AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold: పట్టపగ్గాలు లేకుండా పరిగెడుతున్న బంగారం.. 2020లో ధర ఎంతో మీకు గుర్తుందా..?

బంగారం భయ్యా..నిజంగా బంగారమే. గత రెండేళ్లుగా దాని ఎదుగదలచూసి ప్రపంచమార్కెట్లే బిత్తరపోతున్నాయి. ఆరేంజ్‌లో హై ఎండ్‌మార్క్‌ను సెట్ చేస్తోంది. దాన్ని మించిన రేంజ్‌లో మరే మెటల్ పోటీ పడటంలేదు అనుకుంటున్న టైంలో వెండి తన ప్రతాపం చూపుతోంది. ఇప్పుడు కిలో వెండి లక్ష దాటి లక్షన్నరకు పరుగులు పెడుతోంది. మరెందుకు గోల్డ్ , సిల్వర్‌ ఈరేంజ్‌లో పోటీ పడీ మరీ పెరుగుతున్నాయి. భవిష్యత్‌లో ఏది బెటరో తెలుసుకుందాం.... 

Gold: పట్టపగ్గాలు లేకుండా పరిగెడుతున్న బంగారం.. 2020లో ధర ఎంతో మీకు గుర్తుందా..?
Gold Price: దేశంలో బంగారం ధరలు సెప్టెంబర్ 6 శనివారం ఆల్ టైమ్ గరిష్ఠ రికార్డును చేరుకున్నాయి. 22 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ. లక్ష స్థాయికి చేరుకుంది. అదే సమయంలో 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ. 1.08 లక్షల దాటేసింది
Ram Naramaneni
|

Updated on: Sep 04, 2025 | 8:11 PM

Share

ముందుగా మనం ఈ ఐదేళ్లలో బంగారం రేటు ఎలా పెరుగుతూ వచ్చిందో తెలుసుకుందాం పదండి… దిగువన ఇచ్చినవి యావరేజ్ రేట్లు….

  • 2020లో 10 గ్రాముల బంగారం ధర రూ48,651 కిలో వెండి ధర రూ 63,435
  • 2021లో 10 గ్రాముల బంగారం ధర రూ 48,720 ఉంటే కిలో వెండి ధర రూ 62572
  • 2022లో 10 గ్రాముల బంగారం ధర 52,670 ఉంటే కిలో వెండి 55.100
  • 2023లో63,203 ఉంటే, కిలో వెండి 78,600 రూపాయలు
  • 2024లో 73,893 ఉంటే వెండి 95,700 రూపాయలు
  • 2025లో1లక్షా 4వేల424 రూపాయలు ఉండగా వెండి కిలో1లక్షా17వేలకు చేరింది.

ఈ ఐదేళ్లలో బంగారం వెండి ధరలు పెరుగుదల శాతం చూస్తే.. 2020లో రూ48వేల 651 ఉన్న బంగారం ధర, 2025కు వచ్చేసరికి 1లక్షా 4వేల424 రూపాయలకు పెరిగింది అంటే పెరుగుదల శాతం 114.6.  ఇక వెండి చూస్తే 2020లో 63,435 ఉన్న వెండి 2025 నాటికి లక్షా 17వేలకు చేరింది. అంటే 84.5శాతం పెరిగింది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. వెండి బంగారం కంటే అత్యధిక హైక్‌ను నమోదు చేసింది. ఈ ఒక్క సంవత్సరలోనే వెండి పెరుగుదలశాతం 42.

ఈ రేంజ్‌లో గోల్డ్ , సిల్వర్ పెరగడానికి మూడు ప్రధాన కారణాలున్నాయి. ఒకటి గోల్డ్‌ను కొనేందుకు ప్రజలు ఆసక్తి పెంచుకోవడం, ఒకటైతే కేంద్ర బ్యాంకులు రిజర్వ్‌ నిల్వలను పెంచుకోవడం మరో కారణం. అలాగే దిపావళి, దంతేరాస్ లాంటి పండుగలు రావడంతోనూ బంగారం ధరలు పెరిగాయి. ఇక అమెరికా సుంకాల మోత కూడా బంగారం ధరల పెరుగుదలకు కారణంగా ఉంది. ఎందుకంటే భారత్ దిగుమతులపై ఎక్కువగా ఆధారపడ్డ దేశం. దీంతో మన రూపాయి క్షీణించి డాలర్‌ విలువ పెరగడంతో గోల్డ్ రేట్స్ పెరుగుతున్నాయి. ఒకసారి మనం ఏ ఏసెక్టార్‌లో బంగారం, వెండి ధరలకు డిమాండ్ ఉందో ఇప్పుడు గ్రాఫికల్‌గా చూద్దాం.

భవిష్యత్ పరంగా గోల్డ్ సిల్వర్, ఇన్వెస్ట్‌మెంట్‌లలో ఏది బెటరో చూస్తే.. స్టేబుల్ ఇన్వెస్టర్లకు బెటర్ ఆప్షన్ గోల్డ్ అంటున్నారు నిపుణులు. రిస్క్ టేకర్లకు సిల్వరే బెటర్ గా కనిపిస్తోంది. ఎందుకంటే ఇండస్ట్రియల్ డిమాండ్స్ ఎక్కువగా ఉండడంతో భవిష్యత్‌లో సిల్వర్‌ ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇన్ఫ్లియేషన్ టైమ్‌లో అంటే ఆర్ధిక అనిశ్చిత్తిలోమాత్రం బంగారం వైపు మొగ్గుచూపాలని నిపుణులు సూచిస్తున్నారు.

హై రిటర్న్స్ కావాలంటే తక్కువ టైమ్‌లో సిల్వర్ బెటర్ ఆప్షన్.  ఎందుకంటే రాబోయే రెండేళ్లలో కిలో వెండి 3లక్షలకు వెళ్లే అవకాశం ఉందంటున్నారు ఎక్స్‌పర్ట్స్. లాంగ్-టర్మ్ సేఫ్టీకి బంగారమే బెస్ట్ ఆప్షన్‌గా చూస్తోంది మార్కెట్. షార్ట్-టర్మ్ గెయిన్స్‌కు మాత్రం సిల్వర్ బెటర్ అంటున్నారు నిపుణులు.