AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Ideas: అతి తక్కువ పెట్టుబడి.. నెలకు రూ.1,50,000 ఆదాయం! వ్యాపార సామ్రాజ్యం నిర్మించవచ్చు..

చాలామందికి వ్యాపారం చేయాలని ఉన్నా, సరైన ఐడియా, పెట్టుబడి సమస్యలుంటాయి. అలాంటివారికి తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు తెచ్చే గ్రిల్ సాండ్విచ్ వ్యాపారం ఒక చక్కటి పరిష్కారం. కేవలం 40 50 వేల పెట్టుబడితో నెలకు 1.5 లక్షల వరకు సంపాదించే అవకాశం దీనికుంది.

Business Ideas: అతి తక్కువ పెట్టుబడి.. నెలకు రూ.1,50,000 ఆదాయం! వ్యాపార సామ్రాజ్యం నిర్మించవచ్చు..
Indian Currency
SN Pasha
|

Updated on: Oct 14, 2025 | 8:00 AM

Share

చాలా మంది మంచి వ్యాపారం చేయాలనే కల ఉంటుంది. కానీ, ఏ వ్యాపారం చేయాలి? ఎలా మొదలు పెట్టాలనే సరైన అవగాహన ఉండదు. అలాంటి వారి కోసం ఒక చక్కటి బిజినెస్‌ ఐడియాను తీసుకొచ్చాం. వ్యాపారం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న వారి కోసమే ఈ ఐడియా. తక్కువ పెట్టుబడితో మీరు వ్యాపారం చేయాలి అనుకున్నట్లయితే ఒక చక్కటి ఫుడ్ బిజినెస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఈ ఫుడ్ బిజినెస్‌తో మీరు మంచి ఆదాయం పొందవచ్చు. ఈ మధ్యకాలంలో గ్రిల్ సాండ్ విచ్ తినేందుకు జనం ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దీని తయారీ విధానం కూడా చాలా సులభమే. అయితే మంచి క్వాలిటీ రుచికరమైన గ్రిల్ సాండ్ విచ్ తినేందుకు జనం ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. దీనిలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గ్రిల్ సాండ్ విచ్ తయారీ కోసం మీరు కేవలం రెండు బ్రెడ్ స్లైసులు మధ్యలో ఏ ఫ్లేవర్ చేయాలి అనుకుంటే ఆ ఫ్లేవర్ కు సంబంధించిన ఆహార పదార్థాలు అవసరం అవుతాయి.

తక్కువ పెట్టుబడి..

ఈ వ్యాపారంలో పెట్టుబడి తక్కువగా ఉండటంతో పాటు మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది. గ్రిల్ సాండ్ విచ్ బిజినెస్ ప్రారంభించడానికి మినిమం పెట్టుబడి రూ.40 నుంచి రూ.50 వేల వరకు అవుతుంది. ముందుగా గ్రిల్ సాండ్ విచ్ మేకర్ కొనుగోలు చేసుకోవాలి. దీని ధర దాదాపు పదివేల రూపాయల వరకు ఉంటుంది. అలాగే ఒక ఫుడ్ స్టాల్ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. దీని స్ట్రీట్ ఫుడ్ స్టైల్ లో చక్కగా ప్రిపేర్ చేయవచ్చు. లైసెన్స్, ఫుడ్ సేఫ్టీ రిజిస్ట్రేషన్ మొదలైనవి అవసరం అవుతాయి.

గ్రిల్ సాండ్ విచ్ తయారీ కోసం ముందుగా మీరు ఎక్కడైనా శిక్షణ పొందితే మంచిది తద్వారా మీరు చక్కటి ఫ్లేవర్స్ ఉన్నటువంటి గ్రిల్ సాండ్ విచ్ తయారు చేయవచ్చు. సాధారణంగా ఒక గ్రిల్ సాండ్ విచ్ తయారీకి రూ.20 ఖర్చు అవుతుంది. గ్రిల్ సాండ్ విచ్ వెజిటేరియన్ అయితే రూ.50లకు అమ్మొచ్చు. అదే నాన్ వెజ్ గ్రిల్ సాండ్ విచ్ అయితే రూ.100 అంటే కూడా కస్టమర్లు ఎగబడతారు. ఒక గ్రిల్ సాండ్ విచ్ మీద మూడు రెట్ల లాభం లభిస్తుంది. రోజుకు 100 శాండవిచ్ లు అమ్మిన ఒక్కో సాండ్విచ్ మీద రూ.50 చొప్పున లాభం అనుకుంటే రోజుకు రూ.5000 నెలకు రూ.1,50,000 సంపాదించవచ్చు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

కిడ్నీల్లో రాళ్లను పిప్పి పిప్పి చేసే దివ్యౌషధం..
కిడ్నీల్లో రాళ్లను పిప్పి పిప్పి చేసే దివ్యౌషధం..
PSLV-C62 ప్రయోగంలో అంతరాయం.. 4వ దశలో కనిపించని రాకెట్‌ ఆచూకీ
PSLV-C62 ప్రయోగంలో అంతరాయం.. 4వ దశలో కనిపించని రాకెట్‌ ఆచూకీ
'ఆంటీ' అని పిలిస్తే అస్సలు ఊరుకోను.. వాళ్లు మాత్రమే.!
'ఆంటీ' అని పిలిస్తే అస్సలు ఊరుకోను.. వాళ్లు మాత్రమే.!
చిన్న విషయాలకే పట్టలేని కోపం వస్తుందా? ఈ గ్రహాన్ని బలోపేతం చేయండి
చిన్న విషయాలకే పట్టలేని కోపం వస్తుందా? ఈ గ్రహాన్ని బలోపేతం చేయండి
కాలీఫ్లవర్ నుండి పురుగులను ఎలా తొలగించాలి? వెరీ సింపుల్‌..
కాలీఫ్లవర్ నుండి పురుగులను ఎలా తొలగించాలి? వెరీ సింపుల్‌..
గోశాలకు సోనూసూద్ భారీ విరాళం.. ఎన్ని లక్షలు ఇచ్చాడో తెలుసా?
గోశాలకు సోనూసూద్ భారీ విరాళం.. ఎన్ని లక్షలు ఇచ్చాడో తెలుసా?
నా కూతురు సినిమాలు ఆపేయడానికి కారణం అదే.. హీరోయిన్ రవళి తల్లి..
నా కూతురు సినిమాలు ఆపేయడానికి కారణం అదే.. హీరోయిన్ రవళి తల్లి..
జాతీయ యువజన దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో తెలుసా?
జాతీయ యువజన దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో తెలుసా?
ముంచుకొస్తున్న మూడో ప్రపంచ యుద్ధం.! బాబా వంగా జోస్యం నిజమవుతోందా.
ముంచుకొస్తున్న మూడో ప్రపంచ యుద్ధం.! బాబా వంగా జోస్యం నిజమవుతోందా.
పాకిస్తాన్‌లో వాసుదేవుడి కాలం నాటి నాణేలు లభ్యం..
పాకిస్తాన్‌లో వాసుదేవుడి కాలం నాటి నాణేలు లభ్యం..