AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fuel Price: వాహనదారులకు తీపికబురు.. పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం కీలక ప్రకటన!

Petrol, Diesel Prices: పశ్చిమ ఆసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కసారిగా పెరుగుతాయని, నిల్వలు కూడా తగ్గిపోతాయని సోషల్ మీడియాలో పుకార్లు విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. ఈ వార్తలతో భయపడిన ప్రజలు పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరుతున్నారు. అయితే ఇలాంటి వార్తలను నమ్మి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.

Subhash Goud
|

Updated on: Mar 26, 2026 | 7:00 AM

Share
Petrol, Diesel Prices: న్యూఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో ఇంధన నిల్వలు, ధరలు, విదేశాల్లో ఉన్న భారతీయుల భద్రతపై ప్రభుత్వం కీలక వివరాలు వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే ఆలోచన ఏ మాత్రం లేదని స్పష్టం చేసింది. దీని వల్ల వాహనదారులు భయపడాల్సిన అవసరం లేదని కేంద్ర పెట్రోలియం శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ స్పష్టం చేశారు. మన దేశంలో సంవత్సరానికి సరిపడినంత సుమారు 26 కోట్ల టన్నుల ముడి చమురును శుద్ధి చేసే సామర్థ్యం ఉందని అధికారులు వెల్లడించారు. అందువల్ల ఇంధన కొరత ఏర్పడే పరిస్థితి లేదని, పుకార్లను నమ్మి పెట్రోల్ బంకుల వద్ద రద్దీ చేయవద్దని ప్రజలను కోరారు. పెట్రోల్‌, డీజిల్‌లను అవసరానికి మించి స్టోర్‌ చేసుకోవడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని కేంద్రం తెలిపింది.

1 / 5
ఇక ఇదిలా ఉంటే  పైప్‌డ్ నేచురల్ గ్యాస్ (PNG) వినియోగాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇటీవల విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ ద్వారా పీఎన్‌జీ కనెక్షన్ పొందే ప్రక్రియను సులభతరం చేసింది. అతి తక్కువ సమయంలో గ్యాస్ కనెక్షన్ అందేలా చర్యలు తీసుకుంటోంది. అన్ని రాష్ట్రాల్లో ఒకే విధమైన నిబంధనలు అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది.

2 / 5
గత కొన్ని వారాల్లోనే సుమారు రెండున్నర లక్షల మందికి కొత్తగా పీఎన్‌జీ కనెక్షన్లు ఇచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. అలాగే సుమారు 2.2 లక్షల మంది వినియోగదారులు ఎల్‌పీజీ సిలిండర్ల నుండి పైపుల ద్వారా వచ్చే గ్యాస్‌కు మారారు. దీని వల్ల సిలిండర్ బుకింగ్ సమస్యలు తగ్గడంతో పాటు వినియోగదారులకు ఖర్చు కూడా తగ్గుతుంది. భవిష్యత్తులో ప్రతి ఇంటికీ పైపుల ద్వారా గ్యాస్ అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.

3 / 5
మరోవైపు గల్ఫ్ ప్రాంతంలో ఉన్న భారతీయ నావికుల భద్రతపై కూడా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. గత 24 గంటల్లోనే 50 మంది నావికులను సురక్షితంగా దేశానికి తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం గల్ఫ్ సముద్ర ప్రాంతంలో సుమారు 20 భారతీయ నౌకలు పనిచేస్తుండగా, వాటిలో దాదాపు 540 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. వీరంతా క్షేమంగా ఉన్నారని, సంబంధిత అధికారులు వారితో నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తున్నారని వెల్లడించారు.

4 / 5
 పోర్టుల వద్ద కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతున్నాయని, సరుకు రవాణాలో ఎటువంటి అంతరాయం లేదని అధికారులు తెలిపారు. అంతర్జాతీయ వాణిజ్యం సజావుగా సాగేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, దేశానికి వచ్చే ముడి చమురు రవాణా మార్గాలను కూడా కట్టుదిట్టంగా పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. విదేశాంగ శాఖ ప్రతినిధులు తెలిపిన ప్రకారం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ అంశంపై నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. ప్రపంచ దేశాలతో సంప్రదింపులు జరుపుతూ పశ్చిమ ఆసియాలో శాంతి నెలకొనేలా కృషి చేస్తున్నారు. ముఖ్యంగా అంతర్జాతీయ వాణిజ్యానికి కీలకమైన హోర్ముజ్ జలసంధి భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.

5 / 5
Follow Us