Bajaj Pulsar RS200: పల్సర్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. న్యూ రేంజ్‌తో ఆర్ఎస్ 200 అప్‌డేట్

భారతదేశంలో పల్సర్ బైక్స్‌కు ప్రత్యేక డిమాండ్ ఉంది. యువత నుంచి మధ్య వయస్సున వారి వరకు పల్సర్ బైక్స్‌ను ఇష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా పల్సర్ బైక్ లుక్ అందరినీ ఆకర్షిస్తుంది. అయితే గత కొంత కాలంలో పల్సర్ ఆర్ఎస్ బైక్‌కు ఎలాంటి అప్‌డేట్ రాలేదు. ఈ నేపథ్యంలో తాజా బజాజ్ కంపెనీ ఆర్ఎస్ 200కు అప్‌డేటెడ్ వెర్షన్‌ను రిలీజ్ చేసింది.

Bajaj Pulsar RS200: పల్సర్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. న్యూ రేంజ్‌తో ఆర్ఎస్ 200 అప్‌డేట్
Bajaj Pulsar Rs200
Follow us
Srinu

|

Updated on: Jan 11, 2025 | 4:30 PM

బజాజ్ ఆటో ఎట్టకేలకు అప్‌డేటెడ్ బజాజ్ పల్సర్ ఆర్ఎస్ 200 బైక్‌ను భారత మార్కెట్లో ఇటీవల విడుదల చేసింది. దాదాపు దశాబ్దం తర్వాత ఇదే మొదటి అప్‌డేట్ అని మార్కెట్ రంగ నిపుణులు చెబుతున్నారు. ఈ అప్‌డేటెడ్ ఆర్ఎస్ 200 ధర ఇప్పుడు రూ.1.84 లక్షలకు చేరుకుంది. అంటే గత వెర్షన్‌తో పోలిస్తే రూ.10,000 ఎక్కువ. ఆసక్తి ఉన్న కస్టమర్లు మోటార్ సైకిల్‌ను ఆన్‌లైన్‌లతో బుక్ చేసుకోవచ్చు లేదా వారి సమీప బజాజ్ డీలర్‌ను సంప్రదించి బుక్ చేసుకోవచ్చు. బజాజ్ పల్సఱ్ ఆర్ఎస్ 200 నయా వెర్షన్‌ను డిజైన్ పరంగా పెద్దగా మార్పులు లేవు. ముందువైపు మోటార్ సైకిల్ మునుపటిలానే కనిపిస్తుంది. ఈ బైక్ మూడు డాట్ డీఆర్ఎల్‌లతో కూడిన ట్విన్-పాడ్ ఎల్ఈడీ హెర్లాంప్ సెటప్‌తో ఆకర్షిస్తుంది. ఈ బైక్‌లో సిట్ బ్రాకెట్ ఆకారపు ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ టైలైట్లను కలిగి ఉంది.

బజాజ్ పల్సర్ డిజైన్ పరంగా పాత మోడల్‌ను అనుకరించినా పనితీరు విషయంలో మాత్రం మంచి అప్‌డేట్స్ ఇచ్చింది. బజాజ్ పల్సర్ నలుపు, తెలుపు, ఎరుపు మూడు రంగుల ఎంపికలతో అందిస్తుున్నారు. ఈ మోటార్ సైకిల్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్లను వెనుక వైపున మోనో-షాక్ సెటప్‌తో వస్తుంది. ఈ బైక్ డ్యూయల్-ఛానల్ ఏబీఎస్‌తో రెండు చివర్లలో డిస్క్ బ్రేక్లతో వస్తుంది. అలాగే కలర్ ఎల్‌సీడీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, కొత్త స్విచ్ గేరు యువతను అమితంగా ఆకర్షిస్తుంది.

పల్సర్ ఆర్ఎస్ 200 బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్/నోటిఫికేషన్ అలర్ట్లను పొందవచ్చు. ఈ బైక్‌లో మూడు రైడింగ్ మోడ్లను పొందవచ్చు. పల్సర్ ఆర్ఎస్ 200 9,750 ఆర్‌పీఎం వద్ద 24.5 హెచ్‌పీ శక్తిని, 8,000 ఆర్‌పీఎం వద్ద 18.7ఎన్ఎం, స్లిప్పర్ క్లబ్‌లో 6 స్పీడ్ గేర్బాక్స్ జత చేసేలా లిక్విడ్-కూల్డ్ 199 సీసీ , సింగిల్-సిలిండర్ ఇంజన్‌తో వస్తుంది. భద్రత పరంగా ఈ బైక్ డ్యూయల్-ఛానల్ ఏబీఎస్‌ను అందిస్తుంది.