AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఘోర ప్రమాదం.. కాలిబూడిదైన ట్రావెల్స్ బస్సు.. 10మంది సజీవ దహనం

మార్కాపురం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. రాయవరం సమీపంలో పలకల క్వారీల వద్ద ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు‌ను టిప్పర్‌ ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా చెలరేగిన మంటలతో బస్సు పూర్తిగా దగ్ధం అయింది. ఈ ఘటనలో 10 మంది సజీవదహనం అయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.

Andhra Pradesh: ఘోర ప్రమాదం.. కాలిబూడిదైన ట్రావెల్స్ బస్సు.. 10మంది సజీవ దహనం
Bus Accident In Ap
Balaraju Goud
|

Updated on: Mar 26, 2026 | 7:22 AM

Share

మార్కాపురం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. రాయవరం సమీపంలో పలకల క్వారీల వద్ద ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు‌ను టిప్పర్‌ ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా చెలరేగిన మంటలతో బస్సు పూర్తిగా దగ్ధం అయింది. ఈ ఘటనలో 10 మంది సజీవదహనం అయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో బస్సులో ఎంత మంది ఉన్నారన్న దాని స్పష్టత రావల్సి ఉంది. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించారు. కాగా, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందంటున్నారు పోలీసులు.

హైదరాబాద్ నుంచి పామూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు చీమకుర్తి నుంచి కంకర తీసుకొస్తున్న టిప్పర్ ఎదురెదురుగా బలంగా ఢీకొన్నాయి. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి రెండు వాహనాలు పూర్తి దగ్ధమయ్యాయి. హరికృష్ణ ప్రైవేట్ ట్రావెల్ బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. అందులో 10 మంది కాలిబూడిదయ్యారు. మరో 12 మంది స్వల్పగాయాలతో బయటపడ్డారు. కాగా, దాదాపు 20మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు.

వీడియో ఇక్కడ చూడండి..

ఈ సంఘటనకు సంబంధించి సమాచారం తెలుసుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది హుటాహుటిన చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చే లోపే వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో ఎక్కువ గా కనిగిరి, పామూరు ప్రాంత వాసులుగా ఉన్నట్లు తెలుస్తోంది. సంఘటన స్థలానికి చేరుకున్న స్థానికులు, పోలీసులు గాయపడ్డవారిని, అంబులెన్స్ లో ఎక్కించి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబందించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us