FD Interest Hikes: ఆ రెండు బ్యాంక్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఎఫ్‌డీలపై ఏకంగా 8.05 శాతం వడ్డీ ఆఫర్..
ముఖ్యంగా ఓ రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 8.05 శాతం వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ సమయంలో ఎలా ఉంటాయో? తెలియదు. అందువల్ల దీర్ఘకాలిక డిపాజిట్లలో పెట్టుబడి పెట్టాలని పెట్టుబడిదారులను మార్కెట్ వర్గాలు సూచిస్తున్నాయి.

గత కొన్ని త్రైమాసికాలుగా అన్ని బ్యాంకులు ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను బాగా పెంచుతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత వారం రెపో రేట్ల పెంపును యథాతథంగా ఉంచింది. దీంతో పలు ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకులు వడ్డీ రేట్లను మళ్లీ పెంచాయి. ముఖ్యంగా ఓ రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 8.05 శాతం వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ సమయంలో ఎలా ఉంటాయో? తెలియదు. అందువల్ల దీర్ఘకాలిక డిపాజిట్లలో పెట్టుబడి పెట్టాలని పెట్టుబడిదారులను మార్కెట్ వర్గాలు సూచిస్తున్నాయి. కాబట్టి 8.05 శాతం వడ్డీని అందిచే ఆ ప్రభుత్వ రంగ బ్యాంకులు ఏంటో ఓ సారి తెలుసుకుందాం.
పంజాబ్ నేషనల్ బ్యాంక్
పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ హోల్డర్‌లకు 666 రోజుల డిపాజిట్‌పై సూపర్ సీనియర్ సిటిజన్‌లకు 8.05% వడ్డీ రేటును అందిస్తుంది. సీనియర్ సిటిజన్లు 7.75% వడ్డీ రేట్లను అందిస్తుంది. సాధారణ డిపాజిట్‌దారులకు 7.25 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. 666 రోజుల డిపాజిట్ సూపర్ సీనియర్ సిటిజన్లకు ఆకర్షణీయంగా ఉన్నా సాధారణ డిపాజిట్‌దారులకు మాత్రం ఈ వడ్డీ రేటు పెద్దగా ఆకర్షణీయంగా లేదు.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3 సంవత్సరాల డిపాజిట్లపై సూపర్ సీనియర్ సిటిజన్లకు 8.05 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. సీనియర్ సిటిజన్లు ఈ డిపాజిట్లపై 7.80 శాతం వడ్డీ రేటును పొందుతారు, సాధారణ డిపాజిటర్లు 7.30 శాతం వడ్డీ రేటును పొందుతారు. అయితే సాధారణ డిపాజిట్‌దారులకు మాత్రం ఎలాంటి పెంపును బ్యాంకు ప్రకటించలేదు. వారికి సాధారణ వడ్డీ రేట్ మాత్రమే అందుతుంది.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం