Fujiyama EV Scooters : మార్కెట్‌లోకి ఫూజియామా ఈవీ స్కూటర్.. ధర తక్కువ.. ఫీచర్లు ఎక్కువ
ముఖ్యంగా మధ్యతరగతి వాళ్లను టార్గెట్ చేస్తూ ఫుజియామా కంపెనీ ఐదు ఎలక్ట్రిక్ స్కూటర్‌లను పరిచయం చేసింది. వీటి ప్రారంభ ధర రూ. 49,499గా ఉంటుంది. అలాగే గరిష్టంగా రూ. 99,999 వరకు ఉంటుందని కంపెనీ వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి.

భారత్‌లోని ఆటో మొబైల్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఈవీ వాహనాల ట్రెండ్ నడుస్తుంది. అన్ని కంపెనీలు సరికొత్త ఫీచర్స్‌తో ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగదారులకు అందించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఏ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తీసుకున్నా.. పెట్రో వాహనంతో పోటీ పడాలంటే కచ్చితం రూ.90 వేల నుంచి రూ. లక్ష దాటి పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. దీంతో మధ్యతరగతి ప్రజలకు ఇంత ఖర్చు పెట్టి ఈవీ వాహనం కొనడం కొంచెం ఇబ్బందిగా ఉంది. దీంతో తక్కువ ధరల్లో ఎవరూ ఈవీ వాహనాలు రిలీజ్ చేస్తారో? అని ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి వాళ్లను టార్గెట్ చేస్తూ ఫుజియామా కంపెనీ ఐదు ఎలక్ట్రిక్ స్కూటర్‌లను పరిచయం చేసింది. వీటి ప్రారంభ ధర రూ. 49,499గా ఉంటుంది. అలాగే గరిష్టంగా రూ. 99,999 వరకు ఉంటుందని కంపెనీ వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి. ఈ-స్కూటర్ల శ్రేణిలో నాలుగు తక్కువ స్పీడ్ మోడల్స్ ఉన్నాయి. అవి స్పెక్ట్రా ప్రో, స్పెక్ట్రా, వెస్పార్, థండర్ మోడల్స్. ఇందులో ఓజోన్ ప్లస్ ఒక హై-స్పీడ్ మోడల్ అని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. కంపెనీ ప్రతినిధులు చెబుతున్న దాని ప్రకారం ఈ స్కూటర్ ఓ చార్జ్‌పై 140 కిలో మీటర్లను దాటి మైలేజ్ ఇస్తుందని పేర్కొంటున్నారు. ఓ సారి ఫుల్‌గా చార్జ్ చేయాలంటే 2 నుంచి 3 యూనిట్లు మాత్రమే ఖర్చు అవుతుంది. ఫుజియామా తన స్కూటర్స్‌లో ఇచ్చే బీఎల్‌డీసీ మోటార్ అత్యంత సమర్థవంతమైన మరియు తక్కువ నిర్వహణను కలిగి ఉంది.
రాబోయే కొద్ది నెలల్లో, కంపెనీ రెండు ఈ-బైక్‌లను విడుదల చేయడానికి యోచిస్తోంది. మొదటిది క్లాసిక్ ఇ-స్కూటర్ దీని ధర రూ. 69,999గా ఉంటుంది. అలాగే 160 కి.మీ మైలేజ్ ఇస్తుంది. అలాగే రూ. 99,999 ధరలో మరో ఈ-స్కూటర్‌ను ప్రారంభించాలని యోచిస్తుంది. ఫుజియామా రాబోయే నెలల్లో ఇ-లోడర్, కమర్షియల్ త్రీ వీలర్లను కూడా ప్రారంభించాలని యోచిస్తోంది. ముఖ్యంగా కంపెనీ ప్రస్తుతం పాన్ ఇండియా నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసే పనిలో ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఫుజియామా ఇటీవలే రాజస్థాన్‌లోని జైపూర్‌లో తమ ప్రత్యేక షోరూమ్ రుద్ర శక్తి మోటార్స్‌ను ప్రారంభించింది. ఇక్కడ ఫుజియామా కంపెనీ విస్తృత శ్రేణి ఈ-స్కూటర్లు ప్రదర్శిస్తారు. అలాగే ఇక్కడే తమకు నచ్చిన స్కూటర్‌ను ప్రీ బుక్ చేసుకునే అవకాశం కూడా కంపెనీ కల్పించింది. ఫుజియామా సంస్థ ప్రస్తుతం హిమాచల్‌ప్రదేశ్‌లో అత్యాధునిక ప్లాంట్‌ను నిర్మించడానికి మూడు దశల్లో రూ. 150 కోట్లకు పైగా పెట్టుబడి పెడుతుంది. ఏటా 20,00,000 యూనిట్లను ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నామని ఆ సంస్థ సీఈఓ ఉదిత్ అగర్వాల్ చెబుతున్నారు.



మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి