AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold: బంగారం క్వాలిటీ ఎన్ని రకాలు? కొనే ముందు ఇవి తప్పక తెలుసుకోండి!

బంగారం కొనుగోలు చేసేటప్పుడు నాణ్యత, స్వచ్ఛత అత్యవశ్యకం. 24K, 22K, 18K క్యారెట్లను అర్థం చేసుకోవడం, BIS హాల్‌మార్క్, జ్యువెలర్ ఐడీని తనిఖీ చేయడం ముఖ్యమైనవి. మార్కెట్ ధరలు, మేకింగ్ ఛార్జీలు, బిల్లు ప్రాముఖ్యతను తెలుసుకోవాలి. రత్నాలున్న నగలు కొనేటప్పుడు బంగారం, రత్నాల బరువును విడిగా లెక్కించి, నష్టపోకుండా జాగ్రత్తపడండి.

Gold: బంగారం క్వాలిటీ ఎన్ని రకాలు? కొనే ముందు ఇవి తప్పక తెలుసుకోండి!
Gold Purity Check
SN Pasha
|

Updated on: Mar 26, 2026 | 6:51 AM

Share

మన దేశంలో బంగారం కొనుగోలు ఒక సంప్రదాయం మాత్రమే కాకుండా పెట్టుబడిగా కూడా భావిస్తారు. అయితే బంగారం నాణ్యతపై సరైన అవగాహన లేకపోతే వినియోగదారులు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. నిపుణుల ప్రకారం బంగారం ప్రధానంగా క్యారెట్‌ (Karat) ఆధారంగా విభజించబడుతుంది. అధిక నాణ్యత గల బంగారం 24 కేరట్లు (24K)గా పరిగణించబడుతుంది. ఇందులో 99.9 శాతం స్వచ్ఛమైన బంగారం ఉంటుంది. అయితే ఇది చాలా మృదువుగా ఉండటం వల్ల నగల తయారీలో ఎక్కువగా ఉపయోగించరు. అందువల్ల 22K (91.6 శాతం స్వచ్ఛత) బంగారం నగల తయారీలో విస్తృతంగా ఉపయోగిస్తారు. 18K (75 శాతం స్వచ్ఛత), 14K వంటి బంగారం రకాలు ప్రధానంగా డైమండ్ జ్యువెలరీ, డిజైనర్ ఆభరణాల్లో ఉపయోగిస్తారు. కేరట్ సంఖ్య తగ్గే కొద్దీ బంగారంలో ఇతర లోహాల మిశ్రమం పెరుగుతుంది.

బంగారం కొనుగోలు చేసే ముందు హాల్‌మార్క్ తప్పనిసరిగా పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు. భారతదేశంలో బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండెర్డ్స్‌ (BIS) హాల్‌మార్క్ నాణ్యతకు గుర్తుగా పరిగణించబడుతుంది. దీనిలో BIS లోగో, కేరట్ వివరాలు, జ్యువెలర్ గుర్తింపు నంబర్ వంటి వివరాలు ఉంటాయి. ఇక బంగారం ధరలను కొనుగోలు చేసే రోజున మార్కెట్ రేట్లతో సరిపోల్చుకోవడం కూడా అవసరం. మేకింగ్‌ చార్జీలు దుకాణం వారీగా మారుతాయి కాబట్టి ముందుగా అవి తెలుసుకోవడం మంచిది. బిల్లుతో కొనుగోలు చేయడం ద్వారా భవిష్యత్తులో ఎక్స్చేంజ్ లేదా రీసేల్ సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా ఉంటుంది.

మరొక ముఖ్య అంశం.. రత్నాలు లేదా డైమండ్లు ఉన్న నగలు కొనుగోలు చేసే సమయంలో బంగారం బరువు, రత్నాల బరువును వేర్వేరుగా లెక్కించాలి. లేకపోతే అధిక ధర చెల్లించే ప్రమాదం ఉంటుంది. మొత్తంగా బంగారం కొనుగోలులో నాణ్యత, ధృవీకరణ, ధర వంటి అంశాలను జాగ్రత్తగా పరిశీలిస్తేనే వినియోగదారులు సురక్షితంగా, లాభదాయకంగా పెట్టుబడి పెట్టగలరు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us