Fame-II Incentives: ఈవీ వాహన ప్రియులకు కేంద్రం గుడ్ న్యూస్.. ఇకపై ఆ వాహనాలకు కూడా ఫేమ్-2 ప్రోత్సాహకాలు
ముఖ్యంగా దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్‌ను ప్రోత్సహించేందుకు రూపొందించిన ఫేమ్-2 ప్రోత్సాహకాలను ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్స్, ఈ-త్రీ వీలర్‌ల ఎక్స్-ఫ్యాక్టరీ ధరకే అందించనున్నట్లు భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఇటీవల తెలిపింది. ఇఖపై ఈ వాహనాల ఎక్స్-ఫ్యాక్టరీ ధరల్లో జీఎస్టీ, సరుకు రవాణా, డీలర్ మార్జిన్‌లు ఉండవు.

ప్రపంచవ్యాప్తంగా ఈవీ వాహనాలకు డిమాండ్ అమాంతం పెరిగిపోతుంది. ఈవీ వాహనాల వాడకంలో అమెరికా, చైనా తర్వాత స్థానంలో భారత్ ఉంది. ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ కోసం భారతదేశంలో ప్రత్యేక సబ్సిడీలను ఈవీ వాహనాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. అయితే ఈ నిబంధనలు కేవలం టూ వీలర్స్‌కు మాత్రమే ఉన్నాయి. ముఖ్యంగా దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్‌ను ప్రోత్సహించేందుకు రూపొందించిన ఫేమ్-2 ప్రోత్సాహకాలను ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్స్, ఈ-త్రీ వీలర్‌ల ఎక్స్-ఫ్యాక్టరీ ధరకే అందించనున్నట్లు భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఇటీవల తెలిపింది. ఇఖపై ఈ వాహనాల ఎక్స్-ఫ్యాక్టరీ ధరల్లో జీఎస్టీ, సరుకు రవాణా, డీలర్ మార్జిన్‌లు ఉండవు. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫేమ్-2 విధానం మార్చి 31న ముగియడానికి కేవలం నెలన్నర సమయం మాత్రమే మిగిలి ఉంది. కేంద్ర ప్రభుత్వం తాజా చర్యల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
కేంద్రం నిబంధనల సవరణపై భారీ పరిశ్రమల అదనపు కార్యదర్శి డాక్టర్ హనీఫ్ ఖురేషి ఈ తగ్గింపుేలు అన్ని తాజా అమ్మకాలపై తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపారు. ఎక్స్-ఫ్యాక్టరీ ధరలపై ప్రోత్సాహకాలను లెక్కించేందుకు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నందున, వివిధ రాష్ట్రాల్లోని వాహనాల ఎక్స్-షోరూమ్ ధరల వ్యత్యాసాలను పరిష్కరించడానికి, అన్ని వాహన విభాగాలను కూడా పాలసీలో సమానంగా పరిగణించడానికి పథకంలో సవరణలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. 2023లో ద్విచక్ర వాహనాల విషయంలో ఈ నిబంధనలు తయారు చేశారు.
ప్రభుత్వ చర్య అస్సలు ఊహించలేదని, ఇకపై వాహనాలకు సవరించిన ధరలను ప్రచురించాల్సి ఉంటుందని ఆటోమొబైల్ కంపెనీల ప్రతినిధులు తెలుపుతున్నారుు. ఫిబ్రవరి 9 నుంచి రిజిస్టర్ చేసిన వాహనాలు లేదా విక్రయించే వాహనాలపై కొత్త ఎక్స్-ఫ్యాక్టరీ ధర ప్రమాణాలు వర్తిస్తాయో? లేదో? నోటిఫికేషన్ స్పష్టం చేయలేదు. చాలా మంది డీలర్లు కొంత సబ్సిడీ మొత్తాన్ని ఊహించి వాహనాలకు బిల్ చేసినందున వాటిన తిరిగి లెక్కించాల్సి ఉంటుంది. అయితే క్లెయిమ్ చేసే మొత్తం పరంగా ఏదైనా మారితే ఎలా? అని వారు ప్రశ్నిస్తున్నారు.
మార్చి 31నే గడువు
మార్చి 31, 2024 వరకు విక్రయించే ఈ-వాహనాలకు లేదా నిధులు అందుబాటులోకి వచ్చే వరకు ఏది ముందుగా ఉంటే అది ఫేమ్ కింద రాయితీలు పొందవచ్చని శుక్రవారం భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. తన ఫ్లాగ్‌షిప్ పథకం యొక్క రెండో దశ “ఫండ్- టర్మ్-లిమిటెడ్” అని పేర్కొంది. ఈ పథకం ఫండ్, టర్మ్ లిమిటెడ్ స్కీమ్ అని ఇందుమూలంగా తెలియజేశారు. అంటే డిమాండ్ ప్రోత్సాహకం కోసం రాయితీలు మార్చి 31, 2024 వరకు విక్రయించిన ఈ-2డబ్ల్యూ, ఈ-3డబ్ల్యూ, ఈ-4డబ్ల్యూకు లేదా ఫండ్స్ అందుబాటులో ఉన్న సమయానికి అర్హత ఉంటుందని తెలిపారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి.








