Flipkart: అక్టోబర్ 7 నుంచి ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్.. ఈ మొబైల్స్‌పై బంపర్ ఆఫర్..
Flipkart: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ అక్టోబర్ 7 నుంచి ప్రారంభంకానుంది. ఆరు రోజుల పాటు అంటే అక్టోబర్ 12 వరకు ఉంటుంది.
Flipkart: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ అక్టోబర్ 7 నుంచి ప్రారంభంకానుంది. ఆరు రోజుల పాటు అంటే అక్టోబర్ 12 వరకు ఉంటుంది. ఎప్పటిలాగే ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు ముందస్తు యాక్సెస్ ఉంటుంది. బిగ్ బిలియన్ డేస్ సేల్ సమయంలో వినియోగదారులు ICICI బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డులతో పాటు యాక్సిస్ బ్యాంక్ కార్డులపై 10 శాతం తక్షణ డిస్కౌంట్ పొందుతారు. ఫ్లిప్‌కార్ట్ డిజిటల్ వాలెట్ ఉపయోగించి చెల్లించే వినియోగదారుల కోసం Paytm క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను కూడా ప్రకటించింది.
ఫ్లిప్‌కార్ట్ మైక్రోమ్యాక్స్, ఇన్‌ఫినిక్స్, ఒప్పో, వివో మరికొన్ని ఉత్పత్తులపై భారీ ఆఫర్లు ప్రకటించింది. సెప్టెంబర్ 28న రియాలిటీ కొత్త ఫోన్, సెప్టెంబర్ 30 న కొత్త పోకో, వివో లాంచ్ ఉన్నాయి. ఇది కాకుండా అక్టోబర్ 1 మోటరోలా నుంచి కొత్త మొబైల్స్ లాంచ్ అవుతున్నాయి. ఇంకా చాలా ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లలో ఆసుస్ ROG ఫోన్3 ధర రూ.34,999 ఉంది. ఈ ఫోన్ ప్రస్తుత ధర మార్కెట్లో రూ.49,999గా ఉంది.
మోటరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ సాధారణ ధర రూ.22,999 అయితే ఆఫర్‌లో రూ.19,999కి లభిస్తుంది. అదేవిధంగా POCO X3 ప్రో రూ.16,999 కి అందుబాటులో ఉంటుంది. దీని సాధారణ ధర మార్కెట్లో రూ.18,999గా ఉంది. Moto G60 సాధారణ ధర రూ.17,999 పలుకుతుంది. అయితే ఇది ఆఫర్‌లో రూ.15,999 కి అందుబాటులో ఉంటుంది. Moto G40 Fusion ప్రస్తుత ధర రూ.14,499 ఆఫర్‌లో రూ.12,499 కి అందుబాటులో ఉంది.
ఇంకా స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న అన్ని డీల్‌లను ఫ్లిప్‌కార్ట్ వెల్లడించలేదు. ఆన్‌లైన్ రిటైలర్ పిక్సెల్ 4 ఎ, ఐఫోన్ మోడళ్లపై డిస్కౌంట్లను ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్ ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌ను కూడా వెల్లడించింది. ఇక్కడ పాత వర్కింగ్ స్మార్ట్‌ఫోన్‌లను మార్చుకోవడంపై కస్టమర్‌లు కనీసం రూ.2,000 తగ్గింపు పొందవచ్చు. ఇంకా వినియోగదారులకు మొబైల్ ప్రొటెక్షన్ ప్లాన్ కూడా అందిస్తుంది.