Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే?
ప్రతిరోజు దేశంలో బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతుంటాయి. ఇక తాజాగా దేశీయంగా మే 31 బుధవారం బంగారం, వెండి ధరల్లో కొంత తగ్గుదల కనిపించింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
Gold Price Today: బంగారం అంటే భారతీయులకు.. అందులోనూ మహిళలకు ఎంతో ఇష్టం. ఒకప్పుడు అలంకారానికి మాత్రమే వినియోగించే పసిడి.. ప్రస్తుతం ఒక పెట్టుబడి సాధనంగానూ మారిపోయింది. దీంతో బంగారం కొనుగోలు చేస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో డిమాండ్ పెరిగి బంగారం ధరలు కొన్నేళ్లలోనే భారీగా పెరుగుతోంది. కొద్ది రోజులుగా దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు వరుసగా పడిపోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లోనూ ధరలు పడిపోతుండడం ఇందుకు ఒక కారణంగా చెబుతున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. ప్రతిరోజు దేశంలో బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతుంటాయి. ఇక తాజాగా దేశీయంగా మే 31 బుధవారం బంగారం, వెండి ధరల్లో తగ్గుదల కనిపించింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
➦ చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,850 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,920 వద్ద నమోదైంది.
➦ ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.55,450 ఉండగా, 24 క్యారెట్ల తులం ధర రూ.60,490 వద్ద ఉంది.
➦ ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల రూ.55,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,630 ఉంది.
➦ కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,490 ఉంది.
➦ బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.55,500 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.60,530 వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో..
➦ హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,490 వద్ద కొనసాగుతోంది.
➦ విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,450 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.60,490 వద్ద కొనసాగుతోంది.
➦ విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,490 ఉంది.
వెండి ధర:
కాగా, బంగారం ధర తగ్గుముఖం పడితే వెండి ధరలోనూ తగ్గుదల కనిపించింది. దేశీయంగా ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే..
➦ చెన్నైలో కిలో వెండి ధర రూ.76,500, ముంబైలో రూ.72,600, ఢిల్లీలో రూ.72,600, కోల్‌కతాలో కిలో వెండి రూ.72,600, బెంగళూరులో రూ.72,600, హైదరాబాద్‌లో రూ.76,500, విశాఖలో రూ.76,500 వద్ద ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..