తుంది. ముఖ్యంగా ఇంటిని కొనుగోలు చేసే ముందు కొంత గ్రౌండ్ వర్క్ చేస్తే ఎలాంటి ఇంటిని కొనుగోలు చేయాలని అనుకుంటున్నామో? అనే నిర్ణయాన్ని సులభంగా తీసుకోవచ్చు. ముఖ్యంగా కొనుగోలుదారు పెద్ద స్థలం కోసం వెతుకుతున్నప్పటికీ బడ్జెట్ పరిమితి ఉంటే లేదా ధరపై మంచి డీల్ కావాలనుకుంటే ప్రఖ్యాత డెవలపర్‌ల నిర్మాణంలో ఉన్న ప్రాపర్టీలు కొనుగోలు చేయడం ఉత్తమమని నిపుణులు పేర్కొంటున్నారు. ఎవరైనా కోరుకునే వాస్తవ ఆస్తి ఎల్లప్పుడూ బడ్జెట్ కంటే 20-30 శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అందుబాటులో ఉన్న గృహ రుణాన్ని ఉపయోగించి ఆస్తిని కొనుగోలు చేయడం ఉత్తమం. ఒక్కోసారి 20-30 శాతం దాటినా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ ఆస్తి విలువ కొన్ని సంవత్సరాల్లో రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పన్ను ఆదా చేయాలని కోరుకునే వారు రెడీ-టు-మూవ్-ఇన్ ఆస్తి కొనుగోలు చేయడం ఉత్తమం. కొనుగోలుదారు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ (ఓసీ) తుది స్వాధీనం, అప్పగించే వరకు నిర్మాణంలో ఉన్న ఆస్తి కోసం గృహ రుణాలపై చెల్లించే వడ్డీపై పన్ను ప్రయోజనాలను క్లెయిమ్ చేయలేరని నిపుణులు పేర్కొంటున్నారు. 

బిల్డర్ పరిశోధన

ఇంటిని కొనుగోలు చేయాలనుకునేవారు బిల్డర్ గురించి క్షుణ్ణంగా పరిశోధన చేయడం ఉత్తమం. బిల్డర్ గతంలో ఎన్ని ప్రాజెక్ట్‌లను డెలివరీ చేశారు? బిల్డర్ పేరుతో ఏవైనా వివాదాస్పద ప్రాజెక్ట్‌లు ఉన్నాయా? మొదలైన వాటిపై బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేయడం ఎల్లప్పుడూ మంచిది. ప్రస్తుతరం రెరా కొనుగోలుదారులు బిల్డర్ యొక్క ప్రామాణికతను తనిఖీ చేయడాన్ని సులభతరం చేసింది. అలాగే, ఛానెల్ భాగస్వామిని జాగ్రత్తగా ఎంచుకోవడం, అలాగే ఆస్తికి సంబంధించిన అన్ని సూక్ష్మ అంశాల గురించి విచారించడం కూడా అంతే ముఖ్యం. తద్వారా లావాదేవీ పూర్తిగా పారదర్శకంగా ఉంటుంది. దీంతో ఆ డెవలపర్‌తో ఉత్తమ ధరకు మీకు అందుబాటులో ఉన్న అత్యుత్తమ ఇన్వెంటరీని పొందవచ్చు.

ఇవి కూడా చదవండి

నిబంధనల తనిఖీ

కొత్త గృహ కొనుగోలుదారులు ఒక నిర్దిష్ట ఆస్తి పర్యావరణ మరియు స్థిరత్వ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మిస్తున్నారో? లేదో? తెలుసుకోవడం ఉత్తమం. ముఖ్యంగా అవసరమైన ధ్రువపత్రాలను కలిగి ఉందో? లేదో? కూడా చూడాలి. ఆస్తిని జీవించడం కోసం లేదా దీర్ఘకాలిక పెట్టుబడి కోసం కొనుగోలు చేసినా, అవసరమైన పర్యావరణ అనుకూలతలను అనుసరించే స్థిరమైన ప్రాజెక్ట్ ఎల్లప్పుడూ దీర్ఘకాలంలో అధిక విలువను పొందుతుందని గుర్తుంచుకోవాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి