ప్రస్తుత సమాజంలో పెట్రోల్, గ్యాస్ సిలిండర్ల దొంగతనాలు పెరుగుతున్నాయి. వరంగల్ శివనగర్ ప్రాంతంలో రాత్రి వేళల్లో దొంగలు రెచ్చిపోతున్నారు. ఇంటి బయట పార్క్ చేసిన ద్విచక్ర వాహనాల నుండి పెట్రోల్‌ను దొంగలిస్తున్నారు. ఇద్దరు దొంగలు ఒక బైక్ నుండి పెట్రోల్ తీసి, బాటిల్ నిండకపోవడంతో మరో బైక్ నుండి కూడా దొంగలించిన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.