AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: వారికి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి.. 12 రాశుల వారికి రాశిఫలాలు

మార్చి 26, 2026 గురువారం రోజున గ్రహ స్థితులు సాధారణంగా అనుకూల ధోరణిలోనే ఉన్నప్పటికీ, కొన్ని రాశుల వారికి బాధ్యతలు, ఒత్తిడి పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చంద్రుని సంచారం, గురు–శని ప్రభావాలు కలిసి ఆర్థిక స్థిరత్వాన్ని పెంచేలా పనిచేస్తున్నాయి. మేషం, మిథునం, కన్య, ధనుస్సు, మకర రాశుల వారికి ఈ రోజు ప్రత్యేకంగా శుభప్రదంగా కనిపిస్తోంది.

Horoscope Today: వారికి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Daily Horoscope 26 March 2026
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 26, 2026 | 5:31 AM

Share

దిన ఫలాలు (మార్చి 26, 2026): మేష రాశి వారికి ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. వృషభ రాశి వారికి స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. సొంత విషయాల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. అధికారులతో సామరస్యం పెరుగుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగంలో .ప్రత్యేక బాధ్యతలను కూడా నిర్వర్తించాల్సి వస్తుంది. వృత్తి జీవితంలో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాలు నల్లేరు కాయల మీద బండిలా సాగిపోతాయి. ఇంట్లో శుభ కార్యం తలపెడతారు. కుటుంబ సభ్యులంతా కలుసుకునే అవకాశం ఉంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. వ్యక్తిగత, ఆర్థిక, కుటుంబ సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగులకు అధికారుల నుంచి ప్రోత్సాహం, ప్రోత్సాహకాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో సొంత ఆలోచనలు ఆశించిన ఫలితాలనిస్తాయి. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. కుటుంబ బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. కొద్దిగా ఒత్తిడి కూడా ఉంటుంది. తలపెట్టిన పనులు సంతృప్తికరంగా పూర్తవుతాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. సొంత విషయాల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. పిల్లలకు సమయం అనుకూలంగా ఉంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వృత్తి, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. అధికారులతో సామరస్యం పెరుగుతుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ముఖ్యమైన వ్యవహా రాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. వ్యాపారంలో కొత్త పెట్టుబడులకు అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఆఫర్లు అందుతాయి. ఉద్యోగం మారడానికి సమయం అనుకూలంగా ఉంది. ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. పిల్లలు సునాయాసంగా ఘన విజయాలు సాధిస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగాల్లో పని ఒత్తిడి ఎక్కువగానే ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఇంటికి బంధువుల రాకపోకలుంటాయి. కొందరు మిత్రులతో సఖ్యత పెరుగు తుంది. ఇంటా బయటా అనుకూలతలకు లోటుండదు. మిత్రుల నుంచి ఆశించిన శుభవార్త వింటారు. తలపెట్టిన వ్యవహారాలు, పనులు సకాలంలో పూర్తవుతాయి. కుటుంబంతో దైవ దర్శనాలు చేసుకుంటారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంది. వ్యాపారాలు లాభ సాటిగా సాగుతాయి. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. ఆర్థిక సమస్యలకు సంబంధించిన ఒత్తిడి ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్ని సకాలంలో పూర్తి చేస్తారు. మీ నుంచి సహాయం పొందిన వారు ముఖం చాటేస్తారు. బంధువుల కుటుంబ వ్యవహారాల్లో తలదూర్చవద్దు. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. పిల్లలు చదువుల్లో కష్టపడాల్సి ఉంటుంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో మీ పనితీరుతో అందరిని ఆకట్టుకుంటారు. వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు గడిస్తాయి. వ్యక్తిగత సమస్యల పరిష్కారం మీద శ్రద్ధ పెడతారు. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను చక్కబెడతారు. కుటుంబ సభ్యుల మీద ఖర్చు పెరుగుతుంది. ముఖ్యమైన ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందుతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగంలో మీ ప్రతిభా నైపుణ్యాల మరింతగా వెలుగులోకి వస్తాయి. వృత్తి, వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. బంధుమిత్రులతో సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి. ఒకటి రెండు వివాదాలు, సమస్యల నుంచి బయటపడతారు. ప్రముఖులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగంలో కొద్దిగా శ్రమ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. తలపెట్టిన పనులు నిదానంగా సాగుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాల్లో కొన్ని ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఆర్థిక వ్యవహారాలు బాగా అనుకూలంగా సాగిపోతాయి. కుటుంబ, వ్యక్తి గత సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్వల్ప అనారోగ్యానికి అవకాశముంది. ప్రేమలో పడే సూచనలున్నాయి. ఆదాయం పరవాలేదు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహకారం లభిస్తుంది. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతంగా పూర్తవుతుంది. ముఖ్యమైన పనులు సంతృప్తికరంగా పూర్తవుతాయి. పిల్లలు సునాయాసంగా పురోగతిసాధిస్తారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

మీ శక్తి సామర్థ్యాలకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. సర్వత్రా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని ప్రోత్సాహకాలు అందుకుంటారు. వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు గడించడం జరుగుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. ఆర్థికంగా ఉన్నత స్థానానికి వెడతారు. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వ్యక్తిగత సమస్యల పరిష్కారం మీద దృష్టి పెడతారు. ఆర్థిక విషయాల మీద శ్రద్ధ పెరుగుతుంది. కొందరు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయ వృద్ధికి బాగా అవకాశం ఉంది. ఇంటి సమస్యల్ని సమయస్ఫూర్తిగా పరిష్కరించుకుంటారు. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. సహోద్యోగుల నుంచి సహకారం లభిస్తుంది. ఒకరిద్దరు మిత్రులకు సహాయం చేస్తారు. ఆరోగ్యం పరవాలేదు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, ఉద్యోగాల్లో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఉద్యోగ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపో తుంది. అధికారులకు మీ సలహాలు లాభిస్తాయి. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలు కనిపిస్తాయి. ఆర్థిక విషయాల్లో ఎవరికీ మాట ఇవ్వకపోవడం మంచిది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది కానీ ఖర్చులు సిద్ధంగా ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యానికి ఢోకా లేదు. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది.

Follow Us