Vande Bharat: వందే భారత్ రైళ్లకు జై కొడుతోన్న జనం.. 99 శాతం ఆక్యూపెన్సీతో 20 లక్షల మంది..
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు జనం జై కొడుతున్నారు. దేశంలో పలు రూట్లలో అందుబాటులోకి వచ్చిన ఈ సర్వీసులకు జనాల నుంచి పెద్ద ఆదరణ లభిస్తోంది. ప్రస్తుతం మొత్తం 10 రైళ్లు సేవలు అందిస్తుండగా.. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు...

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు జనం జై కొడుతున్నారు. దేశంలో పలు రూట్లలో అందుబాటులోకి వచ్చిన ఈ సర్వీసులకు జనాల నుంచి పెద్ద ఆదరణ లభిస్తోంది. ప్రస్తుతం మొత్తం 10 రైళ్లు సేవలు అందిస్తుండగా.. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 99 శాతం ఆక్యూపెన్సీ రేటుతో 20 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చినట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఇక అత్యధికంగా 127.67 శాతంతో ముంబయి-గాంధీనగర్ రూట్ మొదటి స్థానంలో నిలవగా, 52.86 శాతం ఆక్కూపెన్సీతో నాగ్‌పూర్-బిల్సాపూర్ మార్గం చివరి స్థానంలో నిలిచింది.
ఇదిలా ఉంటే కొన్ని మార్గాల్లో ప్రయాణికుల సంఖ్య రికార్డు స్థాయిలో మరికొన్ని రూట్స్‌లో మాత్రం ఆశించిన స్థాయిలో లేదని రైల్వే అధికారులు చెబుతున్నారు. కొత్తగా ప్రవేశ పెట్టిన రెండు రైళ్లు మినహా మిగతా 5 మార్గాల్లో ఆక్యూపెన్సీ బాగుంది. అయితే మరో మూడు మార్గాల్లో ఆక్యూపెన్సీ ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది అని అధికారులు చెబుతున్నారు. ఇక భారత రైల్వే ముఖ చిత్రాన్నిమారుస్తూ తీసుకొచ్చిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సేవలకు నాలుగేళ్లు మగిశాయి.
2019 ఫిబ్రవరి 15న ఢిల్లీ-వారణాసిల మధ్య తొలి రైలుకు ప్రధాని మోదీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ రైళ్ల సంఖ్య 10కి చేరింది. ఈ రైళ్లు ఇప్పటి వరకు 17 రాష్ట్రాల్లో 108 జిల్లాలకు సర్వీసులను అందిస్తున్నాయి. గంటకు సుమారు 160 కి.మీల వేగంతో ప్రయాణించే ఈ రైళ్లలో అత్యాధునిక వసతులను కల్పించారు. ప్రజల నుంచి కూడా ఈ రైళ్లకు మంచి ఆదరణ లభిస్తుండడంతో రైళ్ల సంఖ్యను పెంచే దిశగా రైల్వే శాఖ ఆలోచనలు చేస్తోంది.




మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..




