Gold Price Today: లక్ష దగ్గర ఊగిసలాడుతున్న బంగారం ధర.. ఈ రోజు ధర ఎంత ఉందో తెలుసా?
Gold Price Today: మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు వంటి అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు, ప్రజలు తమ పెట్టుబడులను భద్రపరచుకోవడానికి బంగారం వైపు మొగ్గు చూపుతారు. దీనివల్ల ధరలు పెరుగుతాయి..

ఈ మధ్యకాలంలో బంగారం ధర లక్ష రూపాయల దగ్గర ఊగిసలాడుతోంది. ఇటీవల లక్ష రూపాయలు దాటి బంగారం ధర.. క్రమంగా దిగి వస్తోంది. అయితే ప్రస్తుతం లక్ష దగ్గర కదలాడుతోంది. గతంలో తులం ధర 90 వేల రూపాయల వద్ద ఉండగా, ఇప్పుడు లక్షకు చేరుకుంటోంది. ప్రస్తుతం ఎంత దిగి వచ్చినా.. యాబై, వంద రూపాయలు మాత్రమే దిగి వస్తోంది. కానీ పెరిగినప్పుడు మాత్రం అంతకు రెట్టింగా పెచుగుతోంది. ఇంత స్వల్ప తగ్గింపులతో వినియోగదారులకు పెద్దగా ఒరిగేది లేదనే చెప్పాలి. అంతర్జాతీయ మార్కెట్లలోని పరిస్థితులు, ద్రవ్యోల్బణం, ఇతర ఆర్థిక అంశాల కారణంగా ఈ మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
ఇది కూడా చదవండి: Maruti Suzuki: ఈ కారు రికార్డ్ స్థాయిలో అమ్మకాలు.. 80 దేశాలలో ఆధిపత్యం చెలాయిస్తోంది!
ప్రస్తుతం జూలై 30వ తేదీన దేశీయంగా తులం బంగారంపై స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. అంతే పది రూపాయలు మాత్రమే తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 99,810 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 91,490 రూపాయల వద్ద ఉంది.
- ఇక ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 99,960 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 91,640 రూపాయల వద్ద ఉంది.
- ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 99,810 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 91,490 రూపాయల వద్ద ఉంది.
- హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 99,810 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 91,490 రూపాయల వద్ద ఉంది.
- విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 99,810 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 91,490 రూపాయల వద్ద ఉంది.
- చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 99,810 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 91,490 రూపాయల వద్ద ఉంది.
- బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 99,810 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 91,490 రూపాయల వద్ద ఉంది.
- ఇక వెండి విషయానికొస్తే ఇది కూడా స్వల్పంగానే తగ్గింది. కిలో వెండి ధర 1 లక్షా 15 వేల రూపాయలు ఉంది. ఇక హదరాబాద్, చెన్నై, కోల్‌కతాలో 1 లక్షా 25 వేల వరకు ఉంది.
ఇది కూడా చదవండి: కస్టమర్లకు అలర్ట్.. ఆగస్ట్‌లో 15 రోజుల బ్యాంకులకు సెలవులు
మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు వంటి అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు, ప్రజలు తమ పెట్టుబడులను భద్రపరచుకోవడానికి బంగారం వైపు మొగ్గు చూపుతారు. దీనివల్ల ధరలు పెరుగుతాయి. రూపాయి విలువ డాలర్ తో పోలిస్తే తగ్గినప్పుడు, బంగారం దిగుమతి ఖరీదైనదిగా మారుతుంది, ఇది ధరలను పెంచుతుంది. మీరు బంగారం కొనడానికి లేదా అమ్మడానికి ఆసక్తి కలిగి ఉంటే, మార్కెట్ పరిస్థితులను గమనిస్తూ, నిపుణులతో సంప్రదించి నిర్ణయం తీసుకోవడం మంచిది.
ఇది కూడా చదవండి: Viral Video: హేయ్.. నాతో పెట్టుకోకు.. పులినే తరిమికొట్టిన కుక్క.. వీడియో వైరల్
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








