AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO: ఒకటి కంటే ఎక్కువ పీఎఫ్ అకౌంట్లు ఉన్నాయా..? ఈ ఒక్క పని చేయకపోతే ఇబ్బందులే..

కొంతమంది తరచుగా ఉద్యోగాలు మారుతూ ఉంటారు. ఇలాంటి సమయంలో పీఎఫ్ అకౌంట్లను బదిలీ చేయడం మర్చిపోతుంటారు. ఇలా చేస్తే మీరు ఇబ్బందుల్లో పడే అవకాశముంటుంది. కొత్త కంపెనీలో చేరినప్పుడు పాత అకౌంట్‌ను తప్పనిసరిగా విలీనం చేసుకోవాలని ఈపీఎఫ్‌వో చెబుతంది. అదెలా చేయాలి అనేది చూద్దాం.

EPFO: ఒకటి కంటే ఎక్కువ పీఎఫ్ అకౌంట్లు ఉన్నాయా..? ఈ ఒక్క పని చేయకపోతే ఇబ్బందులే..
Epfo
Venkatrao Lella
|

Updated on: May 22, 2026 | 4:20 PM

Share

కొంతమంది తరచుగా ఉద్యోగాలు మారుతుంటారు. ఇలాంటి సమయంలో ఒకటి కంటే ఎక్కువ పీఎఫ్ అకౌంట్లను కలిగి ఉంటారు. కంపెనీ మారినప్పుడు పాత అకౌంట్‌ను కొత్త కంపెనీ అకౌంట్లోకి మార్చుకోరు. కొత్త కంపెనీలో చేరిప్పుడు పాత పీఎప్ అకౌంట్‌ను కొత్త అకౌంట్లో విలీనం చేయడం అనేది అత్యవసరం. లేకపోతే మీరు చాలా నష్టపోవాల్సి ఉంటుంది. అలా చేసుకోకపోతే క్లెయిమ్, విత్ డ్రా సమయంలో ఇబ్బందులు పడే అవకాశముంటుంది. అసలు ఎలా పీఎఫ్ అకౌంట్లను విలీనం చేయాలి? స్టెప్ బై ప్టెప్ ప్రాసెస్ ఇప్పుడు చూద్దాం.

కొత్త కంపెనీలో చేరారా..?

మీరు కంపెనీలు మారినప్పుడు మీ యూఏఎన్ నెంబర్‌తో మల్టీఫుల్ మీ పీఎఫ్ అకౌంట్లు లింక్ చేసి ఉంటాయి. కొత్త కంపెనీలో చేరినప్పుడు ప్రత్యేక కొత్త మెంబర్ ఐడీ క్రియేట్ అవుతుంది. వీటిని మీరు విలీనం చేసుకోవాలి. పాత అకౌంట్లను కొత్త ఐడీలో విలీనం చేయాలి. దీని వల్ల పీఎఫ్ క్లెయిమ్, విత్ డ్రాలు వేగవంతంగా జరుగుతాయి. అంతేకాకుండా పీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ కూడా స్థిరంగా జమ అవుతూ ఉంటుంది. ఇంతేకాకుండా పెన్షన్ పొందేందుకు సర్వీస్ హిస్టరీ కూడా ఖచ్చితంగా ఉంటుంది.

ఎలా విలీనం చేయాలంటే..?

-యూఏఎన్ పోర్టల్‌లోకి వెళ్లి యూఏఎన్ నెంబర్, పాస్ వర్డ్‌తో లాగిన్ అవ్వండి

-ఆన్ లైన్ సర్వీసెస్ ట్యాబ్‌పై క్లిక్ చేయండి

-ఒక సభ్యుడు-ఒకే పీఎఫ్ ఖాతా అనే ఆప్షన్ ఎంచుకోండి

-మీ వ్యక్తిగత వివరాలు, పీఎఫ్ ఖాతాలను ధృవీకరించండి

-మీ పాత పీఎఫ్ యజమాని వివరాలు చూడటానికి గెట్ డీటైల్స్‌పై క్లిక్ చేయండి

-ధృవీకరణ కోసం ప్రస్తుత లేదా పాత యాజమానిని ఎంచుకోండి

-సభ్యుని ఐడీ లేదా యూఏఎన్ నెంబర్ ఎంటర్ చేయండి

-గెట్ ఓటీపీపై క్లిక్ చేయండి

-మీ మొబైల్‌కు వచ్చే ఓటీపీని క్లిక్ చేస్తే సరిపోతుంది

ఈమెయిల్ ద్వారా చేయడం ఎలా..?

uanepf@epfindia.gov.inకు వివరాలు మెయిల్ చేయడం ద్వారా కూడా విలీనం చేసుకోవచ్చు. పాత యూఏఎన్ నెంబర్‌ను మూసివేయమని చెప్పండి. అనంతరం పీఎఫ్ సంస్థ మీ పాత అకౌంట్‌ను ఇనాక్టివ్ చేసి ఎస్ఎంఎస్ పంపుతుంది. ఇక మీరు పీఎఫ్ విలీనానికి సంబంధించి రిక్వెస్ట్ పెట్టుకున్నా స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఈపీఎఫ్‌వో పోర్టల్‌ను సందర్శించి ట్రాక్ క్లెయిమ్ స్టేటస్‌పై క్లిక్ చేయండి. ఇక్కడ పెండింగ్‌లో ఉన్న, ఆమోదించిన రిక్వెస్ట్ వివరాలు కనిపిస్తాయి. అయితే భవిష్యత్తులో ఆటోమేటిక్‌గా పీఎఫ్ అకౌంట్లు బదిలీ జరిగేలా కొత్త వ్యవస్థను ఈపీఎఫ్‌వో రూపొందిస్తోంది. త్వరలో కొత్త విధానం అమల్లోకి రానుంది.

Follow Us