AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వేసవికి బాగా సెట్ అయ్యే బీరకాయ మజ్జిగ పులుసు.. ఓసారి మీరు కూడా ట్రై చేయండి

బీరకాయ మజ్జిగ పులుసు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇది వరకు రోజుల్లో అందరూ ఇష్టంగా తినే వాళ్ళు. ఇక ఇప్పుడు తినడమే మానేశారు. అందుకే మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం.. ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం

Prasanna Yadla
|

Updated on: Mar 25, 2026 | 11:29 PM

Share
కావాల్సిన పదార్దాలు : బీరకాయలు,  మజ్జిగ,  రుచికి సరిపడా ఉప్పు, కారం, అర టీ స్పూన్ పసుపు,  ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, ఆవాలు, మినపప్పు, నూనె, కరివేపాకు, కొత్తిమీరను తీసుకోవాలి.

1 / 5
ముందుగా  బీరకాయ పైనున్న తొక్కను తీసి వాటిని కడిగి చిన్న  చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇక ఇప్పుడు ఒక గిన్నె లేదా గ్లాస్ లో పెరుగును తీసుకుని, దానిలో నీళ్లు పోసి మజ్జిగలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి.

2 / 5
ఇప్పుడు స్టవ్ వెలిగించి  ఒక పాత్రలో బీరకాయ ముక్కలు, కొద్దిగా నీరు, అర టీ స్పూన్ పసుపు,  కొద్దిగా ఉప్పు వేసి వాటిని  బాగా ఉడికించాలి. ముక్కలు బాగా ఉడికిన తర్వాత దానిలో మజ్జిగను పోసి, మీడియం మంటపై వాటిని మరిగించాలి.

3 / 5
ఇప్పుడు మళ్ళీ వేరే పాన్ తీసుకుని చిన్న పాన్ లో కొద్దిగా ఆయిల్ వేసి, అర టీ స్పూన్ ఆవాలు,  అర టీ స్పూన్ జీలకర్ర,  దానిలో ఎండుమిర్చి,  నాలుగు కరివేపాకు, 4 పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం పేస్ట్ వేసి పోపు పెట్టాలి .

4 / 5
సమ్మర్లో ఈ బీరకాయ మజ్జిగ పులుసును తాగితే శరీరానికి చలువ చేస్తుంది. ఈ మజ్జిగ పులుసులో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే త్వరగా జీర్ణమవుతుంది.

5 / 5
Follow Us