AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRB Railway Jobs 2026: పదో తరగతి అర్హతతో రైల్వేలో 11,127 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. దరఖాస్తులు ఎప్పట్నుంచంటే?

దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే రీజియన్లలో భారీగా కొలువుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. మొత్తం 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ (ఏఎల్‌పీ) పోస్టులను రైల్వే శాఖ భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు..

RRB Railway Jobs 2026: పదో తరగతి అర్హతతో రైల్వేలో 11,127 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. దరఖాస్తులు ఎప్పట్నుంచంటే?
RRB Railway Assistant Loco Pilot Jobs
Srilakshmi C
|

Updated on: Mar 26, 2026 | 6:37 AM

Share

నిరుద్యోగులకు రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు మరో బంపరాఫర్‌ ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే రీజియన్లలో భారీగా కొలువుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. మొత్తం 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ (ఏఎల్‌పీ) పోస్టులను రైల్వే శాఖ భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తులు మే 15, 2026వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది.

ఆర్‌ఆర్‌బీ అసిస్టెంట్ లోకో పైలట్ (ఏఎల్‌పీ) 2026 ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఈ పోస్టులను సికింద్రాబాద్‌ సహా అహ్మదాబాద్, అజ్‌మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీఘడ్‌, చెన్నై, గోరఖ్‌పూర్, గువాహటి, జమ్ము అండ్‌ శ్రీనగర్, కోల్‌కతా, మాల్దా, ముంబయి, ముజఫర్‌పూర్, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సిలిగురి, తిరువనంతపురం ఆర్‌ఆర్‌బీ రీజియన్లలో భర్తీ చేయనుంది.

ఇవి కూడా చదవండి

ఆర్‌ఆర్‌బీ అసిస్టెంట్ లోకో పైలట్ (ఏఎల్‌పీ) 2026 ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ లేదా డిప్లొమాలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి జులై 1, 2026 నాటికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ అర్హతలు కలిగిన వారు ఎవరైనా ఆన్‌లైన్‌ విధానంలో జూన్‌ 14, 2026వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. సీబీటీ1, సీబీటీ 2 రాత పరీక్షలు, కంప్యూటర్‌ బేస్డ్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి ప్రారంభ వేతనం రూ.19,900 నుంచి మొదలవుతుంది. రీజియన్ల వారీగా ఖాళీలు, పరీక్ష విధానం, సిలబస్, ఎంపిక విధానం, దరఖాస్తు ఫీజు, రాత పరీక్ష తేదీలు వంటి ఇతర వివరాలు త్వరలో విడుదలయ్యే పూర్తి నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఆర్‌ఆర్‌బీ అసిస్టెంట్ లోకో పైలట్ (ఏఎల్‌పీ) 2026 ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us