Okinawa EV scooters : ఒకినావా సరికొత్త రంగుల ప్రపంచం.. ఏకంగా ఎనిమిది రంగుల్లో స్కూటర్ల రిలీజ్..
ఈవీ వాహనాల్లో తమదైన శైలిని ప్రదర్శిస్తున్న ఒకినావా కంపెనీ తన మోడల్స్‌కు ఏకంగా ఎనిమిది కొత్త రంగు ఎంపికలను జోడించింది. ముఖ్యంగా ప్రైజ్ ప్రో, ఐప్రైజ్ ప్లస్ స్కూటర్స్‌లో ఈ రంగులు అందుబాటులో ఉంటాయి.
మార్కెట్ ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల ట్రెండ్ నడుస్తుంది. ఫోర్ వీలర్స్‌తో పోల్చుకుంటే ఎక్కువ టూ వీలర్స్ మార్కెట్‌తో తమ సత్తా చూపుతున్నాయి. ముఖ్యంగా పెరుగుతున్న ఇందన ధరలకు ప్రత్యామ్నాయంగా మధ్య తరగతి ప్రజలు ఈవీ వాహనాల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా టూ వీలర్ ఈవీ వాహన కంపెనీలు కూడా సరికొత్త మోడల్స్‌తో పాటు సరికొత్త రంగుల్లో ఈవీ స్కూటర్లను అందుబాటులోకి తీసుకువస్తుంది. ఇదే కోవలో ఈవీ వాహనాల్లో తమదైన శైలిని ప్రదర్శిస్తున్న ఒకినావా కంపెనీ తన మోడల్స్‌కు ఏకంగా ఎనిమిది కొత్త రంగు ఎంపికలను జోడించింది. ముఖ్యంగా ప్రైజ్ ప్రో, ఐప్రైజ్ ప్లస్ స్కూటర్స్‌లో ఈ రంగులు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం ప్రైజ్‌ప్రో ధర రూ. 99,645 (ఎక్స్-షోరూమ్), ఐప్రైస్ ప్లస్ ధర రూ. 1,45,965 (ఎక్స్-షోరూమ్)గా ఉన్నాయి. ఒకినావా ప్రైజ్ ప్రో, ఒకినావా ఐ ప్రైజ్ ప్లస్ స్కూటర్లు ప్రస్తుతం ఎలక్ట్రిక్ గ్రీన్, ఓషన్ బ్లూ, మావ్ పర్పుల్, లిక్విడ్ మెటల్, మిలిటరీ గ్రీన్, మోచా బ్రౌన్, సీఫోమ్ గ్రీన్, సన్ ఆరెంజ్ వంటి రంగుల్లో వినియోగదారులను పలకరించనున్నాయి.
ఒకినావా ప్రైజ్ ప్రో 2.08 కేడబ్ల్యూహెచ్ లిథియం-అయాన్ డిటాచబుల్ బ్యాటరీని 3-4 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయగలదు. ఈ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 56 కిలోమీటర్లుగా ఉంది. అంటే దాదాపు కిలోమీటర్‌కు కేవలం 14 పైసలుమాత్రమే ఖర్చు అవుతుంది. పునురుత్పత్తి శక్తితో పాటు ఎల్‌ఈడీ లైట్లు, ఈ-ఏబీఎస్ టెక్నాలజీ వచ్చే ఈ బైక్ అధిక సంఖ్యంలో అమ్ముడుపోతుంది. అలాగే ఒకినావా ఐ ప్రైజ్ ప్లస్ 3.6 కేడబ్ల్యూహెచ్ లిథియం-అయాన్ వేరు చేయగలిగిన బ్యాటరీని కలిగి ఉంంటుంది. ఇది ఒక్కసారి పూర్తి ఛార్జ్‌పై 137 కిమీల మైలేజ్ వస్తుంది. ఒకినావా కంపెనీ ఇటీవలే 250,000 యూనిట్ల విక్రయాల మైలురాయిని అధిగమించింది. ఈ ఘనతను సాధించిన మొదటి అసలైన పరికరాల తయారీదారు (ఓఈఎం)గా అవతరించింది. 2,50,000వ యూనిట్ ప్రైజ్ ప్రోగా ఉంది. ఇది రాజస్థాన్‌లోని కంపెనీ తయారీ కర్మాగారం నుంచి విడుదలైందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. అయితే 2025 నాటికి వాల్యూమ్‌లలో 1,000,000 యూనిట్లను చేరుకోవడం ఒకినావా యొక్క తదుపరి లక్ష్యమని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ప్రైస్ ప్రో. ఐ ప్రైజ్ ప్లస్‌లతో పాటు ఓకి-90, డ్యూయల్ 100, రిడ్జ్ 100, రిడ్జ్ ప్లస్ వంటి హైస్పీడ్ స్కూటర్లను ఒకినావా వినియోగదారులకు అందుబాటుంలో ఉంచింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..