AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pot cooking Benefits: మట్టికుండలో వంట..రుచి అదిరిపోతుంది..వంట కోసం కుండలను ఎలా సిద్ధం చేయాలో తెలుసా?

ఇప్పుడు మనం అల్యూమినియం.. స్టీల్.. వంటి రకరకాల పాత్రల్లో వంటలు చేసుకుంటున్నాం. కానీ..పూర్వం మట్టి కుండల్లో వంటలు చేసుకునే వారు ఆరోగ్యంగా ఉండేవారు. ఇప్పుడు కుండల్లో వంట చేసుకోవడం అంటే చాలామంది ముఖం చిట్లిస్తారు.

Pot cooking Benefits: మట్టికుండలో వంట..రుచి అదిరిపోతుంది..వంట కోసం కుండలను ఎలా సిద్ధం చేయాలో తెలుసా?
Pot Cooking Benefits
KVD Varma
|

Updated on: Jul 28, 2021 | 8:42 AM

Share

Pot cooking Benefits: ఇప్పుడు మనం అల్యూమినియం.. స్టీల్.. వంటి రకరకాల పాత్రల్లో వంటలు చేసుకుంటున్నాం. కానీ..పూర్వం మట్టి కుండల్లో వంటలు చేసుకునే వారు ఆరోగ్యంగా ఉండేవారు. ఇప్పుడు కుండల్లో వంట చేసుకోవడం అంటే చాలామంది ముఖం చిట్లిస్తారు. కానీ, కుండల్లో చేసిన వంట రుచిగా ఉండటమే కాదు.. ఆరోగ్యానికి మేలు చేస్తుంది కూడా. లోహపు గిన్నెల్లో వంటచేయడం వలన ఆ లోహపు కణాలు కూడా మన ఆహారంలో చేరి మన శరీరంలోకి చేరిపోతాయి. అది అనారోగ్య కరకం కూడా. ఇప్పటికీ మన పల్లెల్లో కుండల్లో వంట చేయడం చూడొచ్చు. ఇంకా చెప్పాలంటే ఇప్పటికీ గోదావరి జిల్లాల్లో పులస చేపతో పులుసును మట్టికుండలోనే తయారుచేస్తారు. దాని రుచి చాలా బావుంటుంది. కుండల్లోవంట చేసుకోవాలంటే మంచి కుండ కావాల్సి ఉంటుంది. అదేవిధంగా మట్టితో చేసిన కుండా కావడంతో దానిని శుభ్రం చేసుకోవడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఇలా చేయడం వలన మట్టి కుండల్లో వండిన వంటకు అదనపు రుచి రావడమే కాకుండా స్వచ్ఛంగా ఉంటుంది. మరి మట్టి కుండల్ని ఆహరం వండటం కోసం ఎలా సిద్ధం చేసుకోవాలో తెలుసుకుందాం.

కొత్త మట్టికుండలను సిద్ధం చేయడం..

కొత్తగా మట్టి కుండలను వంట కోసం ఉపయోగించే ముందు 8-10 గంటలు నీటిలో నానబెట్టాలి. మట్టిలో మైక్రోపోర్స్ ఉన్నాయి. కాబట్టి, నీటిలో నానబెట్టడం తేమకు కారణమవుతుంది. ఇది మైక్రోపోర్స్ ను దగ్గరగా చేస్తుంది. ఇలా నీటిలో కుండను నానపెట్టడం ద్వారా ఆహారాన్ని వేగంగా వండటానికి అదేవిధంగా వేడిని నిలుపుకోవడానికి వీలుకలుగుతుంది.

నీటిలో నానపెట్టిన తరువాత కుండలో  కొద్దిగా నీరుపోసి మరగబెట్టాలి.  దీంతో కొత్త కుండ వంట చేయాడానికి సిద్ధం అయినట్టే.

మట్టి కుండలో వంట చేసేముందు ఇలా చేయండి..

వంట చేయాలనుకుంటున్న మట్టి కుండలో  కొంచెం గోధుమ పిండి వేసి అన్ని వైపులా రుద్దండి. పిండిని రుద్దడం మట్టికి అంటుకునే మట్టి  కణాలను తొలగించడానికి సహాయపడుతుంది. ఈ అదనపు పిండి బంకమట్టిలోని దుమ్మును తొలగిస్తుంది. ఇప్పుడు ఆ కుండను ఓవెన్ లో లేదా మంట మీద ఉంచండి. కుండకు పూసిన గోధుమ పిండి నల్లబడేవరకూ కుండను వేడిచేయండి. తరువాత శుభ్రమైన పొడి గుడ్డతో కుండను శుభ్రంగా తుడవండి. తరువాత కుండను పూర్తిగా చల్లారనివ్వండి. అనంతరం కుండను వంట చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. వంట చేసే ముందు ప్రతిసారి ఇలా చేయడం ద్వారా మట్టి కుండలో వంట పరిశుభ్రంగా సిద్ధం అవుతుంది.

మట్టికుండలను ఎలా వంటకు సిద్ధం చేయాలో ఈ వీడియోలో చూడొచ్చు..

Also Read: Curd Benefits: రోజూ పెరుగు తింటే బరువు పెరుగుతారా ? అసలు ఎంత తినాలో తెలుసా..

Aloe Vera Side Effects: ఆరోగ్యానికి మంచిదని కలబంద జ్యూస్ తాగుతున్నారా ? ఎక్కువైతే ఈ సమస్యలు తప్పవు..