Cheapest electric scooter: అత్యంత చవకైన ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ధర కేవలం రూ. 50,000 లోపే.. వివరాలు ఇవిగో..
ఎలక్ట్రిక్ వేరియంట్ బైక్, స్కూటర్ లేదా కారు ఏదైనా ధర మాత్రం ఆకాశంలో ఉంటుందన్న వాదన చాలా మంది నుంచి వినిపిస్తోంది. తక్కువ ధరలో లభిస్తే మరింత ఆదరణ లభిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
రోజురోజుకీ పెరుగుతున్న ఇంధన ధరలు ఒకవైపు.. అంతకంతకూ అధికమవుతున్న వాతావరణ కాలుష్యం మరోవైపు జనాలను ప్రత్యామ్నాయం వైపు మళ్లేలా చేస్తున్నాయి. ప్రభుత్వాలు కూడా అందుకు తగిన ప్రోత్సాహం ఇస్తుండటంతో పర్యావరణ హిత ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. అందుకనుగుణంగా వివిధ కంపెనీలు తమ ఉత్పత్తులను మార్కెట్లో ప్రవేశపెడుతున్నాయి. అయితే ఎలక్ట్రిక్ వేరియంట్ బైక్ లేదా స్కూటర్ లేదా కారు ఏదైనా ధర మాత్రం ఆకాశంలో ఉంటుందన్న వాదన చాలా మంది నుంచి వినిపిస్తోంది. తక్కువ ధరలో లభిస్తే మరింత ఆదరణ లభిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మీరు ఇలాంటి ఆలోచనలో ఉంటే ఈ కథనం మీ కోసమే. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్లలో అత్యంత చవకైనవి మీ కోసం అందిస్తున్నాం. రూ. 50,000 కన్నా తక్కువ మొత్తంలో లభించే స్కూటర్లు ఇవే..
యో ఎడ్జ్.. మీరు స్థానికంగా ప్రయాణించడానికి ఎలక్ట్రిక్ స్కూటర్‌ని కొనుగోలు చేయాలనుకుంటే, మీరు యో ఎడ్జ్‌ని ఎంచుకోవచ్చు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పరిమిత వేగంతో ప్రయాణించగలుగుతుంది. రేంజ్‌ను పరిశీలిస్తే.. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లోని బ్యాటరీని ఒక్కసారి చార్జ్ చేస్తే 60కిలోమీటర్ల రేంజ్‌ను అందించగలదు. దీని గరిష్ట వేగం గంటకు 25 కిలోమీటర్లు. దీని ధర దాదాపు 50 వేల రూపాయలు ఉంటుంది.
ఆంపియర్ రియో ఎలైట్.. ఆంపియర్ రియో ఎలైట్ ప్రారంభ ధర రూ.43,000. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ దేశంలోని చవకైన ఎలక్ట్రిక్ స్కూటర్‌లలో ఒకటి. ఇందులో LED డిజిటల్ డాష్‌బోర్డ్, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, డ్యూయల్ కాయిల్ స్ప్రింగ్ షాక్ అబ్జార్బర్‌లు, యూఎస్‌బీ చార్జింగ్ పోర్ట్ మొదలైన ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.
కోమాకి ఎక్స్ 1.. 50 వేల రూపాయల ధరలో వస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్ల కొమాకి స్కూటర్ బెస్ట్ ఆప్షన్. మీరు దాదాపు రూ.45,000కి కొమాకి ఎక్స్1 స్కూటర్ ను కొనుగోలు చేయవచ్చు. ఈ స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 85 కిలోమీటర్ల రేంజ్‌ను అందించగలదు. దీని గరిష్ట వేగం గంటకు 25 కిలోమీటర్లు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..