AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GST: జీఎస్టీ సంస్కరణలు.. వీటిపై సున్నా ట్యాక్స్.. భారీగా తగ్గనున్న ధరలు..

జీఎస్టీ సంస్కరణలతో కేంద్రం దేశ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. పలు కీలకమైన వస్తువులు, సేవలను జీఎస్టీ నుండి మినహాయించి సామాన్యులకు భారీ ఉరటనిచ్చింది. ఆహార పదార్థాలు, మందులు, విద్యా సామాగ్రి, బీమా, రక్షణ, విమానయాన దిగుమతులు ఈ జాబితాలో ఉన్నాయి.

GST: జీఎస్టీ సంస్కరణలు.. వీటిపై సున్నా ట్యాక్స్.. భారీగా తగ్గనున్న ధరలు..
New GST rates
Krishna S
|

Updated on: Sep 04, 2025 | 7:03 PM

Share

సామాన్యులకు కేంద్ర బిగ్ రిలీఫ్ ఇచ్చింది. ముందే చెప్పినట్లు దీపావళికి ముందే పండగలాంటి శుభవార్తను అందించింది. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో నిత్యావసరాలు సహా ఎన్నో వస్తువులపై జీఎస్టీని తగ్గించారు. కొన్నింటిపై జీఎస్టీని మొత్తం ఎత్తేశారు. ఆహార పదార్థాలు, మందులు, విద్యా సామాగ్రి, బీమా, రక్షణ, విమానయాన దిగుమతులు ఈ జాబితాలో ఉన్నాయి. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

ఆహార పదార్థాలకు ఊరట

అల్ట్రా-హై టెంపరేచర్ పాలు, ప్యాకేజ్ చేసి, లేబుల్ చేసిన చెనా, పనీర్ వంటి వాటికి జీఎస్టీ మినహాయింపు లభించింది. అలాగే చపాతీ, రోటీ, పరాఠా, పరోటా, ఖాఖ్రా, పిజ్జా బ్రెడ్ వంటి అన్ని భారతీయ బ్రెడ్‌లను కూడా 0 పన్ను పరిధిలోకి చేర్చారు.

మందులు, ఆరోగ్య సంరక్షణపై జీఎస్టీ సున్నా

ఆరోగ్య సంరక్షణ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. గతంలో 12శాతం జీఎస్టీ ఉన్న 33 ప్రాణాలను రక్షించే మందులను పన్ను రహితంగా చేశారు. క్యాన్సర్, అరుదైన వ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధులకు వాడే మరో మూడు ప్రత్యేక మందులకు గతంలో ఉన్న 5శాతం జీఎస్టీని కూడా సున్నాకి తగ్గించారు. ఇంకా, ఫ్యామిలీ ఫ్లోటర్, రీఇన్సూరెన్స్ సహా అన్ని వ్యక్తిగత ఆరోగ్య, జీవిత బీమా పాలసీలను 0శాత జీఎస్టీకి తరలించారు. దీంతో అవి సామాన్య ప్రజలకు మరింత అందుబాటులోకి వచ్చాయి.

విద్య, స్టేషనరీ సామాగ్రికి మినహాయింపు

విద్యార్థులకు, పాఠశాలలకు ఆర్థికంగా ఊరట లభించింది. ఎటువంటి కోటింగ్ లేని పేపర్, పేపర్‌బోర్డ్, వ్యాయామ పుస్తకాలు, గ్రాఫ్ పుస్తకాలు, ప్రయోగశాల నోట్‌బుక్‌లు, ఇతర నోట్‌బుక్‌లకు మినహాయింపు ఇచ్చారు. అంతేకాకుండా మ్యాప్‌లు, అట్లాస్‌లు, వాల్ మ్యాప్‌లు, టోపోగ్రాఫికల్ ప్లాన్‌లు, గ్లోబ్‌లు, పెన్సిల్ షార్పనర్‌లు, ఎరేజర్‌లు, పెన్సిళ్లు, డ్రాయింగ్ చార్‌కోల్‌లు, టైలర్స్ చాక్‌లకు కూడా జీఎస్టీ మినహాయింపు ఇచ్చారు. చేతితో తయారు చేసిన కాగితం, పేపర్‌బోర్డ్‌ను కూడా ఈ మినహాయింపు కిందకు చేర్చారు.

రక్షణ, విమానయాన దిగుమతులకు పన్ను రద్దు

జాతీయ భద్రత, విమానయాన రంగంలోనూ జీఎస్టీ మినహాయింపులు లభించాయి. ఫ్లైట్ మోషన్, టార్గెట్ మోషన్ సిమ్యులేటర్లు, క్షిపణులు, రాకెట్లు, డ్రోన్‌లు, మానవరహిత నౌకల భాగాలు, మిలిటరీ విమానాలు, డీప్ సబ్‌మర్జెన్స్ నౌకలు, సోనోబాయ్‌లు, ప్రత్యేకమైన అధిక-పనితీరు గల బ్యాటరీల దిగుమతులపై ఇకపై ఐజీఎస్టీ వర్తించదు.

అంతేకాకుండా డైమండ్ ఇంప్రెస్ట్ ఆథరైజేషన్ కింద మినహాయింపు పొందిన వస్తువులు, 25 సెంట్ల వరకు ఉన్న సహజ వజ్రాలకు సంబంధించిన డాక్యుమెంటేషన్ దిగుమతులు, ప్రదర్శనల కోసం తీసుకువచ్చిన కళాకృతులు, పురాతన వస్తువులను కూడా జీఎస్టీ నుండి మినహాయించారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!