Selfie Camera Phones: హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న టాప్ సెల్ఫీ కెమెరా ఫోన్లు ఇవే.. బ్యూటీ మోడ్‌తో అద్భుతాలు..
నేటి ఆధునిక ప్రపంచంలో సెల్ఫీలు మనిషి జీవితంలో ఒక భాగమైపోయాయి. ఈ క్రమంలో బ్యూటీ మోడ్ లతో కూడిన స్మార్ట్ ఫోన్లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న టాప్ సెల్ఫీ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లను చూద్దాం రండి..
మార్కెట్లో బెస్ట్ ఫోన్ ఏది అని ప్రశ్నిస్తే టక్కున చెప్పడం చాలా కష్టం. ఒక్కో ఫోన్ ఒక్కో విధంగా స్పెషల్ ఫీచర్స్ తో ఉంటాయి. అది వినియోగదారుల అభిరుచిని బట్టి మారతుంటుంది. ఒకరికి మంచి పనితీరు కలిగిన ఫోన్ నచ్చుతుంది. మరొకరికి మంచి కెమెరా క్వాలిటీ కావాలి. ర్యామ్, స్టోరేజీ సైజ్లు ఇలా ఎవరి ఇష్టాన్ని బట్టి వారు కొనుగోలు చేస్తుంటారు. అయితే మీరు ఒక వేళ మంచి సెల్ఫీ కెమెరా ఫోన్ కోసం చూస్తుంటే ఈ కథనం మీ కోసమే. నేటి ఆధునిక ప్రపంచంలో సెల్ఫీలు మనిషి జీవితంలో ఒక భాగమైపోయాయి. స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో ఉత్తమ క్షణాలను క్యాప్చర్ చేయడం లేదా సోషల్ మీడియాలో షేర్ చేయడానికి మంచి కెమెరా క్వాలిటీ కలిగిన ఫోన్ కవాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా సెల్పీ ట్రెండ్ పెరగడంతో బ్యూటీ మోడ్ లతో కూడిన స్మార్ట్ ఫోన్లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఈ క్రమంలో బ్యూటీ మోడ్ కలిగిన బెస్ట్ సెల్ఫీ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లను చూద్దాం రండి..
వివో వీ20 (Vivo V20 ).. ఇది ఆకట్టుకునే కెమెరా సెటప్, హై-ఎండ్ స్పెసిఫికేషన్‌లతో కూడిన ప్రీమియం-క్వాలిటీ ఫోన్. దీనిలో వెనుకవైపు 64ఎంపీ+8ఎంపీ+2ఎంపీ కెమెరా సెటప్ ఉంటుంది. మోషన్ ఆటోఫోకస్, ఐ ఆటోఫోకస్, బాడీ/ఆబ్జెక్ట్ ఆటోఫోకస్ వంటి వివిధ ఆప్షన్‌లనున కలిగి ఉంది, ఇది యాక్షన్ షాట్‌లు, పోర్ట్రెయిట్‌లను తీయడానికి మంచి ఎంపిక. దీనిలో సూపర్ నైట్ మోడ్, సూపర్ వైడ్ యాంగిల్ నైట్ మోడ్, ట్రైపాడ్ నైట్ మోడ్, అల్ట్రా-స్టేబుల్ వీడియో, ఆర్ట్ పోర్ట్రెయిట్ వీడియో, సూపర్ మాక్రో, బోకె పోర్ట్రెయిట్, మల్టీ-స్టైల్ పోర్ట్రెయిట్ ఫీచర్‌లను కలిగి ఉంటుంది. 8జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.
ఇన్ఫినిక్స్ హాట్ 12 ప్రో(Infinix Hot 12 Pro).. ఈ స్మార్ట్ ఫోన్ వినియోగదారునికి మెరుగైన అనుభూతినిస్తుంది. ఇది 8జీబీ ర్యామ్ మరియు 128 జీబీ స్టోరేజ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. 256 జీబీ ఎక్స్ ప్యాండ్ చేసుకోవచ్చు. దీనిలో 50 ఎంపీ + డెప్త్ లెన్స్ తో కూడిన ప్రైమరీ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంది. ఇది అధిక-నాణ్యతతో ఫోటోలు, సెల్ఫీలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. స్పెసిఫికేషన్‌లు:
వివో వై19 (Vivo Y19) .. ఈ ఫోన్ అనేక రకాల ఆకట్టుకునే ఫీచర్లను కలిగి ఉంది. ఇది 16+8+2ఎంపీ AI ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. 16ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా ఉంది, ఇది అధిక-నాణ్యత సెల్ఫీలు తీసుకోవడానికి, వీడియో కాల్‌లు చేయడానికి మంచి ఎంపిక. స్మార్ట్‌ఫోన్‌లో 6.53 అంగుళాల ఫుల్ హెచ్ డీ డిస్‌ప్లే ఉంది, 1080 x 2340 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో మల్టీ-టచ్ కెపాసిటివ్ టచ్‌స్క్రీన్. దీని ద్వారా చిత్రాలు, వీడియోలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ సామర్థ్యం ఉంటుంది.
లావా అగ్ని 5జీ (Lava Agni 5G).. ఈ ఫోన్ ఆకట్టుకునే ఫీచర్లతో కూడిన మొట్టమొదటి భారతీయ 5G స్మార్ట్‌ఫోన్. ఇది మీడియా టెక్ డైమెన్సిటీ 810 5జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యంతో వస్తోంది. లావా అగ్ని 5G ఫోన్ ప్రత్యేకత ఎంటంటే ఆండ్రాయిడ్ 12.0కి అప్‌గ్రేడ్ అవుతుంది, దీని వలన వినియోగదారులు అదనంగా 3జీబీ వర్చువల్ ర్యామ్ ని పొందగలుగుతారు.
వీవో వీ11(Vivo V11).. దీనిలో 16ఎంపీ+5ఎంపీ ప్రైమరీ డ్యూయల్ కెమెరాతో వస్తుంది, ఇది పీపీటీ, ప్రొఫెషనల్, స్లో, టైమ్-లాప్స్ ఫొటోగ్రఫీ, కెమెరా ఫిల్టర్, లైవ్, బోకె, AI బ్యాక్‌లైట్ HDR, AI ఫేస్ బ్యూటీ, పనోరమా, పామ్ క్యాప్చర్ వంటి అనేక రకాల ఫొటోగ్రఫీ మోడ్‌లను కలిగి ఉంది. అదనంగా 25ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంది. ఇది అధిక-నాణ్యతతో సెల్ఫీలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. 6 జీజీ ర్యామ్ , 64 జీబీ ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. మీడియాటెక్ సీ60 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.
వివో ఎస్1 (Vivo S1).. ఈ ఫోన్ 16+8+2ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఇది వినియోగదారులు స్పష్టతతో కూడిన అద్భుతమైన ఫోటోలను తీయడానికి అనుమతిస్తుంది. అదనంగా, పరికరం 32ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంది, ఇది హై-క్వాలిటీ సెల్ఫీలు తీసుకోవడానికి మంచి ఎంపిక. స్మార్ట్‌ఫోన్ 1080 x 2340 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.38 అంగుళాల మల్టీ-టచ్ కెపాసిటివ్ టచ్‌స్క్రీన్‌ను కలిగి ఉంది.
రియల్ మీ నార్జో 50ఏ(Realme Narzo 50A).. ఇది వినియోగదారులకు మెరుగైన అనుభవాన్ని అందించే బెస్ట్ ఫీచర్లతో నిండిన మధ్య-శ్రేణి స్మార్ట్‌ఫోన్. మీడియా టెక్ హీలియో జీ85 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 4 జీబీ ర్యామ్ 128 జీబీ మెమరీ ఉంటుంది.
టెక్నోపోవా2(Tech POVA 2).. ఈ ఫోన్ లో లో 7000mAh సామర్థ్యంతో కూడిన సూపర్ బిగ్ బ్యాటరీ ఉంటుంది. ఇది అద్భుతమైన 46 రోజుల సుదీర్ఘ స్టాండ్‌బై సమయాన్ని అందిస్తుంది. 48ఎంపీ+2ఎంపీ+2ఎంపీ+AI లెన్స్ క్వాడ్ రియర్ కెమెరాను కలిగి ఉంది. దీనిలో సూపర్ నైట్ వ్యూ ఫీచర్‌తో వస్తుంది. వినియోగదారులు మసకబారిన వాతావరణంలో కూడా స్పష్టమైన ప్రకాశవంతమైన ఫోటోలను తీయడానికి అనుమతిస్తుంది. దీనిలో 4జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..