AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Forbes Rich List: జెఫ్ బెజోస్‌ను మళ్లీ వెనక్కి నెట్టిన భారతీయుడు.. ప్రపంచ కుభేరుల జాబితాలో 3 వ స్థానానికి అదానీ..

భారత అపర కుబేరుడు అదానీ, ప్రపంచ కుబేరుల జాబితాలో 3వ స్థానానికి చేరుకున్నారు. ఇప్పటి వరకూ 3వ స్థానంలో ఉన్న అమేజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌ను..

Forbes Rich List: జెఫ్ బెజోస్‌ను మళ్లీ వెనక్కి నెట్టిన భారతీయుడు.. ప్రపంచ కుభేరుల జాబితాలో 3 వ స్థానానికి అదానీ..
Gautam Adani
Shiva Prajapati
|

Updated on: Oct 31, 2022 | 5:30 PM

Share

భారత అపర కుబేరుడు అదానీ, ప్రపంచ కుబేరుల జాబితాలో 3వ స్థానానికి చేరుకున్నారు. ఇప్పటి వరకూ 3వ స్థానంలో ఉన్న అమేజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌ను వెనక్కి నెట్టి మరోసారి 3వ స్థానంలో నిలిచారు. ఫోర్బ్స్ విడుదల చేసిన రియల్ టైమ్ బిలియనీర్ల జాబితాలో ఈ విషయాన్ని ప్రకటించారు. గత రెండు వారాలుగా ఇండియన్ స్టాక్ మార్కెట్లు లాభాల బాటలో పరుగులు తీయడం, అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లాభాలు పెరగడంతో ఇది సాధ్యమయ్యింది. వాల్ స్ట్రీట్ షేర్లను అదానీ కంపెనీ షేర్లు అధిగమించాయి. షేర్స్ లాభాలు భారీగా పెరగడంతో అదానీ గ్రూప్స్ సంపద భారీగా పెరిగింది. ఫలితంగా అదానీ 3వ స్థానానికి చేరుకున్నారు.

సోమవారం నాటి స్టాక్ మార్కెట్ లెక్కల ప్రకారం.. 314 మిలియన్ డాలర్ల సంపద పెరిగి.. 131.3 బిలియన్లకు చేరింది. దాంతో ఫోర్బ్స్ జాబితాలో ప్రపంచంలోనే మూడవ అత్యంత సంపన్నుడిగా నిలిచారు అదానీ. ఇక మొదటి స్థానంలో ఎలన్ మస్క్ 223 బిలియన్ డాలర్ల సంపదతో మొదటి స్థానంలో ఉండగా, రెండవ స్థానంలో బెర్నార్డ్ ఆర్నాల్ట్&ఫ్యామిలీ నిలిచింది. వీరి సంపద మొత్తం 151.1 బిలియన్ డాలర్లు. నాలుగో స్థానంలో ఉన్న జెఫ్ బెజోస్ సంపద 126.9 బిలియన్ల సంపద ఉంది. రెండవ స్థానంలో ఉన్న బెర్నార్డ్ ఆర్నాల్ట్ కు, అదానీ సంపదకు మధ్య వ్యత్యాసం 20 బిలియన్ డాలర్లు మాత్రం. మరికొంత సమయంలోనే అదానీ రెండవ స్థానానికి చేరుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు విశ్లేషకులు.

ఇకపోతే భారతీయ ఈక్విటీ బెంచ్‌మార్కులు సోమవారం పుంజుకున్నాయి. ప్రధాన సెంట్రల్ బ్యాంకుల విధానాలు, చమురు ధరల తగ్గుదలతో షేర్ మార్కెట్ల లాభాలు మూడోవారం కూడా కంటిన్యూ అయ్యాయి. ఇక గత గురువారం అమెజాన్ సేల్స్ పడిపోవడంతో జెఫ్ బెజోస్ సంపద భారీగా తగ్గింది. రిటైరల్ షేర్లు దారుణంగా క్షీణించాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..