కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం ఆకునూరులో నకిలీ స్వాముల ఆగడాలు కలకలం సృష్టించాయి. స్వామీజీల వేషంలో వచ్చిన నలుగురు, ఒక కుటుంబం నుంచి లక్ష రూపాయలు డిమాండ్ చేశారు. డబ్బు ఇవ్వకుంటే శపిస్తామని బెదిరించారు. భయభ్రాంతులకు గురైన కుటుంబం వద్దనున్న స్వల్ప మొత్తాన్ని వారికి ఇచ్చి పంపింది.