AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: ఆ నిషేధం ఎత్తివేయనుందా? కీలక నిర్ణయం దిశగా కేంద్ర సర్కార్‌

దేశంలో ధరలు అదులో ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటూనే ఉంటుంది. ప్రజలకు నిత్యవసర వస్తువులు చాలా ముఖ్యం. నెలనెల వీటి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచేందుకు మోడీ ప్రభుత్వం అప్రమత్తం అవుతూనే ఉంటుంది. ప్రజలకు వంట గది భారం పెరగకుండా నిర్ణయాలు తీసుకుంటుంది. ఇటీవల నుంచి దేశంలో బియ్యం ధరలు భారీగానే పెరిగాయి. వాటి ధరలను..

PM Modi: ఆ నిషేధం ఎత్తివేయనుందా? కీలక నిర్ణయం దిశగా కేంద్ర సర్కార్‌
Pm Modi
Subhash Goud
|

Updated on: May 13, 2024 | 3:05 PM

Share

దేశంలో ధరలు అదులో ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటూనే ఉంటుంది. ప్రజలకు నిత్యవసర వస్తువులు చాలా ముఖ్యం. నెలనెల వీటి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచేందుకు మోడీ ప్రభుత్వం అప్రమత్తం అవుతూనే ఉంటుంది. ప్రజలకు వంట గది భారం పెరగకుండా నిర్ణయాలు తీసుకుంటుంది. ఇటీవల నుంచి దేశంలో బియ్యం ధరలు భారీగానే పెరిగాయి. వాటి ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపడుతూనే ఉంటుంది.

ఇదిలా ఉండగా, కేంద్ర ప్రభుత్వం త్వరలో బియ్యం ఎగుమతిపై నిషేధాన్ని ఎత్తివేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం వద్ద సరిపడా వరి నిల్వలు ఉన్నాయని, వర్షాలు బాగా కురుస్తాయని ఆశించిన నేపథ్యంలో నాట్లు పెరిగే అవకాశం ఉంది. దీంతో వచ్చే నెలలోగా బియ్యం ఎగుమతిపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ధరలు పెరుగుతాయనే భయంతో మోడీ ప్రభుత్వం గతేడాది బియ్యం ఎగుమతిపై నిషేధం విధించించిన విషయం తెలిసిందే.

ఖరీఫ్ సీజన్ దగ్గర పడుతుందని సీనియర్ అధికారి ఒకరు ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్‌తో అన్నారు. సీజన్‌లో నాట్లు బాగా ఉంటే నిషేధాన్ని ఎత్తివేయడాన్ని పరిగణించవచ్చు. అయితే ఈ నిర్ణయం కూడా రుతుపవనాలపై ఆధారపడి ఉంటుందని అన్నారు. వచ్చే నెలలో రుతుపవనాలు కేరళకు చేరుకుంటాయని వాతావరణ శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది. దీంతో వరి నాట్లు ప్రారంభమవుతాయి. జూన్, జులైలో వర్షాకాలం కొనసాగుతుండటంతో వరి నాట్లు కూడా పెరుగుతూనే ఉంటాయి. ప్రస్తుతం ప్రభుత్వం వద్ద మంచి బియ్యం నిల్వలు ఉన్నాయని తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఈ సారి భారీ వర్షాలు ఉండే అవకాశం

ఈ ఏడాది జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని గత నెలలోనే వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ ఏడాది భారత్‌లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ 90 శాతం అంచనా వేసింది. గతేడాది వర్షాలు కురవడంతో వరి నాట్లు దెబ్బతిన్నాయి. ఈ ఏడాది మార్చిలో బియ్యం ధరలు 12 శాతానికి పైగా పెరిగాయి. అయితే, మరికొన్ని నెలల్లో ధరలు తగ్గుముఖం పట్టనున్నాయి. ద్రవ్యోల్బణం కూడా అదుపులోనే ఉంటుందని అంచనా. ఇలాంటి పరిస్థితుల్లో అనుకూల వాతావరణం ఏర్పడితే బియ్యం ఎగుమతిపై నిషేధాన్ని తగ్గించవచ్చు.

భారత్ రైస్‌ను ఎఫ్‌సీఐ స్టాక్‌ నుంచి విక్రయిస్తున్నారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) వద్ద తగినంత బియ్యం స్టాక్ ఉంది. NAFED, NCCF, కేంద్రీయ భండార్ కూడా భారత్ రైస్‌ను విక్రయించడానికి ఎఫ్‌సీఐ నుండి కొనుగోలు చేస్తున్నాయి. భారత్ బియ్యం కిలో రూ.29కి విక్రయిస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి