AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price: మహిళలకు గుడ్‌న్యూస్‌.. ఒక్క రోజులోనే భారీగా పతనమైన బంగారం ధర..

Gold Price: ఈ ధరల పెరుగుదలకు అనేక కారణాలు ఉన్నాయి. అంతర్జాతీయ, దేశీయ కారణాలు ఉన్నాయి. అమెరికా డాలర్ బలపడటం, ఆసియా మార్కెట్లలో డిమాండ్ పెరగడం వంటి అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నాయి. అదనంగా, కేంద్ర బ్యాంకుల బంగారం నిల్వలు..

Gold Price: మహిళలకు గుడ్‌న్యూస్‌.. ఒక్క రోజులోనే భారీగా పతనమైన బంగారం ధర..
Subhash Goud
|

Updated on: Jul 24, 2025 | 2:52 PM

Share

ఆగకుండా పరుగులు పెడుతున్న బంగారం ధర లక్ష దాటేసింది. అయితే నిన్న తులం బంగారంపై రూ.1040 వరకు పెరిగిన విషయం తెలిసిందే. అయితే తాజాగా జూలై 24న మధ్యాహ్నం సమయానికి భారీగా తగ్గుముఖం పట్టింది. 24 క్యారెట్ల తులం బంగారం పై ఏకంగా 1360 రూపాయలు తగ్గింది. నిన్న తులం ధర లక్షా 2,330 రూపాయలు ఉండగా, ఈ రోజు లక్షా 970 రూపాయలకు దిగి వచ్చింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 1250 రూపాయలు తగ్గి ప్రస్తుతం 92,550 రూపాయలకు చేరుకుంది. ఇక వెండి విషయానికొస్తే వెయ్యి రూపాయలు తగ్గి ప్రస్తుతం కిలో వెండి ధర లక్షా 18 వేల రూపాయలకు చేరుకుంది.

ఇది కూడా చదవండి: రూ.6.29 లక్షలకే 7 సీటర్స్‌ కారు.. 6 ఎయిర్‌ బ్యాగ్స్‌.. చౌకైన కారు

అయితే ఇటీవల నుంచి బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. ఇది సాధారణ కుటుంబాలకు పెద్ద తలనొప్పిగా మారింది. పెళ్లిళ్లు, ఇతర వేడుకలకు బంగారం కొనాలంటేనే సామాన్యులకు పెద్ద సవాలుగా మారిపోయింది. అయితే ఇప్పుడు కొంత ఊరట వచ్చింది. అయినా తులం ధర లక్ష రూపాయలకుపైనే ఉంది. గత కొద్ది రోజులుగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు ఈ రోజు కాస్త తగ్గిపోయాయి.

ఇవి కూడా చదవండి

ఇప్పట్లో బంగారం కొనడం మంచిదేనా?

మీరు పెళ్లిళ్లు, భవిష్యత్ పెట్టుబడి, ఉంగరాలు, గిఫ్ట్‌లు వంటి విషయాలకు బంగారం కొనాలని ప్లాన్ చేస్తే ప్రస్తుతం ఉన్న ధరలు మంచి అవకాశమే అని చెప్పొవచ్చు. ఎందుకంటే ఇవి తాత్కాలిక తగ్గుదలలు కావచ్చు. త్వరలోనే మరింత పెరిగే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ధరల పెరుగుదలకు కారణాలు:

ఈ ధరల పెరుగుదలకు అనేక కారణాలు ఉన్నాయి. అంతర్జాతీయ, దేశీయ కారణాలు ఉన్నాయి. అమెరికా డాలర్ బలపడటం, ఆసియా మార్కెట్లలో డిమాండ్ పెరగడం వంటి అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నాయి. అదనంగా, కేంద్ర బ్యాంకుల బంగారం నిల్వలు, ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లలో హెచ్చుతగ్గులు కూడా ఈ ధరల పెరుగుదలకు దోహదం చేస్తున్నాయి. వెండి ధరల పెరుగుదలకు పారిశ్రామిక డిమాండ్, ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, సోలార్ ఎనర్జీ సెక్టార్లలో ఉపయోగం, ఒక ప్రధాన కారణంగా మారింది.

ఇది కూడా చదవండి: PAN Card: మీ పాన్‌ కార్డును ఉపయోగించి ఎవరైనా లోన్‌ తీసుకున్నారా? ఇలా తెలుసుకోండి.. సింపుల్‌ ట్రిక్‌!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..