AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI Customers : ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త..! ఆన్‌లైన్ బ్యాంకింగ్ గురించి సరికొత్త ప్రకటన..

SBI Customers : మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ అయితే, మొబైల్ యాప్ ద్వారా ఆన్‌లైన్ బ్యాంకింగ్ చేస్తుంటే, భద్రత కోసం టెన్షన్ పడవలసిన అవసరం లేదు.

SBI Customers : ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త..! ఆన్‌లైన్ బ్యాంకింగ్ గురించి సరికొత్త ప్రకటన..
Sbi
uppula Raju
|

Updated on: Jul 28, 2021 | 8:47 AM

Share

SBI Customers : మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ అయితే, మొబైల్ యాప్ ద్వారా ఆన్‌లైన్ బ్యాంకింగ్ చేస్తుంటే, భద్రత కోసం టెన్షన్ పడవలసిన అవసరం లేదు. ఎస్‌బిఐ తన యోనో లైట్ యాప్‌లో ప్రత్యేక ఫీచర్‌ను జోడించింది. ఇప్పుడు మీరు ఈ యాప్‌ని ఉపయోగించే ముందు ఒక్కసారి అప్‌డేట్ చేసుకోవాలి. తద్వారా మీరు కొత్త ఫీచర్ ప్రయోజనాన్ని పొందుతారు. డిజిటల్ లావాదేవీల సమయంలో పెరుగుతున్న మోసాలను నివారించడానికి ఎస్బిఐ ఈ చర్య తీసుకుంది. కొత్త ఫీచర్ తరువాత ఈ ప్లాట్‌ఫాం ద్వారా ఆన్‌లైన్ బ్యాంకింగ్ భద్రత పటిష్టంగా ఉంటుంది. కస్టమర్‌గా మీరు ఆర్థిక, ఆర్థికేతర లావాదేవీలను సురక్షితమైన పద్ధతిలో పూర్తి చేయవచ్చు.

సిమ్ బైండింగ్ ఏమిటి?

ఇది కొత్త సాంకేతిక పరిజ్ఞానం. దీని కింద రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ద్వారా ఒక పరికరంలో ఒక వినియోగదారు మాత్రమే అనుమతిస్తారు. ఇది ఆన్‌లైన్ బ్యాంకింగ్‌ను గతంలో కంటే మరింత సురక్షితంగా చేస్తుంది. దీని కోసం వినియోగదారులు యోనో లైట్ వెర్షన్ 5.3.48 కు అప్‌డేట్ కావాలి. ఆ తర్వాత వన్-టైమ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి. ఇందుకోసం రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మీ మొబైల్ లో అందుబాటులో ఉండాలి.

android వినియోగదారుల కోసం నమోదు ప్రక్రియ

1. మొదట మీరు ప్లే స్టోర్ నుంచి యోనో లైట్ ఎస్బిఐ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. దీనిని ఓపెన్ చేసిన తరువాత మీరు బ్యాంకులో నమోదు చేసుకున్న సిమ్ -1 లేదా సిమ్ -2 ఎంచుకోవాలి. మీ స్మార్ట్‌ఫోన్‌లో ఒకే సిమ్ అందుబాటులో ఉంటే సిమ్‌ను ఎంచుకోవలసిన అవసరం లేదు. తరువాత మొబైల్ నంబర్‌ను ధృవీకరించడానికి మీ ఫోన్ నుంచి SMS పంపే మెస్సేజ్ కనిపిస్తుంది. 2. ఇక్కడ మీరు కంటిన్యూ బటన్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత ప్రత్యేక సంఖ్యతో కూడిన SMS వస్తుంది. SMS పంపడం కోసం ప్రామాణిక ఛార్జీని చెల్లించాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి. 3. రిజిస్ట్రేషన్ స్క్రీన్‌లో మీరు యూజర్ నేమ్, పాస్‌వర్డ్ ఎంటర్ చేసి ‘రిజిస్టర్’ పై క్లిక్ చేయాలి. 4. ఆ తరువాత మీరు నిబంధనలు, షరతులను అంగీకరించి ఆపై ఓకె బటన్ పై క్లిక్ చేయాలి 5. తరువాత యాక్టివేషన్ కోడ్ మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వస్తుంది. ఈ కోడ్ తదుపరి 30 నిమిషాలకు చెల్లుతుంది. 6. వినియోగదారు సక్రియం ప్రక్రియను పూర్తి చేయాలి. తరువాత మీరు సులభంగా జోనా లైట్ అప్లికేషన్‌కు లాగిన్ అవ్వవచ్చు.

Mahesh Babu: అందంలోనే కాదు ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌లోనూ సూపర్ స్టారే.. వైరల్ అవుతోన్న మహేష్ వర్కౌట్‌‌‌‌ ఫోటో..

Pot cooking Benefits: మట్టికుండలో వంట..రుచి అదిరిపోతుంది..వంట కోసం కుండలను ఎలా సిద్ధం చేయాలో తెలుసా?

LIC: అదిరిపోయే ఎల్‌ఐసీ పాలసీ.. ఈ ప్లాన్‌ తీసుకుంటే ప్రతియేటా 12 వేల వరకు పొందవచ్చు.. ఎలాగంటే..!