AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayushman Card: ఉచితంగా ఐదు లక్షల ఆరోగ్య బీమా.. ఆ కేంద్ర ప్రభుత్వ పథకం గురించి తెలుసా..?

ఇటీవల కాలంలో పెరుగుతున్న ఖర్చులు సగటు మధ్యతరగతి ప్రజల జీవితాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా ఏదైనా అనుకోని అనారోగ్యం వస్తే చావే శరణ్యమనే స్థితికి పేదల పరిస్థితి చేరిందంటే అతిశయోక్తి కాదు. అయితే ఇలాంటి సమస్యల నుంచి పేదలను గట్టెక్కించడానికి కేంద్ర ప్రభుత్వం సరికొత్త పథకాన్ని అమలు చేస్తుంది. ఆయుష్మాన్ భారత్ పథకం పేరుతో పిలిచే ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (ఏబీ-పీఎంఏజేవై) భారతదేశంలోని బలహీన జనాభాకు ఆరోగ్య సంరక్షణ యాక్సెస్‌ను విస్తరించడం కొనసాగిస్తోంది.

Ayushman Card: ఉచితంగా ఐదు లక్షల ఆరోగ్య బీమా.. ఆ కేంద్ర ప్రభుత్వ పథకం గురించి తెలుసా..?
Ayushman Bharat
Nikhil
|

Updated on: Sep 23, 2024 | 8:00 AM

Share

ఇటీవల కాలంలో పెరుగుతున్న ఖర్చులు సగటు మధ్యతరగతి ప్రజల జీవితాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా ఏదైనా అనుకోని అనారోగ్యం వస్తే చావే శరణ్యమనే స్థితికి పేదల పరిస్థితి చేరిందంటే అతిశయోక్తి కాదు. అయితే ఇలాంటి సమస్యల నుంచి పేదలను గట్టెక్కించడానికి కేంద్ర ప్రభుత్వం సరికొత్త పథకాన్ని అమలు చేస్తుంది. ఆయుష్మాన్ భారత్ పథకం పేరుతో పిలిచే ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (ఏబీ-పీఎంఏజేవై) భారతదేశంలోని బలహీన జనాభాకు ఆరోగ్య సంరక్షణ యాక్సెస్‌ను విస్తరించడం కొనసాగిస్తోంది. ఆయుష్మాన్ కార్డ్ అర్హత ప్రమాణాలకు ఇటీవలి అప్‌డేట్‌లు ఒక పెద్ద సమూహానికి ఆర్థిక రక్షణను అందించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఒక్కో కుటుంబానికి సంవత్సరానికి రూ.5 లక్షల వరకు వైద్య చికిత్స ఖర్చులు కవర్ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఆయుష్మాన్ భారత్ పథకం గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఆయుష్మాన్ కార్డ్ జారీ చేస్తారు. ఈ కార్డు ద్వారా భారతదేశం అంతటా ఎంప్యానెల్ చేయబడిన ఆసుపత్రులలో అర్హత కలిగిన కుటుంబాలు ఉచిత ఆరోగ్య సేవలను పొందవచ్చు. ప్రతి కుటుంబానికి సంవత్సరానికి గరిష్టంగా రూ.5 లక్షల వరకు కవరేజీ అందిస్తుంది. అందువల్ల పేద, మధ్యతరగతి ప్రజల ఆరోగ్య అవసరాలను తీర్చడంలో ఈ కార్డు కీలక పాత్ర పోషిస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆయుష్మాన్ పరిధిలోకి  వలస కార్మికులను చేర్చింది. వలస కార్మికుల ఆరోగ్య రక్షణకు ఈ ఆయుష్మాన్ భారత్ కార్డులు చాలా బాగా ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే వలస కార్మికులు ప్రస్తుతం ఉన్న నివాసం నుంచి దరఖాస్తు చేసుకుంటే వారికి ఆయుష్మాన్ కార్డు మంజూరు చేస్తారు. అలాగే ఈ కార్డు పొందడానికి ఇంటి పని చేసే వారు, రోజువారీ వేతనదారులు, వీధి వ్యాపారులతో సహా పట్టణ ప్రాంతాల్లోని అనధికారిక రంగ కార్మికులను కూడా అర్హులుగా కేంద్రం గుర్తించింది. అలాగే భూమిలేని కార్మికులు, గ్రామీణ కళాకారులు, ఇతర తక్కువ-ఆదాయ వర్గాలు ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా వైద్య సేవలను పొందవచ్చు. 

ఆయుష్మాన్ భారత్ పథకంలో వితంతువులు లేదా ఒంటరి మహిళలు, అనాథ పిల్లలతో పాటు వృద్ధులు, వికాలంగులు కూడా వైద్య సేవలను పొందవచ్చు. దరఖాస్తుదారులు అధికారిక ఆయుష్మాన్ భారత్ పోర్టల్‌ను సందర్శించి ఆయుష్మాన్ భారత్ కార్డును పొందవచ్చు. ముఖ్యంగా ప్రాథమిక వివరాలను నమోదు చేసి అర్హతను తనిఖీ చేయాలి. దరఖాస్తుదారులు దరఖాస్తు చేసుకోవడానికి ఎంప్యానెల్డ్ హాస్పిటల్స్ లేదా కామన్ సర్వీస్ సెంటర్‌లను సందర్శించాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయడానికి మీకు ఆధార్ కార్డ్ లేదా రేషన్ కార్డ్ వంటి అవసరమైన గుర్తింపు ఉంటే ఆయుష్మాన్ భారత్ కార్డు పొందడం సులభం అవుతుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి