FD Interest Rates: ఖాతాదారులకు ఆ బ్యాంక్ గుడ్ న్యూస్.. అమల్లోకి సవరించిన వడ్డీ రేట్లు
తాజాగా ప్రైవేట్‌రంగ బ్యాంకు అయిన కర్ణాటక బ్యాంక్ రూ.2 కోట్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. బ్యాంక్ ప్రస్తుతం 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు ఉన్న డిపాజిట్లపై వివిధ రకాల వడ్డీ రేట్లను అందిస్తోంది.

సాధారణంగా కష్టపడి సంపాదించిన సొమ్మును నమ్మకమైన రాబడి కోసం ఫిక్స్డ్ డిపాజిట్లల్లో పెట్టుబడి పెడుతూ ఉంటారు. ముఖ్యంగా రిటైరైన వారు తాము జీవితాంతం కష్టపడితే వచ్చిన రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను కూడా ఎఫ్‌డీల్లో పెట్టుబడి పెట్టడానికి మక్కువ చూపిస్తారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కూడా సీనియర్ సిటిజన్లకు ఎక్కువ వడ్డీని ఆఫర్ చేస్తాయి. ప్రస్తుతం ఆర్‌బీఐ తీసుకున్న చర్యలతో అన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు వడ్డీ రేట్లను పెంచాయి. ముఖ్యంగా కొత్త ఆర్థిక సంవత్సరంలో సవరించిన వడ్డీ రేట్లను కూడా అమల్లోకి తీసుకువస్తున్నాయి. తాజాగా ప్రైవేట్‌రంగ బ్యాంకు అయిన కర్ణాటక బ్యాంక్ రూ.2 కోట్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. బ్యాంక్ ప్రస్తుతం 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు ఉన్న డిపాజిట్లపై వివిధ రకాల వడ్డీ రేట్లను అందిస్తోంది. సవరించిన వడ్డీ రేట్లు ఏప్రిల్ 10 నుంచి అమల్లోకి వస్తాయని బ్యాంక్ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.
కర్ణాటక బ్యాంక్ ప్రస్తుతం 7 రోజుల నుంచి 90 రోజుల వరకు మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 4.50 శాతం వడ్డీ రేటును ఇస్తుంది. అలాగే 91 రోజుల నుంచి 364 రోజులలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 5.25 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. సీనియర్ సిటిజన్లకు అయితే తమ డిపాజిట్లపై 0.40 శాతం అదనపు వడ్డీ రేటును కూడా అందిస్తుంది. అంటే 7-90 రోజులలో మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డీలపై 4.90 శాతం వడ్డీ రేటును, 91 నుంచి 364 రోజులలో మెచ్యూర్ అయ్యే వాటిపై 5.65 శాతం వడ్డీ రేటును అందుకుంటారు. కర్ణాటక బ్యాంక్ ప్రత్యేక ఎఫ్‌డీ పథకమైన కేబీఎల్ సెంటినరీ డిపాజిట్ 375 రోజుల కాలవ్యవధికి ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7.30 శాతం వడ్డీని అందిస్తుంది. ఈ పథకంలో సీనియర్ సిటిజన్లు 7.70 శాతం వడ్డీ రేటును అందుకుంటారు. అయితే అదనపు వడ్డీ రేటు కేవలం దేశీయంగా ఉండే సీనియర్ సిటిజన్లకు మాత్రమే వర్తిస్తుంది. అయితే 2019లో రూ. 5 కోట్ల కంటే ఎక్కువ టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్ ప్రయోజనాన్ని బ్యాంకు రద్దు చేసింది. అయితే తాజాగా ప్రయోజనాన్ని మళ్లీ అందుబాటులోకి తీసుకువచ్చింది.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం