Flipkart: ఆఫర్ల పండగకు సిద్ధమవ్వండి.. బిగ్ బిలియన్ డేస్ ఎప్పటి నుంచంటే..
Flipkart big billion days: ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా బిగ్‌బిలియన్ డేస్‌లో ఊహకందని ఆఫర్లతో కస్టమర్లకు ఆకర్షించేందుకు సిద్ధమైంది. సెప్టెంబర్ 27వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024 ప్రారంభంకానుందని అధికారికంగా ప్రకటించింది. అయితే ఫ్లిప్‌కార్ట్ మెంబర్ సబ్‌స్క్రిప్షన్ ఉన్న వారికి ఒక రోజు ముందుగానే ఈ సేల్ అందుబాటులోకి రానుంది. ప్రొడక్ట్స్‌కు సంబంధించి...
Flipkart big billion days: దసరా పండగ వస్తుందంటే చాలు. అందరి దృష్టి పండగతో పాటు ఈకామర్స్ సైట్స్‌పై కూడా పడుతుంది. ఈ కామర్స్ సంస్థలు పండగ నేపథ్యంలో అందించే సేల్స్ కోసం ఎదురు చూస్తుంటారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తాజాగా బిగ్ బిలియన్ డేస్ సేల్‌కు సంబంధించి ప్రకటన చేసింది.
ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా బిగ్‌బిలియన్ డేస్‌లో ఊహకందని ఆఫర్లతో కస్టమర్లకు ఆకర్షించేందుకు సిద్ధమైంది. సెప్టెంబర్ 27వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024 ప్రారంభంకానుందని అధికారికంగా ప్రకటించింది. అయితే ఫ్లిప్‌కార్ట్ మెంబర్ సబ్‌స్క్రిప్షన్ ఉన్న వారికి ఒక రోజు ముందుగానే ఈ సేల్ అందుబాటులోకి రానుంది. ప్రొడక్ట్స్‌కు సంబంధించి ఎలాంటి ఆఫర్లు అందించనున్న విషయంపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయిన్పటికీ. కొన్ని ఆఫర్లకు సంబంధించి ఫ్లిప్‌కార్ట్ వివరాలను తెలిపింది.
ముఖ్యంగా ఈ సేల్‌లో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు చెందిన కార్డులతో కొనుగోలు చేసే వారికి మంచి ఆఫర్లు అందించనున్నారు. ఈ బ్యాంకుకు చెందిన డెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేసే వారికి డిస్కౌంట్స్ అందించనున్నారు. ఫ్లిప్‌కార్ట్- యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపైనా డిస్కౌంట్ లభిస్తుంది. దీంతోపాటు ఫ్లిప్‌కార్ట్ యూపీఐ చెల్లింపులతో రూ.50 తగ్గింపు, నో-కాస్ట్ ఈఎంఐ వంటి సదుపాయాలు కల్పిస్తున్నట్లు సంస్థ తెలిపింది.
ఇక ప్లిప్‌కార్ట్ పే లేటర్ ద్వారా రూ. లక్ష వరకు వస్తువులను కొనుగోలు చేసుకోవచ్చు. ఈ సేల్‌లో భాగంగా పలు స్మార్ట్‌ఫోన్స్‌పై భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తున్నారు. ఇందులో భాగంగానే.. యాపిల్, శాంసంగ్, వన్‌ప్లస్, షావోమీ వంటి ఫోన్లపై భారీ తగ్గింపు ధరకు లభించనున్నాయి. ఎంత డిస్కౌంట్ లభించనుందన్న వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. వీటితో పాటు స్మార్ట్ వాచ్‌లు, ల్యాప్‌టాప్‌లు, దుస్తులపై కూడా డిస్కౌంట్స్ అందించనున్నారు. కాగా మరో ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ కూడా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ పేరుతో సేల్‌ను నిర్వహించనుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..