AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smartphones under 9000: అదిరిపోయే ఫీచర్లతో బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్లు ఇవే.. వాళ్లే అసలు టార్గెట్

స్మార్ట్ ఫోన్లు ప్రస్తుతం కాస్త ఖరీదుగా మారాయి. దీంతో మధ్యతరగతి వాళ్లను టార్గెట్ చేస్తూ కంపెనీలన్నీ సరికొత్తగా స్మార్ట్ ఫోన్లను రిలీజ్ చేస్తున్నాయి. అయితే ధర మధ్యతరగతి వాళ్లకు అందుబాటులో ఉండడంతో పాటు ఫీచర్ల విషయంలో మాత్రం ఎలాంటి తగ్గింపులు లేకుండా వినియోగదారులకు అందుబాటులో ఉంటున్నాయి.

Smartphones under 9000: అదిరిపోయే ఫీచర్లతో బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్లు ఇవే.. వాళ్లే అసలు టార్గెట్
Nikhil
|

Updated on: Apr 13, 2023 | 4:00 PM

Share

భారత్‌లో ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ వినియోగం గణనీయంగా పెరిగింది. కేవలం మాట్లాడుకోడానికి, మెసేజ్‌లు చేసుకోడానికి మాత్రమే ఉపయోగించే ఫోన్లు ప్రస్తుతం అన్ని అవసరాలకు తప్పనిసరిగా మారింది. అయితే స్మార్ట్ ఫోన్లు ప్రస్తుతం కాస్త ఖరీదుగా మారాయి. దీంతో మధ్యతరగతి వాళ్లను టార్గెట్ చేస్తూ కంపెనీలన్నీ సరికొత్తగా స్మార్ట్ ఫోన్లను రిలీజ్ చేస్తున్నాయి. అయితే ధర మధ్యతరగతి వాళ్లకు అందుబాటులో ఉండడంతో పాటు ఫీచర్ల విషయంలో మాత్రం ఎలాంటి తగ్గింపులు లేకుండా వినియోగదారులకు అందుబాటులో ఉంటున్నాయి. సామ్‌సంగ్, నోకియా, రియల్ మీ వంటి కంపెనీలు బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్లను అందిస్తున్నాయ. సామ్‌సంగ్ ఎం04, వివో వై02, టెక్నో స్పార్క్ 9, రియల్ మీ నార్జో 50 ఐ, రెడ్ మీ 10 ఏ వంటి ఫోన్లు మధ్యతరగతి వాళ్లను ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. వీటిల్లో 4 జీబీ+64 జీబీ వేరియంట్లు ఉన్నాయి. అలాగే ఈ ఫోన్లపై ఉన్న ఇతర ఆఫర్లు, ఫీచర్లు ఓ లుక్కేద్దాం.

రెడ్ మీ 10 ఏ

ఈ ఫోన్ రూ.9000 కంటే తక్కువ ధరలోని అందుబాటులో ఉంటుంది. హీలియో జీ 25 అక్టాకోర్ ప్రాసెసర్ ఈ ఫోన్ ప్రత్యేకత. అలాగే 4 జీబీ+64 జీబీ కాన్ఫిగరేషన్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఈ ఫోన్ అందరినీ ఆకట్టుకుంటుంది. బ్యాక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, వెనుక వైపు 13 ఎంపీ కెమెరా, ముందు 5 ఎంపీ సెల్ఫీ కెమెరాతో 6.53 అంగుళాల డిస్‌ప్లేతో ఈ ఫోన్ అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ ఫోన్ రూ.8599కు అందుబాటులో ఉంది. 

రియల్ మీ నార్జో 50 ఐ

ఈ స్మార్ట్ ఫోన్ 4 జీబీ+64 జీబీ వేరియంట్‌లో 6.5 అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్ ప్లేతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఆక్టాకోర్ ప్రాసెసర్‌తో 8 ఎంపీ ప్రైమరీ కెమెరా, 5 ఎంపీ సెల్ఫీ కెమెరాతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్ అమెజాన్‌లో రూ.8999కు అందుబాటులో ఉంది. వీటితో బ్యాంకు కార్డు ఆఫర్లు వినియోగించి కొనుగోలు చేస్తే మరింత తక్కువ ధరకు వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది.

ఇవి కూడా చదవండి

వివో వై 02

బడ్జెట్ ఫ్రెండ్లీ వినియోగదారులను ఆకట్టుకోడానికి వివో కంపెనీ వై 02 పేరుతో ఫోన్ రిలీజ్ చేసింది. ఈ ఫోన్ అమెజాన్‌లో రూ.8999కు అందుబాటులో ఉంది. అలాగే ఈ ఫోన్ 6.51 అంగుళాల డిస్‌ప్లేతో 8 ఎంపీ ప్రైమరీ కెమెరా, 5 ఎంపీ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. 3 జీబీ + 32 జీబీ వేరింట్‌తో వస్తున్న ఈ ఫోన్‌లో 10 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. 

టెక్నో స్పార్క్ 9

టెక్నో స్పార్క్ 9 కూడా బడ్జెట్ శ్రేణిలో మెరుగైన స్మార్ట్‌ఫోన్. ఈ ఫోన్ 6జీబీ+128 జీబీ వేరియంట్‌లో అందుబాటులో ఉంటుంది. అలాగే ఈ ఫోన్ కేవలం రూ.8,999కి కొనుగోలు చేయవచ్చు. 6.6 అంగుళాల హెచ్‌డీ ప్లస్ స్క్రీన్, డీటీఎస్ స్పీకర్, హీలియో జీ 37 ప్రాసెసర్‌తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఆకర్షణీయంగా ఉంటుంది. 

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

తెలంగాణలోని మందుబాబులకు బ్యాడ్‌న్యూస్.. ధరలు పెరగనున్నాయా..?
తెలంగాణలోని మందుబాబులకు బ్యాడ్‌న్యూస్.. ధరలు పెరగనున్నాయా..?
ఓటీటీలో సంచలనం సృష్టించిన వెబ్ సిరీస్.. దేశవ్యాప్తంగా ట్రెండింగ్.
ఓటీటీలో సంచలనం సృష్టించిన వెబ్ సిరీస్.. దేశవ్యాప్తంగా ట్రెండింగ్.
తాబేలు ఉంగరం మీ అదృష్టాన్ని మార్చేస్తుంది.. కానీ ఈ రాశులకు కాదు
తాబేలు ఉంగరం మీ అదృష్టాన్ని మార్చేస్తుంది.. కానీ ఈ రాశులకు కాదు
'ధురంధర్ 2'లో మరో స్టార్ హీరో.. ఆదిత్య ధర్ ప్లాన్ మామూలుగా లేదుగా
'ధురంధర్ 2'లో మరో స్టార్ హీరో.. ఆదిత్య ధర్ ప్లాన్ మామూలుగా లేదుగా
సముద్రపు లోతుల్లోకి "ISRO' ప్రయాణం
సముద్రపు లోతుల్లోకి
అసలు మీరు ఐఏఎస్ కు ఎలా సెలక్టయ్యారు ?? విద్యార్థి ప్రశ్న
అసలు మీరు ఐఏఎస్ కు ఎలా సెలక్టయ్యారు ?? విద్యార్థి ప్రశ్న
పురుషుని కడుపులో గర్భాశయం.. రిపోర్టు చూసి అవాక్కైన వ్యక్తి
పురుషుని కడుపులో గర్భాశయం.. రిపోర్టు చూసి అవాక్కైన వ్యక్తి
ఇంటి నుంచే డ్రైవింగ్ లైసెన్స్‌లో అడ్రెస్ ఎలా మార్చుకోవాలో తెలుసా?
ఇంటి నుంచే డ్రైవింగ్ లైసెన్స్‌లో అడ్రెస్ ఎలా మార్చుకోవాలో తెలుసా?
పండ్లు Vs జ్యూస్.. ఆరోగ్యానికి ఏది మంచిది..? మీరు ఊహించినది..
పండ్లు Vs జ్యూస్.. ఆరోగ్యానికి ఏది మంచిది..? మీరు ఊహించినది..
ఏపీ మీదుగా మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. రూట్ వివరాలు ఇవిగో
ఏపీ మీదుగా మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. రూట్ వివరాలు ఇవిగో