Gold Silver Price Today: మళ్లీ పరుగులు పెడుతున్న బంగారం, వెండి ధరలు.. తాజా రేట్ల వివరాలు!

Gold Silver Price Today: బంగారం, వెండి ధరల్లో మార్పులు చేర్పులు జరుగుతూనే ఉంటాయి. ఒక రోజు ధరలు పెరిగితే.. మరో రోజు తగ్గుముఖం పడుతున్నాయి. ఇక..

Gold Silver Price Today: మళ్లీ పరుగులు పెడుతున్న బంగారం, వెండి ధరలు.. తాజా రేట్ల వివరాలు!
Follow us

|

Updated on: Apr 08, 2022 | 5:41 AM

Gold Silver Price Today: బంగారం, వెండి ధరల్లో మార్పులు చేర్పులు జరుగుతూనే ఉంటాయి. ఒక రోజు ధరలు పెరిగితే.. మరో రోజు తగ్గుముఖం పడుతున్నాయి. ఇక ఉక్రెయిన్‌ – రష్యా యుద్ధాల కారణంగా భారీగా పెరుగుతున్నాయి. బంగారం (Gold), వెండి (Silver) ధరల్లో రోజులో మార్పులు జరుగుతూనే ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు పేర్కొంటున్నారు. బంగారం, వెండి కొనుగోలు చేసే ముందు ఎంత ధర ఉందో తెలుసుకుని వెళ్లడం మంచిది. తాజాగా శుక్రవారం (April 08) బంగారం, వెండి ధరలు పెరిగాయి. తాజాగా దేశీయంగా ధరల (Rate) వివరాలు ఇలా ఉన్నాయి.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:

  1. చెన్నై: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,590 ఉండగా, 24 క్యారెట్ల పసిడి ధర రూ.53,010 వద్ద నమోదవుతోంది.
  2. ముంబై: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,700 వద్ద ఉంది.
  3. ఢిల్లీ: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,000 ఉండగా, 24 క్యారెట్ల పసిడి ధరలు రూ.52,370 ఉంది.
  4. కోల్‌కతా: 22 క్యారెట్ల పసిడి ధర రూ.48,000 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,370 ఉంది.
  5. బెంగళూరు: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,000 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,370 ఉంది.
  6. హైదరాబాద్‌: 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.48,000 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,370 వద్ద ఉంది.
  7. విజయవాడ: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,000 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,370 ఉంది.
  8. కేరళ: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,000 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,370 వద్ద ఉంది.

వెండి ధరలు:

చెన్నైలో కిలో వెండి ధర రూ.71,000 ఉండగా, ముంబైలో రూ.71,000 ఉంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.66,300 ఉండగా, కోల్‌కతాలో రూ.66,300 ఉంది. ఇక బెంగళూరులో కిలో వెండి ధర రూ.71,000 ఉండగా, హైదరాబాద్‌లో రూ.71,000 ఉంది. విజయవాడలో కిలో వెండి ధర రూ.71,000 ఉండగా, కేరళలో రూ.71,000 వద్ద కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి:

Fact Check: కిసాన్‌ క్రెడిట్‌ కార్డు రుణాలపై వడ్డీ ఉండదా..? క్లారిటీ ఇచ్చిన పీఐబీ..!

Mutual Funds: ELSS మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడి పెడుతున్నారా.. అయితే ఈ విషయాలు గుర్తుంచుకోండి..