AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అతన్ని చిన్నప్పటినుంచి చూస్తున్నా.. పగలు రాత్రి కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు

కబడ్డీ కబడ్డీ, దొంగరాముడు అండ్ పార్టీ, లక్ష్మీ నరసింహా, అందరూ దొంగలే, చెప్పవే చిరుగాలి, లీలామహల్ సెంటర్, వెంకీ, గోపి గోపిక గోదావరి, సరదాగా కాసేపు, మంగతాయారు టిఫన్ సిఎటర్, ఆపరేషన్ దుర్యోధన, దుబాయ్ శీను.. ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి నవ్వించారు కృష్ణ భగవాన్.

అతన్ని చిన్నప్పటినుంచి చూస్తున్నా.. పగలు రాత్రి కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు
Krishna Bhagavan
Rajeev Rayala
|

Updated on: Aug 04, 2026 | 11:31 AM

Share

కృష్ణ భగవాన్.. తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ఆయన సినిమాలో ఉంటే చాలు నవ్వులు పూయాల్సిందే. తనదైన కామెడీ టైమింగ్, డైలాగ్స్ తో ప్రేక్షకులను అలరించాయి. ప్రస్తుతం సినిమాల స్పీడ్ తగ్గించిన కృష్ణభగవాన్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సినీ ప్రస్థానంపై తన మనసులోని మాటలను పంచుకున్నారు. సినీ పరిశ్రమలో చాలా మంది హీరోలు ఉన్నప్పటికీ, అల్లరి నరేష్‌తో తనకు విభిన్నమైన, బలమైన అనుబంధం ఉందని ఆయన స్పష్టం చేశారు. పెద్ద హీరోలతో కేవలం మామూలుగానే మాత్రమే మాటలు  ఉంటాయని, అంతకు మించి వారికి ఫోన్లు చేసుకోవడం వంటి సన్నిహిత సంబంధాలు తనకు లేవని భగవాన్ తెలిపారు.

ఇది కూడా చదివేసేయండి :ఈ పిచ్చి డ్రెస్సులు ఏంటి..? పిచ్చి పాటలు ఏంటి.? అనుకున్నా.. కానీ కృష్ణగారి దెబ్బకు ఆ సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యింది

అయితే, అల్లరి నరేష్ విషయంలో అలాకాదని, దానికి కారణం వారిద్దరి మధ్య చిన్నప్పటి నుంచి ఉన్న పరిచయమేనని వివరించారు. ఈవీవీ సత్యనారాయణ గారు దర్శకత్వం వహించిన సినిమాలలో కృష్ణ భగవాన్, అల్లరి నరేష్ ఇద్దరూ కలిసి పనిచేశారు. ఆ సమయం నుంచే నరేష్‌ను దగ్గరగా చూశానని, అతని ఎదుగుదలను పరిశీలించానని కృష్ణ భగవాన్ చెప్పారు. నరేష్ కేవలం ఈవీవీ సత్యనారాయణ గారి కుమారుడిగా మాత్రమే కాకుండా, తనకంటూ ఒక గుర్తింపును ఏర్పరచుకున్నాడని ప్రశంసించారు.

ఇది కూడా చదివేసేయండి :Anil Ravipudi: ఇండస్ట్రీలో వాడు నా బెస్ట్ ఫ్రెండ్.. అయినా కూడా నా సినిమాల్లో అతను నటించలేదు

అల్లరి నరేష్ సినిమాల పట్ల చూపించే నిబద్ధత, కృషి తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని, అతను “పగలు రాత్రి కష్టపడతాడు” అని అన్నారు. నరేష్‌ను “మంచి హీరో” అని పొగిడిన కృష్ణ భగవాన్, అతను ఎన్నో వరుస విజయాలను అందుకున్నాడని గుర్తు చేశారు. హాస్య చిత్రాలతో పాటు నాంది వంటి సీరియస్ కథాంశాలతో కూడిన చిత్రాలలో కూడా అద్భుతంగా నటించి, తనలోని నటుడిని నిరూపించుకున్నాడని తెలిపారు. నాందిలో నరేష్ నటన ఎంతో ప్రశంసలు అందుకుందని, ఇలాంటి సినిమాలతో అతను తన నటనకు తిరుగులేదని నిరూపించుకున్నాడని భగవాన్ అన్నారు. కామెడీ హీరోగా రాజేంద్ర ప్రసాద్ గారు సృష్టించిన పరంపరను అల్లరి నరేష్ విజయవంతంగా కొనసాగిస్తున్నాడని ఆయన పేర్కొన్నారు. అతని కృషి, అంకితభావం కారణంగానే నరేష్ ఈ స్థాయిలో విజయం సాధించారని కృష్ణ భగవాన్ స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదివేసేయండి : మహేష్ బాబుకు మాత్రమే నేను విలన్‌గా నటిస్తా.. మనసులో మాట బయటపెట్టిన హీరో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us