AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు.. 16 మంది మృతి, పలువురు గల్లంతు..!

బంగ్లాదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు పద్మా నదిలో పడిపోవడంతో పదహారు మంది మరణించారు. ఈద్ పండుగ జరుపుకుని ఢాకాకు తిరిగి వస్తుండగా డౌలత్దియా ఫెరీఘాట్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. పలువురు పిల్లలు, మహిళలతో సహా సుమారు 40 మంది ఆ బస్సులో ఉన్నారు. ఈ ప్రమాదం జరిగినప్పటి నుండి చాలా మంది ప్రయాణికులు గల్లంతయ్యారు.

పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు.. 16 మంది మృతి, పలువురు గల్లంతు..!
Bangladesh Bus Accident
Balaraju Goud
|

Updated on: Mar 26, 2026 | 7:40 AM

Share

బంగ్లాదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు పద్మా నదిలో పడిపోవడంతో పదహారు మంది మరణించారు. ఈద్ పండుగ జరుపుకుని ఢాకాకు తిరిగి వస్తుండగా డౌలత్దియా ఫెరీఘాట్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. పలువురు పిల్లలు, మహిళలతో సహా సుమారు 40 మంది ఆ బస్సులో ఉన్నారు. ఈ ప్రమాదం జరిగినప్పటి నుండి చాలా మంది ప్రయాణికులు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసలు సహాయక చర్యలు ప్రారంభించారు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో, ప్రతికూల వాతావరణంలో దాదాపు ఆరు గంటల పాటు తీవ్రంగా శ్రమించిన తర్వాత, క్రేన్ సహాయంతో బస్సును నది నుండి బయటకు తీశారు.

స్థానిక మీడియా కథనాల ప్రకారం, బుధవారం (మార్చి 26) సాయంత్రం 5:15 గంటల ప్రాంతంలో రాజ్‌బారి జిల్లాలోని దౌలత్‌దియా టెర్మినల్ వద్ద ఫెర్రీ ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. ప్రమాణికులతో నిండిన బస్సు అకస్మాత్తుగా అదుపుతప్పి పద్మా నదిలో పడిపోయింది. ఈ ఘటన జరిగిన ప్రదేశంలో తీవ్ర గందగోళం నెలకొంది. బస్సును బయటకు తీయగా, బస్సు లోపల చిక్కుకున్న 14 మృతదేహాలు లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. అంతకుముందే డైవర్ తోపాటు ఇద్దరు మహిళల మృతదేహాలను వెలికితీశారు. కాగా ఇప్పటి వరకు ధృవీకరించిన మృతుల సంఖ్య 16కు చేరింది. పలువురు ఇంకా గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. సైన్యం, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, కోస్ట్ గార్డ్ బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి.

ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, బస్సు ఫెర్రీని సమీపిస్తుండగా, ఒక చిన్న యుటిలిటీ ఫెర్రీ పాంటూన్‌ను ఢీకొట్టింది. ఈ ధాటికి బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో, బస్సు నేరుగా నదిలోకి దూసుకుపోయింది. కొంతమంది ఈదుకుంటూ బయటపడి సురక్షిత ప్రాంతాలకు చేరుకోగా, చాలామంది ప్రయాణికులు బస్సులోనే చిక్కుకుపోయారు. ఇంకా పలువురు గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు కొనసాగుతోంది.

ప్రయాణికులలో చాలామంది ఒకే కుటుంబానికి చెందినవారు ఉన్నట్లు సమాచారం. బస్సు బయట నిలబడిన వారు ప్రాణాలతో బయటపడగా, బస్సులో చిక్కుకున్న వారు మునిగిపోయారు. ఈ ఘటన హృదయ విదారకంగా ఉంది. ఈ ఘటన తీవ్రత దృష్ట్యా, బంగ్లాదేశ్ ప్రధానమంత్రి తారిఖ్ రెహమాన్ వెంటనే అధికారులను సంప్రదించి సమాచారం సేకరించారు. ప్రమాదంపై దర్యాప్తునకు ఆదేశించారు. ప్రధానమంత్రి తారిఖ్ రెహమాన్ ఈ ఘటన పట్ల తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఈ రెండు తప్పులు చేస్తున్నారా..? మీ పీఎఫ్ వడ్డీ ఆగిపోయే ప్రమాదం
ఈ రెండు తప్పులు చేస్తున్నారా..? మీ పీఎఫ్ వడ్డీ ఆగిపోయే ప్రమాదం
అస్సలు డౌట్ రాకుండా ఐఫోన్ కొట్టేసిన యువతి!
అస్సలు డౌట్ రాకుండా ఐఫోన్ కొట్టేసిన యువతి!
'IIT చదివి కలెక్టర్ అవుతానన్నావ్ కదా తల్లీ.. ఒంటరి వాడిని చేశావ్'
'IIT చదివి కలెక్టర్ అవుతానన్నావ్ కదా తల్లీ.. ఒంటరి వాడిని చేశావ్'
హమ్మయ్య ఎట్టకేలకు దిగొచ్చాయి! తగ్గిన కూరగాయల ధరలు..
హమ్మయ్య ఎట్టకేలకు దిగొచ్చాయి! తగ్గిన కూరగాయల ధరలు..
పాములు దేన్ని చూసి ఎక్కువగా భయపడతాయో తెలిస్తే షాకవుతారు..
పాములు దేన్ని చూసి ఎక్కువగా భయపడతాయో తెలిస్తే షాకవుతారు..
తెలంగాణ MBBS, BDS ప్రవేశాలకు NEET కౌన్సెలింగ్ 2026 నోటిఫికేషన్
తెలంగాణ MBBS, BDS ప్రవేశాలకు NEET కౌన్సెలింగ్ 2026 నోటిఫికేషన్
అత్యంత ఖరీదైన ప్లేయర్‌గా ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్
అత్యంత ఖరీదైన ప్లేయర్‌గా ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్
పాత బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేస్తున్నారా..? ఇలా చేస్తే మీకే నష్టం
పాత బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేస్తున్నారా..? ఇలా చేస్తే మీకే నష్టం
బైక్ రేసింగ్‌లో దుమ్మురేపిన టీమిండియా లెజెండరీ క్రికెటర్
బైక్ రేసింగ్‌లో దుమ్మురేపిన టీమిండియా లెజెండరీ క్రికెటర్
పక్కనే ఉన్నవారిని వదిలేసి మిమ్మల్నే దోమలు ఎందుకు కుడతాయో తెలుసా?
పక్కనే ఉన్నవారిని వదిలేసి మిమ్మల్నే దోమలు ఎందుకు కుడతాయో తెలుసా?
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!