AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Blinkit Services: ఇకపై బ్లింక్‌ఇట్‌లో ల్యాప్‌టాప్‌లు కంప్యూటర్లు.. పది నిమిషాల్లోనే మీ ముందుకు

భారతదేశంలో ఇటీవల కాలంలో ఆన్‌లైన్ ఈ-కామర్స్ సైట్స్ ద్వారా సేవలను పొందే వారి సంఖ్య బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో పెరుగుతున్న పోటీను తట్టుకునేందుకు చాలా కంపెనీలు సూపర్ స్పీడ్ డెలివరీ సేవలతో మన ముందుకు వస్తున్నాయి. అయితే ఇటీవల కాలంలో పది నిమిషాల్లో డెలివరీ అంటూ మన ముందుకు వచ్చిన బ్లింక్ ఇట్ ప్లాట్‌ఫామ్‌లో ప్రస్తుతం మరిన్ని నూతన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి.

Blinkit Services: ఇకపై బ్లింక్‌ఇట్‌లో ల్యాప్‌టాప్‌లు కంప్యూటర్లు.. పది నిమిషాల్లోనే మీ ముందుకు
Blinkit
Nikhil
|

Updated on: Jan 12, 2025 | 8:00 AM

Share

పదే నిమిషాల్లో కిరాణా, రోజువారీ నిత్యావసరాలను డెలివరీ చేయడానికి ప్రసిద్ధి చెందిన బ్లింకిట్ ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ విభాగంలోకి ప్రవేశించింది. బ్లింక్ ఇట్ సీఈఓ అల్బిందర్ ధిండ్సా తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో ఈ మేరకు పోస్ట్ పెట్టారు. వినియోగదారులు ఇప్పుడు ల్యాప్‌టాప్‌లు, మానిటర్లు, ప్రింటర్‌లు, మరిన్నింటిని ప్లాట్‌ఫారమ్ ద్వారా నేరుగా ఆర్డర్ చేయవచ్చని వెల్లడించారు, డెలివరీ కేవలం 10 నిమిషాల్లోనే చేస్తామనంటూ స్పష్టం చేశారు. ముఖ్యంగా హెచ్’పీ ల్యాప్‌టాప్‌లు, లెనోవో, జిబ్రానిక్స్, ఎంఎస్ఐ మానిటర్లు, కెనాన్, హెచ్‌పీ ప్రింటర్లు ఆర్డర్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ సర్వీసులు ఢిల్లీ, పూణే, ముంబై, బెంగళూరు, కోల్‌కతా, లక్నో వంటి ప్రముఖ నగరాల్లో అందుబాటులో ఉన్నాయని, త్వరలోనే మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తామని స్పష్టం చేశారు. 

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్‌లతో బ్లింక్ ఇట్ జత కలవడంతో చాలా స్పీడ్‌గా డెలివరీలను పొందవచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం కొన్ని కంపెనీల ఉత్పత్తులే అందుబాటులో ఉన్నా భవిష్యత్‌లో చాలా కంపెనీ బ్లింక్ ఇట్‌తో జత కట్టే అవకాశం ఉందని వివరిస్తున్నారు. ముఖ్యంగా ప్రింటర్ సర్వీసుల్లో ముఖ్యమని కెనాన్, హెచ్‌పీ ప్రింటర్ కాట్రిడ్జ్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. భవిష్యత్తులో ఎప్సాన్ కాట్రిడ్జ్‌లను జోడించే అవకాశం ఉంది. అయితే ఈ డెలివరీలు బ్లింక్ ఇట్‌లో ప్రత్యేక లార్జ్-ఆర్డర్ ఫ్లీట్ ద్వారా నిర్వహిస్తారు. అలాగే బ్లింక్ ఇట్ కంపెనీ తన పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించే ప్రణాళికలను కూడా సూచించింది, త్వరలో మరిన్ని బ్రాండ్‌లు మరియు ఉత్పత్తులను తన కస్టమర్‌లకు తీసుకువస్తుంది. కేవలం 10 నిమిషాల్లో ల్యాప్‌టాప్‌లు, మానిటర్లు, ప్రింటర్‌ల వంటి ఎలక్ట్రానిక్‌లను డెలివరీ చేస్తే ఈ-కామర్స్ రంగంలో ఇదో చరిత్ర అని నిపుణులు చెబుతున్నారు. ఈ మోడల్‌తో, బ్లింకిట్ మధ్యవర్తులను తొలగిస్తుంది. ముఖ్యంగా ఫిజికల్ స్టోర్‌లను సందర్శించే ఇబ్బంది లేకుండా కస్టమర్‌లు పోటీ ధరలకు ఉత్పత్తులను యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది.

బ్లింకిట్ అంబులెన్స్

బ్లింకిట్ గత వారం గురుగ్రామ్‌లో ప్రారంభించి టెన్ మినిట్స్ అంబులెన్స్ సర్వీస్‌ను ప్రారంభించింది . ఆ ప్రాంతంలోని వినియోగదారులు ఇప్పుడు బ్లింక్ యాప్ ద్వారా అత్యవసర పరిస్థితుల కోసం అంబులెన్స్‌లను బుక్ చేసుకోవచ్చు. 10 నిమిషాల్లో వినియోగదారులను చేరుకోవడానికి అంబులెన్స్‌లను పంపుతామని ఆ కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ సర్వీసు పరీక్ష దశలో ఉండగా బ్లింక్ అంబులెన్స్ సర్వీస్ ప్లాట్‌ఫారమ్‌కు గణనీయమైన పురోగతిని సూచిస్తుందని పేర్కొంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లో కీలకమైన సేవలను అందించే లక్ష్యంతో రాబోయే నెలల్లో ఈ కార్యక్రమం ప్రముఖ నగరాల్లో విస్తరించాలని భావిస్తున్నట్లు బ్లింక్ ఇట్ తెలిపింది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి