Gold Rates Today: మహిళలకు గుడ్ న్యూస్.. స్థిరంగా కొనసాగుతోన్న బంగారం, వెండి ధరలు.!

బంగారం కొనాలనుకుంటున్నవారికి తీపికబురు. గత కొద్దిరోజులుగా తగ్గుతూ వస్తోన్న పసిడి ధరలు ఇవాళ స్థిరంగా కొనసాగుతున్నాయి...

Gold Rates Today: మహిళలకు గుడ్ న్యూస్.. స్థిరంగా కొనసాగుతోన్న బంగారం, వెండి ధరలు.!
Gold
Follow us

|

Updated on: Aug 04, 2021 | 5:57 AM

బంగారం కొనాలనుకుంటున్నవారికి తీపికబురు. గత కొద్దిరోజులుగా తగ్గుతూ వస్తోన్న పసిడి ధరలు ఇవాళ స్థిరంగా కొనసాగుతున్నాయి. బంగారు ప్రియులకు ఇది ఊరటను కలిగించే అంశం. హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం బంగారం ధర స్థిరంగా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,980గా ఉండగా.. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,900 వద్ద కొనసాగుతోంది. ఇదిలా ఉండగా.. బంగారంతో పాటు వెండి ధర కూడా స్థిరంగా కొనసాగుతోంది. వెండి రేటు రూ.400 క్షీణించి.. కేజీ రూ.72,700గా ఉంది.

అటు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 44,990 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.48,980 వద్ద కొనసాగుతోంది. వెండి అయితే కేజీ రూ.72,700గా ఉంది. విజయవాడలో మాదిరిగానే విశాఖపట్నంలో కూడా బంగారం, వెండి ధరలు ఇంచుమించు ఒకేలా ఉన్నాయి. ఎలాంటి మార్పు లేదు. కాగా, అంతర్జాతీయ మార్కెట్‌ పసిడి ధరల్లో మార్పులు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు దేశీయంగా గోల్డ్ రేట్స్‌పై ప్రభావం చూపిస్తున్నాయని బిజినెస్ నిపుణులు చెబుతున్నారు.

Also Read:

భర్త వింత అలవాటు.. రోజుకు 4 గంటలు టాయిలెట్‌లోనే.. కారణం తెలిసి భార్య షాక్.!

కుక్కను పట్టి నీళ్లలోకి లాగేసిన మొసలి.. చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

ఈ చిన్నారి సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్.. అబ్బాయిల్లో విపరీతమైన ఫాలోయింగ్.. గుర్తుపట్టారా!