Okinawa Scooter: హోలీ రోజున ఒకినావా బిగ్ సర్‌ప్రైజ్.. స్పెషల్ ఎడిషన్ రిలీజ్ చేస్తున్నట్లు టీజర్ విడుదల..

ఈ ఈవీ వాహనాల్లో తనదైన మార్క్ చూపిస్తున్న కంపెనీ ఒకినావా తన ఈవీ స్కూటర్స్‌లో హెలీ స్పెషల్ ఎడిషన్‌ను రిలీజ్ చేస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు కంపెనీ ఓ టీజర్‌ను కూడా రిలీజ్ చేసింది. అయితే ఈ స్కూటర్ ప్రైస్ ప్రో లేదా ఐ ప్రైస్ అయ్యే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Okinawa Scooter: హోలీ రోజున ఒకినావా బిగ్ సర్‌ప్రైజ్.. స్పెషల్ ఎడిషన్ రిలీజ్ చేస్తున్నట్లు టీజర్ విడుదల..
Okinawa
Follow us
Srinu

|

Updated on: Mar 08, 2023 | 1:15 PM

భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల హవా నడుస్తుంది. కంపెనీలు ఇబ్బడిముబ్బడి ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్‌లో రిలీజ్ చేస్తున్నాయి. ముఖ్యంగా పట్టణవాసులు ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు ఇష్టపడుతున్నారు. ఈ ఈవీ వాహనాల్లో తనదైన మార్క్ చూపిస్తున్న కంపెనీ ఒకినావా తన ఈవీ స్కూటర్స్‌లో హెలీ స్పెషల్ ఎడిషన్‌ను రిలీజ్ చేస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు కంపెనీ ఓ టీజర్‌ను కూడా రిలీజ్ చేసింది. అయితే ఈ స్కూటర్ ప్రైస్ ప్రో లేదా ఐ ప్రైస్ అయ్యే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలాగే ఈ టీజర్‌లో కూడా వైలేట్, పర్పుల్, ఎరుపు, పింక్ వంటి రంగులు వాడారు. ఈ నేపథ్యంలో ఈ స్పెషల్ ఎడిషన్ స్కూటర్ ఏ రంగులో రిలీజ్ చేస్తుందో అంచనా వేయలేకపోతున్నారు. అయితే ప్రైస్ ప్రో కానీ, ఐ ప్రైస్ కానీ ఈ రెండు స్కూటర్లలో ఏదో ఒకటి రిలీజ్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఆ స్కూటర్లు ప్రస్తుతం అందించే ఫీచర్లు ఏంటో ఓ లుక్కేద్దాం.

ఐ ప్రైస్ ప్లస్ ఫీచర్లు ఇవే

ఐ ప్రైస్ ప్లస్ ధర రూ.1,45,965. ఈ స్కూటర్‌ను బుక్ చేసిన రెండు నెలలకు కస్టమర్ల చేతికి అందుతుంది. ఈ స్కూటర్ ప్రీ బుకింగ్ ధర రూ.2000గా ఉంది. ఈ స్కూటర్‌ను ఓ సారి చార్జ్ చేస్తే 137 కిలోమీటర్లు మైలేజ్ వచ్చే అవకాశం ఉంది. ఈ స్కూటర్‌లోని మోటర్ ద్వారా 2700 వాట్స్ గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ స్కూటర్ గంటకు 50 కిలో మీటర్ల గరిష్ట స్పీడ్‌తో వెళ్తుంది. 3.6 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. అలాగే ఈ బ్యాటరీని చార్జ్ చేయడానికి 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది. 

ప్రైస్ ప్రో ప్రత్యేకతలు

ఈ ప్రైస్ ప్రో ధర రూ.99,645. ఈ స్కూటర్‌ కావాలంటే రూ.2000 ప్రీ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. 2700 వాట్స్ గరిష్ట పవర్‌ను ఉత్పత్తి చేసే మోటర్ ఉంటుంది. ఈ స్కూటర్‌ను ఓ సారి చార్జి చేస్తే 81 కిలోమీటర్ల మైలేజ్ వస్తుంది. అలాగే గంటకు 50 కిలో మీటర్ల గరిష్ట స్పీడ్‌తో వెళ్తుంది. ఈ స్కూటర్‌లో కేవలం 2.8 కేడబ్ల్యూహెచ్ రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. అలాగే ఈ బ్యాటరీని ఫుల్‌గా చార్జ్ చేయడానికి 2-3 గంటల సమయం పడుతుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!