పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. షాకిచ్చిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే!

Gold Price Today: దేశంలో బంగారం క్రయ విక్రయాలు రోజూ రూ. కోట్లలో జరుగుతుంటాయి. స్థానిక మార్కెట్లలో డిమాండ్, అంతర్జాతీయ మార్కెట్‌లో..

పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. షాకిచ్చిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే!
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Sep 23, 2021 | 5:14 PM

దేశంలో బంగారం క్రయ విక్రయాలు రోజూ రూ. కోట్లలో జరుగుతుంటాయి. స్థానిక మార్కెట్లలో డిమాండ్, అంతర్జాతీయ మార్కెట్‌లో చోటు చేసుకున్న పరిస్థితుల ఆధారంగా ప్రతీ రోజూ బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తాయని బులియన్ మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఈ క్రమంలోనే పసిడి రేట్లు ఒక రోజు తగ్గితే.. మరో రోజు పెరుగుతుంటాయి. ఆదివారం స్థిరంగా ఉన్న బంగారం ధర.. సోమవారం కాస్త తగ్గగా.. మంగళవారం మరోసారి పెరిగింది. ఇక తాజాగా పసిడి ధరలు మరోసారి పెరిగి బంగారం కొనుగోలు చేయాలనుకున్న వారికి షాకిచ్చాయి. బంగారం ధర పైకి చేరితే.. వెండి రేటు మాత్రం పడిపోయింది. కాగా, దేశంలోని ప్రధాన నగరాల్లో ఉదయం 6 గంటలకు బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

ఢిల్లీ మార్కెట్‌లో బుధవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 200 పెరిగి రూ. 45,650కు చేరింది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 220కు పెరిగి రూ. 49,800గా కొనసాగుతోంది. చెన్నై మార్కెట్‌లో పసిడి ధరలు ఇలా ఉన్నాయి.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,740 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,720 ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,330 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,330 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,460 ఉంది. ఇక కోల్‌కతా బులియన్ మార్కెట్‌లో అయితే బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది. అక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,250 ఉంది.

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో అయితే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 200 పెరిగి రూ. 43,500గా కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,460కి చేరింది. విజయవాడ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 350 పెరిగి రూ. 43,850గా కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 380 పెరిగి రూ. 47,840కి చేరింది.  కాగా, వెండి ధరల విషయానికి వస్తే.. వెండి రేటు నేలచూపులు చూస్తుంది. తాజాగా రూ. 400 దిగొచ్చింది. దీనితో కేజీ వెండి ధర ప్రస్తుతం రూ. 63,800గా కొనసాగుతోంది.

Read Also: ఈ ఫోటోలోని జింకను కనిపెట్టండి.. మీ మెదడుకు మేత వేయండి.. ఈజీగా కనిపెట్టొచ్చు..

గాల్లో ఢీకొన్న రెండు విమానాలు.. దూకేసిన ప్రయాణీకులు.. చివరికి ఏం జరిగిందంటే.!

టీమిండియా కీలక బ్యాట్స్‌మెన్.. బీసీసీఐపై తిరగబడ్డాడు.. కెరీర్‌ను అర్ధాంతరంగా ముగించాడు.. ఎవరో తెలుసా.?

గజరాజుకు కోపమొస్తే ఇంతేనేమో.. అడవి దున్నను కుమ్మేసిందిగా.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారంతే.!