Peddi Movie : ఒక గదిలో ఒంటరిగా.. మానసికంగా కుంగిపోయా.. ఆయన మాటలే నన్ను మార్చాయి.. రామ్ చరణ్..
ప్రస్తుతం పెద్ది మూవీ సందడి మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు జూన్ 4న విడుదల కానుంది. ఈ క్రమంలోనే పెద్ది చిత్రయూనిట్ వినూత్నంగా ప్రమోషన్స్ షూరు చేసింది. ఈ క్రమంలో తాజాగా రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు కలిసి కారులో జర్నీ చేస్తూ ఈ మూవీ విశేషాలు పంచుకున్న సంగతి తెలిసిందే.

మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా పెద్ది. తొలి చిత్రం ఉప్పెనతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా ఇది. దీంతో ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. స్పోర్ట్స్ డ్రామాగా రాబోతున్న ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్, ట్రైలర్ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ వినూత్నంగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా చరణ్, బుచ్చిబాబు కలిసి ఒక కారులో స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు. అలాగే పెద్ది చిత్రం గురించి, షూటింగ్ విశేషాల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. కరోనా సమయంలో తాను మానసికంగా చాలా ఒంటరిగా ఫీల్ అయ్యానని.. అప్పుడు రాజమౌళి చెప్పిన మాటలు తనను చాలా మార్చాయని గుర్తు చేసుకున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Surya S/o Krishnan: హార్ట్ టచింగ్.. కుర్రాళ్ల మనసును కదిలించే సాంగ్.. ‘చంచల’ పాట వెనుక ఇంత స్టోరీ ఉందా..
కోవిడ్ సమయంలో మానసికంగా, ఆరోగ్యపరంగా, ఆర్థికంగా చాలామంది దెబ్బతిన్నట్లే, తనను కూడా ఆ పరిస్థితి తీవ్రంగా ప్రభావితం చేసిందని చరణ్ అన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ 30-40 శాతం పూర్తయిన తర్వాత ఆగిపోవడం, ఆ సమయంలో తనలో ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్ ఏర్పడటం జరహిగిందని తెలిపారు. అపార్ట్‌మెంట్‌లో ఉంటూ, చుట్టూ వ్యక్తులు చనిపోవడం చూస్తూ, తన భార్య ఉపాసన హాస్పిటల్ కాల్స్ వింటూ ఒంటరితనం తనను మరింత కుంగదీసిందని వివరించారు. ఉపాసన ఒక గదిలో రోగులకు సేవలు అందిస్తుంటే, తాను వేరే గదిలో కొన్ని నెలలు ఒంటరిగా గడిపినట్లు పేర్కొన్నారు. ఈ ఏకాంతం తన ఆలోచనలను మార్చి, మానసికంగా మరింత కుంగిపోయేలా చేసిందని చెప్పారు. ఆర్ఆర్ఆర్ షూటింగ్ తిరిగి ప్రారంభం కానున్న సమయంలో తనకు ఎటువంటి ఉత్సాహం లేదని, ఇంత పెద్ద ప్రాజెక్టులో భాగమైనా తనకు ప్రేరణ కొరవడిందని అన్నారు. దీంతో రాజమౌళిని కలిసి తన పరిస్థితిని వివరించానని.. అప్పుడు రాజమౌళి మాట్లాడుతూ.. “చరణ్, ప్రేరణ అనేది ఏదో పెద్దది వస్తేనే రాదు. షూటింగ్‌కు ఇంకా ఇరవై రోజులు సమయం ఉంది, ఈ సమయంలో నువ్వు చిన్న చిన్న పనులు చేయి. చిన్నగా మొదలుపెట్టు, నీ బెడ్‌రూమ్‌ను అత్యంత పరిశుభ్రమైన బెడ్‌రూమ్‌గా మార్చడం, లేదా నీ గార్డెన్‌ను అత్యుత్తమంగా తీర్చిదిద్దడం, కలుపు మొక్కలు తీసేయడం వంటి పనులు చేయి. ఇలాంటి చిన్న చిన్న కారణాలను వెతుక్కో. లేదా నీ ఫామ్‌హౌస్‌పై దృష్టి పెట్టి దాన్ని మరింత మెరుగుపరచడానికి కృషి చేయి. ఉదయం లేవడానికి ఒక లక్ష్యం పెట్టుకో. చిన్నగా మొదలుపెట్టిన ఈ ప్రేరణ పెద్దగా మారి, నువ్వు మరింత విజయం సాధిస్తావు” అని సలహా ఇచ్చారు.
జక్కన ఇచ్చిన ఆ సలహాను అక్షరాలా పాటించానని, గత మూడు, నాలుగు సంవత్సరాలుగా తనకు ఎప్పుడూ నిరుత్సాహం అనేది రాలేదని చెప్పుకొచ్చారు. జీవితం ముందుకు సాగాలని, దానికి ఒక ప్రయోజనాన్ని వెతుక్కోవాలని రాజమౌళి మాటల స్ఫూర్తితో తెలుసుకున్నానని అన్నారు. ఈ స్ఫూర్తి తన తాజా చిత్రం పెద్దిలోని పాత్రకు కూడా వర్తిస్తుందని, ఆ పాత్ర కూడా చిన్న చిన్న అవకాశాల నుంచి ఎదిగే స్వభావం కలదని చెప్పుకోచ్చారు. పోల్చారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఉన్న దాంట్లో ఉత్తమంగా ఎలా ఉండాలో వెతుక్కుంటూ జీవితాన్ని ముందుకు నడిపించే తత్వం పెద్దిదని అని వివరించారు.
ఎక్కువ మంది చదివినవి : Gunashekar: ఆ హీరో చిన్నప్పుడు కూచిపూడి డ్యాన్స్ చేస్తే.. రవింద్రభారతిలో విజిల్స్ మారుమోగాయి.. డైరెక్టర్ గుణశేఖర్..
