Gold Rates Today: మళ్లీ పరుగులు పెడుతున్న బంగారం, వెండి ధరలు.. తాజా రేట్ల వివరాలు

మళ్లీ బంగారం ధరలు పెరుగుదల మొదలైంది. కొన్ని రోజుల నుంచి పరుగులు పెట్టి ఐదారు రోజుల నుంచి స్వల్పంగా తగ్గుతూ వచ్చింది. కానీ మే 3వ తేదీ దేశీయంగా బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.66,260 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,280 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి విషయానికొస్తే దేశీయంగా..

Gold Rates Today: మళ్లీ పరుగులు పెడుతున్న బంగారం, వెండి ధరలు.. తాజా రేట్ల వివరాలు
Gold Price
Follow us

|

Updated on: May 03, 2024 | 6:23 AM

మళ్లీ బంగారం ధరలు పెరుగుదల మొదలైంది. కొన్ని రోజుల నుంచి పరుగులు పెట్టి ఐదారు రోజుల నుంచి స్వల్పంగా తగ్గుతూ వచ్చింది. కానీ మే 3వ తేదీ దేశీయంగా బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.66,260 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,280 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి విషయానికొస్తే దేశీయంగా కిలో వెండి ధర రూ.83,600 ఉంది. అయితే మన భారతీయ సాంప్రదాయంలో బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. ధరలు ఎంత పెరిగినా కొనుగోళ్లు జరుగుతూనే ఉంటాయి. అయితే ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు.

దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా..

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,160 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.72,280 ఉంది, ఇక దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.66,260 ఉండగా,24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,280 ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.66,410 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,430 ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.66,260 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,280 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.66,260 ఉండగా, 24 క్యారెట్ల10 గ్రాముల ధర రూ.72,280 ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,280 ఉండగా, 24 క్యారెట్ల10 ధర రూ.72,280 ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.66,260 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,280 ఉంది.

ఇండియన్ బులియన్ జువెలర్స్ అసోసియేషన్ విడుదల చేసిన ధరలు వివిధ స్వచ్ఛతలతో కూడిన బంగారం ప్రామాణిక ధర గురించి సమాచారాన్ని అందజేస్తుంది. ఈ ధరలన్నీ పన్ను, మేకింగ్ ఛార్జీలకు ముందు ఉంటాయి. ఐబీజేఏ జారీ చేసిన రేట్లు దేశవ్యాప్తంగా సార్వత్రికమైనవి కానీ వాటి ధరలలో జీఎస్టీ ఉండదు. ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు, బంగారం లేదా వెండి ధరలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వాటిలో ట్యాక్స్‌లు కలిపి ఉంటాయి.

గత సంవత్సరాలతో పోలిస్తే కేవలం ఐదు నెలల్లోనే 10 గ్రాముల బంగారం ధర రూ.60,000 నుంచి రూ.70,000కి పెరిగింది. ఈ ఆకస్మిక పెరుగుదల వినియోగదారుల డిమాండ్‌ను తగ్గించింది. ముఖ్యంగా మొత్తం వినియోగంలో 75% వాటా ఉన్న బంగారు ఆభరణాల కోసం. ప్రజలు ఇంత ఎక్కువ ధరలకు కొనుగోలు చేయడానికి ఇష్టపడరు. బహుశా ధరలు స్థిరీకరించే వరకు వేచి ఉండవచ్చు. అదనంగా ప్రస్తుత కాలంలో (ఏప్రిల్-మే) తక్కువ వివాహాలు కూడా బంగారు ఆభరణాల కొనుగోళ్ల తగ్గుదలకు కారణం, ఎందుకంటే అలాంటి కొనుగోళ్లకు వివాహాలు ఒక ముఖ్యమైన కారణం.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Latest Articles
గరుడ పురాణం ప్రకారం ఈ ఐదు తప్పులు చేస్తే ఆయుష్షు తగ్గుతుందట..
గరుడ పురాణం ప్రకారం ఈ ఐదు తప్పులు చేస్తే ఆయుష్షు తగ్గుతుందట..
భక్తులకు ఆవుల దత్తత.. తీసుకోవాలంటే ఏం చేయాలి..?
భక్తులకు ఆవుల దత్తత.. తీసుకోవాలంటే ఏం చేయాలి..?
రన్నింగ్ బస్సులోనే రచ్చ.. పక్కన జనాలు ఉన్నారన్న పోయి కూడా లేదు
రన్నింగ్ బస్సులోనే రచ్చ.. పక్కన జనాలు ఉన్నారన్న పోయి కూడా లేదు
ఎఫ్‌డీ చేయాలనుకుంటున్నారా? అధిక వడ్డీ ఇచ్చే బ్యాంకులు ఇవే..
ఎఫ్‌డీ చేయాలనుకుంటున్నారా? అధిక వడ్డీ ఇచ్చే బ్యాంకులు ఇవే..
స్టార్ హీరో ఇంట్లో పెను విషాదం..
స్టార్ హీరో ఇంట్లో పెను విషాదం..
వందే భారత్ రైలు ఇంజిన్‌ కింద ఇరుక్కుపోయిన ఆవు..ఆ తర్వాత జరిగింది?
వందే భారత్ రైలు ఇంజిన్‌ కింద ఇరుక్కుపోయిన ఆవు..ఆ తర్వాత జరిగింది?
ప్రధాన పార్టీల్లో గుబులు రేపుతున్న క్రాస్ ఓటింగ్..!
ప్రధాన పార్టీల్లో గుబులు రేపుతున్న క్రాస్ ఓటింగ్..!
గుడ్డుతో కలిపి ఈ ఆహారాలు తీసుకుంటే అంతే సంగతులు.. బీ కేర్‌ఫుల్!
గుడ్డుతో కలిపి ఈ ఆహారాలు తీసుకుంటే అంతే సంగతులు.. బీ కేర్‌ఫుల్!
సోమ ప్రదోష వ్రతం రోజున శివయ్యకు వేటితో అభిషేకం చేస్తే శుభం అంటే..
సోమ ప్రదోష వ్రతం రోజున శివయ్యకు వేటితో అభిషేకం చేస్తే శుభం అంటే..
సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలోనూ దుమ్మురేపుతోన్న దేవయాని
సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలోనూ దుమ్మురేపుతోన్న దేవయాని