Gold Loans: బంగారు రుణాలపై ఆకర్షణీయ వడ్డీ రేట్లు.. ఏయే బ్యాంకులో ఎంతంటే?

భారతదేశంలోని ప్రజలకు బంగారంపై మక్కవ ఎక్కువ. అధిక శాతం ప్రజలు బంగారాన్ని పెట్టుబడిగా కాకుండా ఆభరణాలు కిందే కొనుగోలు చేస్తారు. పేద కుటుంబాల నుంచి ఉన్నత కుటుంబాల వరకు ప్రతి కుటుంబంలో వారి స్థాయికు తగినట్లు బంగారం ఉంటుంది. అయితే ఆర్థిక అత్యవసర సమయంలో ఈ బంగారాన్ని కుదువ పెట్టి లోన్లు తెచ్చుకునే వారి సంఖ్య కూడా భారీగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో భారతదేశంలోని ప్రముఖ బ్యాంకులు బంగారంపై ఇచ్చే రుణాల వడ్డీ రేట్ల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

Gold Loans: బంగారు రుణాలపై ఆకర్షణీయ వడ్డీ రేట్లు.. ఏయే బ్యాంకులో ఎంతంటే?
Gold Loan
Follow us
Srinu

|

Updated on: Jan 12, 2025 | 8:30 AM

సాధారణంగా ఆర్థిక అత్యవసర సమయంలో ఎక్కువ మంది పర్సనల్‌ లోన్లు తీసుకుంటూ ఉంటారు. అయితే పర్సనల్‌ లోన్లు అనేవి ఎక్కువగా ఉద్యోగస్తులకే బ్యాంకులు మంజూరు చేస్తాయి. వ్యాపారులతో పాటు సాధారణ ప్రజలకు పర్సనల్‌ లోన్లు ఇవ్వాలంటే చాలా పెద్ద ప్రాసెస్‌ ఉంటుంది. అలాగే రుణగ్రహీత క్రెడిట్‌ స్కోర్‌ ఆధారంగా ఈ రుణాలను మంజూరు చేస్తూ ఉంటారు. పర్సనల్‌ లోన్‌ వడ్డీ రేట్లు అనేవి క్రెడిట్‌ స్కోర్‌ ఆధారంగా ఉంటుంది. తక్కువ క్రెడిట్‌ స్కోర్‌ ఉంటే ఎక్కువ వడ్డీ రేటును బ్యాంకులు వసూలు చేస్తూ ఉంటాయి. అయితే ఇలాంటి సమయంలో బంగారాన్ని బ్యాంకుల వద్ద తాకట్టు పెట్టి బంగారు రుణాన్ని తీసుకుంటే తక్కువ వడ్డీ రేటుకే రుణాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. 

కొత్త ఏడాది చాలా వరకు బ్యాంకులు బంగారు రుణాలపై వడ్డీ రేట్లను సవరించాయి. కొన్ని బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గిస్తే కొన్ని బ్యాంకులు సవరించాయి. ముఖ్యంగా మరో 45 రోజుల్లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశపెట్టే అవకాశం ఉండడంతో చాలా బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గించాయి. ముఖ్యంగా గత ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ ప్రవేశపెట్టే సమయంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ రుణాల విషయంలో బ్యాంకులకు కీలక సూచనలు చేశారు. ఈ నేపథ్యంలో కొత్త ఏడాది తక్కువ వడ్డీకే బ్యాంకులు రుణాలను అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారతదేశంలో ప్రముఖ బ్యాంకుల్లో వడ్డీ రేట్లను గురించి తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి

బంగారు రుణాలపై వడ్డీ రేట్లు ఇలా

  • కర్ణాటక బ్యాంకు 10.68 శాతం నుంచి
  • ఐసీఐసీఐ బ్యాంకు 9.25 -18.00 శాతం
  • బ్యాంక్ ఆఫ్ బరోడా 9.15 శాతం
  • ఫెడరల్ బ్యాంకు 8.99 శాతం
  • సౌత్ ఇండియన్ బ్యాంకు 9.40- 22 శాతం
  • ఇండస్ఇండ్ బ్యాంకు 10.35-17.05 శాతం
  • యూకో బ్యాంకు 9.00-9.20 శాతం
  • యూనియన్ బ్యాంకు 9.95 శాతం  
  • కెనరా బ్యాంకు 9.00 శాతం
  • సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 8.40 శాతం
  • యాక్సిస్ బ్యాంకు 17 శాతం
  • స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 9.00 శాతం
  • కరూర్ వైశ్యా బ్యాంకు 10.65శాతం
  • బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 9.3 0శాతం
  • హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు 10.35 – 17.86 శాతం
  • కోటక్ మహీంద్రా బ్యాంకు 10.56 శాతం

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి