AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Buying own house: కొత్త సంవత్సరంలో సొంతిల్లు కొనాలనుకుంటున్నారా? అయితే ఈ తప్పులు చేయకండి..

మూడు గదులున్నా.. రెండు గదులున్నా సొంతిల్లు అయితే చాలు. అదే భద్రత.. ధైర్యం అనే ఆలోచన చాలా మందికి ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరి జీవితంలో అతిపెద్ద కల,

Buying own house: కొత్త సంవత్సరంలో సొంతిల్లు కొనాలనుకుంటున్నారా? అయితే ఈ తప్పులు చేయకండి..
Buying Own House
Anil kumar poka
|

Updated on: Dec 12, 2022 | 10:47 AM

Share

మూడు గదులున్నా.. రెండు గదులున్నా సొంతిల్లు అయితే చాలు. అదే భద్రత.. ధైర్యం అనే ఆలోచన చాలా మందికి ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరి జీవితంలో అతిపెద్ద కల, సొంతిల్లు. ఓ చోట స్థలం కొని.. దానిలో మన అభిరుచికి తగ్గట్లు ఓ ఇల్లు కట్టుకోవడం అనేది ప్రస్తుత పరిస్థితుల్లో పెద్ద ప్రహసనం. అందుకే చాలా మంది రెడీమేడ్‌ ఇళ్లను కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. అయితే తొలిసారి సొంత గృహం కొనుగోలు చేస్తున్నామనే సంబరంలో చాలా మంది అనాలోచితంగా, వేగంగా నిర్ణయాలు తీసుకుని తర్వాత బాధపడుతుంటారు. అందుకే తొలిసారి ఇల్లు కొనుక్కోవాలనుకునే వారు అనేక విషయాలను బేరీజు వేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో సొంతిల్లు కొనాలనుకునేవారు సాధారణంగా చేసే తప్పులు ఏంటి?ఆ తప్పులను ఎలా అధిగమించాలి? ఏయే విషయాలను దృష్టిలో పెట్టుకుని ఇల్లు కొనుగోలు చేయాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఏ ప్రాంతంలో ఉంది.. ఇల్లు కొనాలి అనుకునే వారు మొదటిగా ఆలోచించాల్సిన విషయం ‘ ‘లొకాలిటీ’.. ఈ విషయంలో చాలా మంది తప్పులు చేస్తుంటారు. ఆ ప్రాంత వివరాలు సరిగ్గా తెలుసుకోకుండా చుట్టుపక్కల ప్రదేశాలపై అవగాహన లేకుండా ఇల్లు కొనేస్తుంటారు.  తర్వాత ఇబ్బందులు పడతారు. ఉదాహరణకు మీరు ఇల్లు కొన్న చోటుకి సమీపంలో ఓ వ్యర్థ నీటి శుద్ధి ప్లాంట్‌ ఉందనుకోండి.. దాని నుంచి విపరీతమైన దుర్వాసన వ్యాపిస్తూ ఉంటుంది. దీని వల్ల మీరు ఇబ్బందులు పడటంతో పాటు భవిష్యత్తులో ఆ ఇంటిని తిరిగి అమ్మాలన్నా పెద్దగా ధర వచ్చే అవకాశం ఉండదు. అందుకనే మీరు ఎంచుకునే ప్రాంతం గురించి పూర్తిగా అధ్యయనం చేయాలి. చుట్టుపక్కలే బడి, గుడి, సరైన రోడ్డు, ఆస్పత్రి తదితరాలు ఉండేట్లు చూసుకోవాలి.

బయటకు చెప్పని ధరలపై.. ఏదైనా ఇంటిని కొనాలనుకునే వారు తొలుత దాని అసలు ధరతో పాటు ఏమైనా బయటకు చెప్పని విధంగా ఫీజులు  ఉన్నయేమో క్లియర్‌గా అడగాలి. వీటిని హిడెన్‌ కాస్ట్స్‌ అంటారు. డెవలప్‌మెంట్‌ చార్జెస్‌ అని, ఎమినిటీ కాస్ట్స్‌, ఏడాది మెయింటెనెన్స్‌ ఫీజు అడ్వాన్స్‌గా కట్టడం వంటివి అసలు ధరకు జోడించి చెప్పరు. ఇల్లు కొనాలి అనుకునే వారు వీటిపై అవగాహన పెంచుకోవాలి. వాటిన్నంటిని సక్రమంగా కాలిక్యులేట్‌ చేసుకోవాలి.

అసలు ధరలు ఎలా ఉన్నాయి.. వీలైనంత త్వరగా ఇల్లు కొనాలి అనుకునే ఆరాటంలో అవసరానికి మించి ధరలను వెచ్చిస్తుంటారు. అలా కాకుండా మీరు కొనాలనుకునే ప్రాంతంలో అసలు రేట్లు ఎలా ఉన్నాయి అనేది తెలుసుకోవాలి. బార్‌ గెయినింగ్‌ చేయాలి. మంచి లొకాలిటీ లో అనువైన ధరకు ఇల్లు కొనుగోలు చేసుకోవాలి.

ఇంటిని స్వయంగా చూడాలి.. చాలా మంది ఇల్లు కొంటున్నాం అనే తొందరపాటులో ఇతరులు చెప్పిన మాటలు గుడ్డిగా నమ్మేసి, స్వయంగా వెళ్లి ఇంటిని చూడకుండా కొనుగోలు చేసేస్తుంటారు. కానీ ఇది సరియైన విధానం కాదని నిపుణులు చెబుతున్నారు. అవకాశం ఉన్నంత వరకూ మీరే స్వతహాగా వెళ్లి అక్కడి పరిస్థితులు చూసి తెలుసుకోవాలి. ఆ ఇల్లు ఎప్పుడు కట్టారు? ఏ మేటిరియల్‌ వాడారు? ఏమైనా రిపైర్లు, మెయింటెనెన్స్‌ చేయించాలా వంటివి అవగాహన చేసుకోవాలి.

లోన్‌ అవసరం.. నెలవారీ సంపాదనతోనే ఇల్లు కొనాలంటే కష్టం. అందుకే బెస్ట్‌ ఆప్షన్‌ హోమ్‌ లోన్‌. దీనిని చాలా మంది వినియోగించుకుంటారు. అయితే ఈ హోమ్‌ లోన్‌ విషయంలో వడ్డీ రేట్లను సరిగ్గా అర్థం చేసుకోకుండా అప్పు చేస్తుంటారు. దీనిని పరిహరించాలి.

భవిష్యత్‌ అవసరాలను.. చాలా మంది చేసే పెద్ద తప్పు ఏంటి అంటే. . ఉన్నది మొత్తం తీసుకొచ్చి ఒక ఇల్లు కొనేద్దాం అనుకుంటారు. అకౌంట్‌ మొత్తం ఖాళీ చేసి.. హమ్మయ్య! ఇల్లు కొనేశాం అని ఊపిరితీసుకుంటారు. అయితే దాని పర్యావసానాలు  ఆలోచించరు. దీనివల్ల భవిష్యత్‌లో ఏమైనా అత్యవసరం అయితే మళ్లీ అప్పులు చేసి ఇబ్బందులు పడతారు. అలా కాకుండా చేతిలో కొంత నగదును ఉంచుకొని.. అవసరమైతే లోన్‌ సదుపాయాన్ని వాడుకుంటూ ఇల్లు కొనుక్కోవడం ఉత్తమం.

చివరిగా చెప్పేది ఎంటంటే.. ఇల్లు అనేది రోజురోజు అత్యంత ఖరీదైన సౌకర్యంగా మారిపోతోంది. ఇటువంటి పరిస్థితుల్లో నెలవారీ సంపాదన తోనే అంతా జరిగి పోవాలి అనుకుంటే కుదరదు. అవకాశం ఉన్నంత వరకూ సురక్షిత పొదుపు పథకాల్లో మదుపు చేస్తూ.. అధిక రాబడులు వచ్చే వాటిల్లో పెట్టుబడులు పెట్టుకోవాలి. తద్వారా ఇటువంటి అవసరాలకు అవి ఉపయోగపడతాయి.

మరిన్ని వీడియోస్ కోసం: Videos

Snake Bathing: నువ్వు తోపువి బాసూ.. కింగ్‌ కోబ్రాకి స్నానమా..! మగ్‌పై పలుమార్లు కాటు వేసిన పాము.. వీడియో.

Romance Before Marriage: పెళ్లికిముందే శృంగారం చేస్తే ఇక అంతే..! కొత్త చట్టం తీసుకురానున్న ప్రభుత్వం.

Rat Job: ఎలుకల్ని పట్టుకుంటే ..రూ. కోటి 38 లక్షల జీతం..! కొత్త పోస్ట్‌కు మేయర్‌ ప్రకటన..