Electric Scooter: కేవలం రూ.54వేలకే 130కిమీ రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్.. డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు!
Electric Scooter: బ్యాటరీని బట్టి ఛార్జింగ్ సమయం మారుతుంది. లిథియం-అయాన్ బ్యాటరీలు ఛార్జ్ కావడానికి దాదాపు 4 గంటలు పడుతుంది. అదే జెల్ బ్యాటరీలు ఛార్జ్ కావడానికి 8 నుండి 12 గంటలు పడుతుంది. బ్యాటరీలలో ఆరు ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో బ్రేకింగ్ సిస్టమ్..

జలియో ఇ మొబిలిటీ తన లో స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ గ్రేసీ ప్లస్ అప్‌డేట్ చేసిన వెర్షన్‌ను విడుదల చేసింది. ప్రత్యేకత ఏమిటంటే దీనిలో ఉపయోగించే BLDC మోటారు పూర్తిగా ఛార్జ్ చేసినట్లయితే 1.8 యూనిట్ల విద్యుత్తును మాత్రమే వినియోగిస్తుందని కంపెనీ చెబుతోంది. కంపెనీ వివరాల ప్రకారం.. భారతీయ రోడ్లపై సులభంగా నడపగలిగేలా దీని గ్రౌండ్ క్లియరెన్స్ 180 మిమీకి పెంచింది. దీని బరువు 88 కిలోలు. అలాగే ఇది 150 కిలోల వరకు భారాన్ని మోయగలదు. అందువల్ల, డెలివరీ ఏజెంట్లు, ఆఫీసులకు వెళ్లేవారు, విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది.
ఇది కూడా చదవండి: రూ.6.29 లక్షలకే 7 సీటర్స్ కారు.. 6 ఎయిర్ బ్యాగ్స్.. చౌకైన కారు
కొత్త గ్రేసీ+ ఇప్పుడు ఆరు బ్యాటరీ ఎంపికలతో వస్తుంది. వాటిలో లిథియం-అయాన్, జెల్ బ్యాటరీ ఎంపికలు రెండూ ఉన్నాయి. దీని టాప్ మోడల్స్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 130 కి.మీ వరకు మైలేజీ ఇస్తుంది. ఇది 60/72V BLDC మోటార్‌తో పనిచేస్తుంది. ఇవి ప్రత్యేకంగా ఎక్కువ దూరం ప్రయాణించాల్సిన వారి కోసం రూపొందించారు. ఈ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 25 కి.మీ. అందుకే ఇది తక్కువ-వేగం విభాగంలోకి వస్తుంది. చాలా భారతీయ రాష్ట్రాలలో దీన్ని నడపడానికి డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. ఈ మోటార్‌కు పూర్తిగా ఛార్జ్ చేయడానికి కేవలం 1.8 యూనిట్ల విద్యుత్ మాత్రమే అవసరం అవుతుంది.
పార్కింగ్ గేర్, కీలెస్ స్టార్ట్:
ఇందులో గ్రేసీ+లో డిజిటల్ డిస్‌ప్లే, కీలెస్ స్టార్ట్, DRL, యాంటీ-థెఫ్ట్ అలారం, USB ఛార్జింగ్ పోర్ట్, పార్కింగ్ గేర్, పిలియన్ కోసం ఫుట్‌రెస్ట్ ఉన్నాయి. ఇది తెలుపు, బూడిద, నలుపు, నీలం అనే నాలుగు రంగులలో వస్తుంది. ఈ అప్‌డేట్‌లు స్కూటర్ పాత్రలో పెద్ద మార్పును తీసుకురాలేదు. కానీ వినియోగదారుల అభిప్రాయాలు, వాస్తవ అవసరాలకు అనుగుణంగా కంపెనీ దానిని మెరుగుపరిచిందని చెబుతోంది. ఈ ఉత్పత్తిపై కంపెనీ మంచి సర్వీస్ వారంటీని కూడా అందిస్తుంది. వాహనంపై రెండు సంవత్సరాల వారంటీ, లిథియం-అయాన్ బ్యాటరీపై మూడు సంవత్సరాల వారంటీ, జెల్ బ్యాటరీపై ఒక సంవత్సరం వారంటీ అందిస్తుంది.
బ్యాటరీని బట్టి ఛార్జింగ్ సమయం మారుతుంది. లిథియం-అయాన్ బ్యాటరీలు ఛార్జ్ కావడానికి దాదాపు 4 గంటలు పడుతుంది. అదే జెల్ బ్యాటరీలు ఛార్జ్ కావడానికి 8 నుండి 12 గంటలు పడుతుంది. బ్యాటరీలలో ఆరు ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో బ్రేకింగ్ సిస్టమ్ కూడా మెరుగుపడేలా రూపొందించింది. ముందు భాగంలో డ్రమ్ బ్రేక్‌లు, వెనుక భాగంలో డిస్క్ బ్రేక్‌లు అందించింది. అలాగే మరింత సౌకర్యం కోసం హైడ్రాలిక్ షాక్ అబ్జార్బర్‌లను ఇన్‌స్టాల్ చేశారు. దీని ధర కేవలం రూ.58,000 నుండి ప్రారంభమవుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








