AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FD Interest Rates: పెట్టుబడిదారులకు పండుగలాంటి వార్త ఆ బ్యాంకుల్లో ఎఫ్‌డీలపై ఏకంగా 8 శాతం వడ్డీ..

గత కొన్ని నెలలుగా ఆర్‌బీఐ తీసుకున్న చర్యల కారణంగా ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లు గణనీయంగా పెరిగాయి. కొన్ని బ్యాంకులు సీనియర్ సిటిజన్లు ఇప్పుడు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 8.5 శాతం వరకూ వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఫిక్స్డ్‌ డిపాజిట్లు లాంగ్ టర్మ్ డిపాజిట్ చేస్తే ఎక్కువ వడ్డీ రేటు వస్తుందని అందరకూ అనుకుంటారు. కానీ ప్రస్తుతం షార్ట్ టర్మ్ ఫిక్స్డ్‌ డిపాజిట్లకు కూడా గణనీయమైన వడ్డీ వస్తుంది.

FD Interest Rates: పెట్టుబడిదారులకు పండుగలాంటి వార్త ఆ బ్యాంకుల్లో ఎఫ్‌డీలపై ఏకంగా 8 శాతం వడ్డీ..
Fixed Deposit
Nikhil
|

Updated on: Apr 15, 2023 | 5:30 PM

Share

కష్టపడి సంపాదించిన సొమ్మును నమ్మకమైన రాబడి కోసం వివిధ పథకాల్లో పెట్టుబడి పెడుతూ ఉంటాం. సీనియర్ సిటిజన్లు అయితే రిటైరయ్యాక వచ్చిన సొమ్మును ఎక్కువగా ఎఫ్‌డీల్లో పెట్టుబడి పెడతారు. వారిని ఆకట్టుకోవడానికి బ్యాంకులు కూడా సాధారణ ప్రజల కంటే ఎక్కువ వడ్డీ సీనియర్ సిటిజన్లకు అందిస్తాయి. గత కొన్ని నెలలుగా ఆర్‌బీఐ తీసుకున్న చర్యల కారణంగా ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లు గణనీయంగా పెరిగాయి. కొన్ని బ్యాంకులు సీనియర్ సిటిజన్లు ఇప్పుడు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 8.5 శాతం వరకూ వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఫిక్స్డ్‌ డిపాజిట్లు లాంగ్ టర్మ్ డిపాజిట్ చేస్తే ఎక్కువ వడ్డీ రేటు వస్తుందని అందరకూ అనుకుంటారు. కానీ ప్రస్తుతం షార్ట్ టర్మ్ ఫిక్స్డ్‌ డిపాజిట్లకు కూడా గణనీయమైన వడ్డీ వస్తుంది. సీనియర్ సిటిజన్లు ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టాలని చూస్తున్నట్లయితే, షార్ట్ టర్మ్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై (మూడేళ్ల వరకు) 8 శాతం కంటే ఎక్కువ వడ్డీని అందించే ఆరు బ్యాంకులు ఇక్కడ ఉన్నాయి. ఈ బ్యాంకుల్లో పెట్టుబడి పెడితే మంచి నమ్మకమైన రాబడి ఉంటుందని మార్కెట్ వర్గాలు చెబతున్నాయి. నిపుణులు సూచించే ఆ ఆరు బ్యాంకులు ఏంటో ఓ సారి తెలుసుకుందాం.

డీసీబీ బ్యాంక్

డీసీబీ బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు రూ. 2 కోట్ల కంటే తక్కువ మొత్తాలకు 15 నెలల నుంచి 24 నెలల మధ్య మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 8.50 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ఈ రేట్లు మార్చి 10, 2023 నుండి అమలులోకి వచ్చాయి.

ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్

ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ ఒక రోజు నుంచి 3 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డీలపై 8.25 శాతం అత్యధిక వడ్డీ రేటు అందిస్తుంది. అయితే ఈ వడ్డీ రేటు రూ.2 కోట్ల లోపు డిపాజిట్ చేసిన దేశపౌరులకు మాత్రమే వర్తిస్తుంది. 

ఇవి కూడా చదవండి

ఇండస్ ఇండ్ బ్యాంక్

ఇండస్‌ఇండ్ బ్యాంక్ సీనియర్ సిటిజన్‌లకు 6 నెలల నుంచి ఒక సంవత్సరం,  ఆరు నెలల నుంచి రెండు సంవత్సరాల తొమ్మిది నెలల మధ్య మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డీల 8.25 శాతం అత్యధిక వడ్డీ రేటు అందిస్తుంది. పెంచిన వడ్డీ రేట్లు మార్చి 22, 2023 నుంచి అమలులోకి వచ్చాయి.

యాక్సిస్ బ్యాంక్

యాక్సిస్ బ్యాంక్ రెండు సంవత్సరాల నుంచి 30 నెలల లోపు మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు అత్యధికంగా 8.01 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ఈ రేట్లు ఏప్రిల్ 4, 2023 నుంచి అమలులోకి వచ్చాయి. 600 రోజుల్లో మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డీలపై నూతన వడ్డీ రేట్లు ఫిబ్రవరి 6, 2023 నుంచి అమల్లోకి వచ్చాయి.

బందన్

బంధన్ బ్యాంక్ సీనియర్ సిటిజన్లను 600 రోజుల ఎఫ్‌డీలపై అత్యధికంగా 8.50 శాతం ఉత్తమ వడ్డీ రేటును అందిస్తుంది. 

ఆర్‌బీఎల్ బ్యాంక్

ఆర్‌బీఎల్ బ్యాంక్ ఒక రోజు నుంచి 15 నెలల ఎఫ్‌డీలు, 725 రోజుల కంటే తక్కువ కాల వ్యవధిలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అత్యధికంగా 8.30 శాతం వడ్డీ రేటును అందిస్తాయి. ఈ పెరిగిన ఎఫ్‌డీ రేట్లు ఫిబ్రవరి 1, 2023 నుంచి అమల్లోకి వచ్చాయి. 

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం