PM Fasal Bhima Yojana: బీమాతో రైతుకు ధీమా.. కేంద్రం అందిస్తున్న బెస్ట్ స్కీమ్..

వేసవిలో ఎండలు బాగా ఎక్కువగా కాస్తాయి. పొలాల్లోని మొక్కలు, గడ్డివామిలు సైతం విపరీతంగా వేడెక్కిపోతాయి. దీనివల్ల దిగుబడి బాగా తగ్గిపోతుంది. పంటలు పండక రైతులు ఎక్కువగా నష్టపోతారు. మనం ఆరోగ్య బీమాను ద్వారా వైద్య చికిత్సకు డబ్బు పొందినట్టుగానే పంట నష్టం జరిగినప్పుడు కూడా ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన ద్వారా పంట నష్టానికి పరిహారం పొందవచ్చు.

PM Fasal Bhima Yojana: బీమాతో రైతుకు ధీమా.. కేంద్రం అందిస్తున్న బెస్ట్ స్కీమ్..
Pm Fasal Bhima Yojana
Follow us
Madhu

|

Updated on: Apr 09, 2024 | 5:54 PM

దేశంలోని అనేక మందికి వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. ఆరుగాలం కష్టబడి సాగు చేసి వివిధ రకాల పంటలు పండిస్తారు. విత్తనం నాటిన దగ్గర నుంచి కోత వరకూ కంటికి రెప్పలా కాపాడుకుంటారు. కానీ కొన్ని సమయాలలో అనుకోని ఘటనలు జరిగి పంట దెబ్బతింటుంది. లేదా దిగుబడి బాగా తగ్గిపోతుంది. అలాంటప్పుడు పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాక రైతులు ఆర్థికంగా ఇబ్బందులు పడతారు. ఈ సమయంలో వారికి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం అండగా ఉంటుంది. దీని ద్వారా దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం పొందవచ్చు.

పీఎం ఫసల్ బీమా యోజన..

దేశంలోని రైతుల కోసం పంటల బీమా పథకం అమలులో ఉంది. దీని ద్వారా చాలా మంది రైతులు ఇప్పటికే ప్రయోజనం పొందుతున్నారు. వారికి మరింత మేలు చేకూర్చేందుకు 2016లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కిసాన్ ఫసల్ బీమా యోజన పేరుతో కొత్త పంటల బీమా పథకాన్ని ప్రవేశపెట్టారు. దీని ద్వారా రైతులకు అన్ని ప్రయోజనాలను అందించడానికి నిబంధనలు రూపొందించారు. ఉదాహరణకు భారీ వర్షాలు, వేడిగాలులు, తుపానుల వల్ల సంభవించే పంట నష్టానికి రైతులకు పరిహారం అందజేస్తారు.

పంట నష్ట పరిహారం..

వేసవిలో ఎండలు బాగా ఎక్కువగా కాస్తాయి. పొలాల్లోని మొక్కలు, గడ్డివామిలు సైతం విపరీతంగా వేడెక్కిపోతాయి. దీనివల్ల దిగుబడి బాగా తగ్గిపోతుంది. పంటలు పండక రైతులు ఎక్కువగా నష్టపోతారు. మనం ఆరోగ్య బీమాను ద్వారా వైద్య చికిత్సకు డబ్బు పొందినట్టుగానే పంట నష్టం జరిగినప్పుడు కూడా ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన ద్వారా పంట నష్టానికి పరిహారం పొందవచ్చు.

ఇవి కూడా చదవండి

ప్రకృతి వైపరీత్యాలకూ..

సాధారణ బీమా తో ప్రకృతి వైపరీత్యాల కారణంగా రైతులు పంట నష్టపోతే పరిహారం అందుకుంటారు. పీఎం ఫసల్ బీమా తో వడగళ్లు, తుపానులు, నీటి ఎద్దడి, కొండచరియలు విరిగిపడటం వంటి ఘటన వల్ల దెబ్బతిన్న పంటలకు పరిహారం లభిస్తుంది. బీమాలో భాగంగా ఈ రకమైన సంఘటనలన్నీ స్థానిక విపత్తులుగా పరిగణిస్తారు. వాటికి నష్టపరిహారం అందజేస్తారు. పంట కోసిన 14 రోజులలోపు వర్షం, ఇతర విపత్తుల వల్ల దెబ్బతింటే పరిహారం అందుతుంది.

72 గంటల్లో సమాచారం ఇవ్వాలి..

రైతులు పంట నష్టం జరిగిన 72 గంటల్లోగా బీమా కంపెనీ, లేదా స్థానిక వ్యవసాయ కార్యాలయంలో తెలియజేయాలి. అప్పుడే బ్యాంకు, బీమా కంపెనీ, వ్యవసాయ కార్యాలయం సిబ్బంది పంట నష్టాన్ని సులభంగా అంచనా వేయగలరు. ఆ తర్వాత పరిహారం ప్రక్రియ ప్రారంభమవుతుంది. పొలంలో కనీసం 33 శాతం, లేదా అంతకంటే ఎక్కువ నష్టం జరిగినప్పుడే మాత్రమే పరిహారం కోసం దరఖాస్తు చేసుకోవాలి. వేడి గాలుల వల్ల పంట దెబ్బతింటే, 72 గంటలలోపు స్థానిక వ్యవసాయ కార్యాలయంలో తెలియజేయాలి. ఈ పథకం కోసం మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ఈ వెబ్ సైట్  సందర్శించాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..